Latest Updates
-
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు
ఇక కష్టమే తమ్ముడూ: ఓయో సంచలన నిర్ణయం..రూల్స్ మార్పు,పెళ్లికాని జంటలకు నో ఎంట్రీ!
ఓయో పేరు గురించి తెలియని యువత తక్కువే ఉంటారు. ఐడీ ఫ్రూఫ్ చూపిస్తే చాలు ఓయోలో రూమ్ తీసుకోవచ్చు. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉండటం, తక్కువ ధరలోనే మెరుగైన వసతులు, అడిగేవాడెవడూ లేకపోవడంతో ఓయో రూమ్ కి వెళ్లేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలామంది పెళ్లికాని జంటలు కూడా శృంగార కార్యకలాపాల కోసం ఓయో రూమ్ లనే ఎంచుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. కొన్ని ఏరియాల్లో ఓయో అంటేనే శృంగార కార్యకలాపాలకు అడ్డా,అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటల్ అనే ముద్ర పడిపోయింది. అయితే ఈ ముద్ర చెరిపేయాలని ఓయో కంపెనీ నిర్ణయించినట్లయింది. అందుకే తాజాగా ఓయో కంపెనీ తన చెక్ ఇన్ నిబంధనలను సవరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ఓయో కొత్త చెక్ ఇన్ రూల్స్ ను ప్రవేశపెట్టింది. దీంతో పెళ్లికాని జంటలు ఇకపై ఓయో రూమ్ కి వెళ్లలేరు.
రిలేషన్ షిప్ ఫ్రూఫ్ తప్పనిసరి
ఓయో కొత్త రూల్ ప్రకారం ఆన్ లైన్ లో చేసిన బుకింగ్ లతో సహా చెక్ ఇన్ సమయంలో రిలేషన్ కి సంబంధించిన ఫ్రూఫ్ సమర్పించమని జంటలందరూ అడగబడతారు. అయితే స్థానిక సామాజిక సెన్సిబిలిటీకి అనుగుణంగా కపుల్ బుకింగ్స్ తిరస్కరించడానికి OYO తన భాగస్వామి హోటల్ ల విచక్షణకు అధికారం ఇచ్చిందని కంపెనీ తెలిపింది.

మీరట్ లో అమలు
OYO కంపెనీ ఈ పాలసీని మొదటగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లోని తన భాగస్వామ్య హోటళ్లకు దీన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలని తాజాగా నిర్దేశించింది. గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశముందని సమాాచారం. ఓయో తన కొత్త నిర్ణయం గురించి మీరట్ లోని పబ్లిక్ నుంచి గతంలో అభిప్రాయాన్ని సేకరించింది. అంతేకాకుండా కొన్ని ఇతర నగరాల నివాసితులు పెళ్లికాని జంటలను OYO హోటళ్లలో చెక్ ఇన్ చేయడానికి అనుమతించకూడదని పిటిషన్ కూడా వేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఓయో తన రూల్స్ సవరించినట్లు సమాచారం.
బాధ్యతాయుతమైన ఆతిథ్యం
సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను కొనసాగించడానికి ఓయో కట్టుబడి ఉన్నట్లు OYO నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తున్నప్పుడు తాము నిర్వహించే మైక్రో మార్కెట్ లలో చట్ట అమలు, ప్రజలు చెప్పేది వినడం,దానికి అనుగుణంగా పని చేసే మా బాధ్యతను కూడా మేము గుర్తించాం అని శర్మ తెలిపారు.
బ్రాండ్ ఇమేజ్, కస్టమర్ ట్రస్ట్
OYO కార్యక్రమంలో భాగంగా కాలం చెల్లిన అవగాహనను మార్చుకుని.. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారం, మతపరమైన, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని అందించే బ్రాండ్ గా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. కస్టమర్ ట్రస్ట్, లాయల్టీని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
పాన్ ఇండియా ఇనిషియేటివ్స్
పోలీసులు, హోటల్ భాగస్వాములతో సేఫ్ హాస్పిటాలిటీ జాయింట్ సెమినార్‌లు, అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను బ్లాక్ లిస్ట్ చేయడం, OYO బ్రాండింగ్‌ని ఉపయోగించి అనధికారిక కార్యకలాపాలకు పాల్పడే హోటళ్లపై చర్యలను ప్రారంభించడం వంటి పాన్ ఇండియా కార్యక్రమాలను OYO ప్రారంభించింది.
పెళ్లికాని జంట భారతదేశంలోని హోటల్‌లో ఉండవచ్చా?
పెళ్లికాని జంటలు హోటల్‌లో ఉండడాన్ని దేశంలోని ఏ చట్టం నిషేధించలేదు. అయితే ఒక జంటను చెక్ ఇన్ చేయడానికి అనుమతించడం అనేది హోటల్ యజమానులు లేదా నిర్వాహకుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications