Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రభాస్ ఇంట్లో కల్పవృక్షం!..రెబల్ స్టార్ జాతకం మారిపోతుందా?
రెబల్ స్టార్ గా టాలీవుడ్ లో గుర్తింపు పొంది బాహుబలి సినిమా విడుదల పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అభిమానులు డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభాస్..తన లగ్జరీ లైఫ్ స్టైయిల్ కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన పెద్ద బంగ్లా, విశాలమైన ఫామ్‌హౌస్, అత్యాధునిక కార్ల కలెక్షన్ ఇప్పటికే వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ తన ఇంటికి తీసుకువచ్చిన ఓ అరుదైన, అదృష్ట వృక్షం గురించి చర్చ జరుగుతోంది.
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం, జ్యోతిష్యం, వాస్తు వంటి నమ్మకాలు ఎక్కువ. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే చోట ఇలాంటివి సర్వసాధారణం. ప్రభాస్ కూడా ఇందుకు అతీతుడేమీ కాదు. కోరిన కోరికలు తీరుస్తుందని, ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుందని భావించే అత్యంత శక్తివంతమైన కల్పవృక్షాన్ని ప్రభాస్ తన కొత్త ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీని విలువ ఏకంగా కోటి రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. భారతదేశంలో ఈ అరుదైన వృక్షం కేవలం ఇద్దరు ముగ్గురి దగ్గరే ఉందట.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో ఈ కల్పవృక్షం ఉందని, ఆ తర్వాత ప్రభాస్, తన దగ్గర మాత్రమే ఈ వృక్షం ఉందని ఎక్స్ పీరియం ఇకో పార్క్ వ్యవస్థాపకుడు రామ్ దేవ్ సంచలన విషయం బయటపెట్టారు. అంబానీకి, ప్రభాస్ కు ఆ చెట్టును ఇచ్చింది తానేనని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రభాస్ కు చెట్లంటే చాలా ఇష్టమని చెప్పారు. పెద్ద చెట్లంటే ఆయనకు చాలా ఎక్కువ ఇష్టం అన్నారు. ఆయన ఇంట్లో నాలుగు కల్ప వృక్షాలున్నాయని ఆయన అన్నారు. ప్రభాస్ తన కొత్త ఇంట్లో ఈ పవిత్రమైన చెట్టును నాటుతున్నారని ఆయన చెప్పారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు వందల కోట్లు సంపాదించే డార్లింగ్‌కు కోటి రూపాయలు పెద్ద విషయం కాదు అని కామెంట్లు చేస్తున్నారు.
హిందూ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది కల్పవృక్షం. దేవతల అడవిలో కనిపించే ఈ చెట్టు భక్తుల కోరికలను తీర్చే అద్భుతమైన వృక్షంగా ప్రసిద్ధి చెందింది. శాంతి, సంతానం, సంపదల కోసం కొందరు ఈ చెట్టును ఆలయ ప్రాంగణాల్లో లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాల సమయంలో ఇంటి వెనుక భాగంలో నాటుతారు. ఈ చెట్టు విలువ దాని వయస్సును బట్టి నిర్ణయించబడుతుంది. ప్రభాస్ ఇంటికి వచ్చిన ఈ కల్పవృక్షం వందల సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. ఇది అదృష్టాన్ని, శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు. అందుకే దీని ధర కోటి రూపాయలు దాటిందని తెలుస్తోంది.
స్వర్గం నుంచి భూమ్మీదకు
హిందూ పురాణాలలో అనేక వృక్షాలను కల్పవృక్షంతో పోలుస్తారు. పారిజాత వృక్షాన్ని కూడా కల్పవృక్షం అని పిలుస్తారు. ఈ చెట్టు స్వర్గంలో మాత్రమే ఉండేదని, అర్జునుడు దానిని భూమికి తీసుకువచ్చాడని నమ్ముతారు. మరి ప్రభాస్ ఇంటికి వచ్చిన ఈ అదృష్ట వృక్షం ఆయనకు ఎలాంటి శుభాలు కలుగజేస్తుందో చూడాలి.



Click it and Unblock the Notifications