Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
ఈ రాశుల వారు స్టాక్స్ ట్రేడింగ్‌లో విశేషంగా రాణిస్తారు.. మీ రాశి ఉందా చూస్కోండి
వేదజ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక ప్రతి వ్యక్తిపై ఉంటుంది. వారి రాశి, నక్షత్రం లాంటి జాతకాలను బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. అలాగే ఏయే రాశి ఉన్న వాళ్లు ఎలాంటి వృత్తిలో, రంగంలో రాణిస్తారో కూడా వేదజ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పవచ్చు. కొన్ని రాశుల వారు కళా రంగంలో, మీడియా రంగంలో రాణిస్తారు, మరికొందరు వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు పొందుతారు, మరికొన్ని రాశుల వారు క్రీడల్లో రాణించగలరు, ఇంకొందరు విద్యా, వైద్య రంగాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు అందుకుంటారు.
అలాగే వేదజ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారు స్టాక్ మార్కెట్ లో, ట్రేడింగ్ లో విశేషంగా రాణిస్తారు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారు స్టాక్స్ మార్కెట్ లో గొప్ప లాభాలు అందుకుంటారు. అంతర్ దృష్టి, సంకల్పం, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి వృశ్చిక రాశి వారిని పర్యాయపదంలా చూస్తారు. అలాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో వారు ముందుంటారు.
వృశ్చిక రాశి వారికి ఉండే కొన్ని సహజసిద్ధంగా వచ్చే లక్షణాల వల్ల వారు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. స్టాక్‌లో ఏదైనా తప్పు జరిగినప్పుడు లేదా మార్కెట్ ట్రెండ్ మారబోతున్నప్పుడు వారు గ్రహించగలరు. స్టాక్స్ ట్రేడింగ్ లో ఇది చాలా అవసరం. వృశ్చిక రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునేముందు చాలా ఆలోచిస్తారు. ఆచితూచి వ్యవహరిస్తారు. వారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు. విజయం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు.
వృశ్చిక రాశి వారు రిస్క్ తీసుకోవడంలో ముందుంటారు. లాభం కోసం తమ డబ్బును రిస్క్ లో పెట్టి మంచి లాభాలు పొందగలుగుతారు. రిస్క్ తీసుకుంటేనే స్టాక్ మార్కెట్ లో పెద్ద రివార్డులు, లాభాలు అందుకుంటారు.
వృషభరాశి:
వృషభ రాశి వారికి సహనం, క్రమశిక్షణ ఎక్కువ. ఇది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో చాలా ముఖ్యమైనవి. జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. వృషభరాశి వారు చాలా సహనంతో ఉంటారు. స్టాక్స్ కొనడానికైనా, అమ్మడానికైనా తొందరపాటుతో వ్యవహరించరు. అలాగే ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు.
వీరి క్రమశిక్షణ వల్ల మంచి లాభాలు అందుకుంటారు. తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని లాభాలు అందుకుంటారు.
కన్య రాశి:
కన్య రాశి వారికి సహజసిద్ధంగా వచ్చే లక్షణాలతో స్టాక్ మార్కెట్ లో విశేషంగా రాణిస్తారు. కన్య రాశి వారికి తెలివితేటలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఎక్కువ. వాటి వల్ల స్టాక్స్ ను ఎంచుకోవడంలో చాలా చాకచక్యంగా ఉంటారు.
కన్య రాశి వారు చాలా తెలివైనవారు. సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పెట్టుబడిలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. కన్య రాశి వారికి విశ్లేషణాత్మకంగా వ్యవహరించడం సహజంగా వస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications