Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు బాగా డబ్బులు సంపాదిస్తారు.. ఇందులో మీరు కూడా ఉన్నారా?
రాశిచక్రం ఒకరి జీవితం, ఆ జీవితంలో అతను ఎదుర్కునే సమస్యలు, అతను సాధించే ఘనతలు, అలవాట్లు, సామర్థ్యాలు మొదలైనవాటిని ఎలా వెల్లడిస్తుందో, అదే విధంగా ఒకరి పుట్టిన తేదీ ఆ వ్యక్తికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తుంది.
సంఖ్యాశాస్త్రం అనేది సంఖ్యలపై ఆధారపడిన జ్యోతిషశాస్త్రానికి సంబంధించిన ఒక విభాగం. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తిలోని గుణగణాలే కాకుండా డబ్బు పరంగా వ్యక్తి ఎలా ఉంటాడో కూడా తెలుస్తుంది. అయితే, నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వారు డబ్బులు బాగా సంపాదిస్తారు. డబ్బును కూడా ఏ విధంగా నిర్వహించాలో ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు బాగా తెలుస్తుంది. ఇంతకీ ఆ తేదీలు ఏంటి? ఏ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఈ విధంగా రాణించగలుగుతారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

8వ తేదీన పుట్టిన వారు
ఏ నెలలో అయినా 8వ తేదీన పుట్టిన వ్యక్తులు సహజంగానే చాలా శ్రేయస్సును కలిగి ఉంటారు. ఈ తేదీలో జన్మించిన వ్యక్తుల జీవితం ఆర్ధిక వృద్ధితో ముడిపడి ఉంటుంది. ఈ తేదీలో జన్మించిన వ్యక్తులకు డబ్బుల నిర్వహణపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. దీర్ఘ కాలంలో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఆ డబ్బులను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది వీరికి బాగా తెలిసి ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు తెలివైన పెట్టుబడులు పెడతారు. వ్యాపార వెంచర్ల ద్వారా సంపదను నిర్మించుకుంటారు.
17వ తేదీన పుట్టిన వ్యక్తులు
ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు డబ్బులు చాలా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తారు. అలాగే సంపాదన కూడా అదే విధంగా ఉంటుంది. ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా బలమైన పట్టుదలతో ఉంటారు. డబ్బులు సంపాదించే విషయంలో ఎలాంటి కష్టాలను అయినా అధిగమించగలరు. డబ్బులు సంపాదించే విషయంలో వారు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకుంటారు. అలాగే ఆ లక్ష్యాలను సులభంగా సాధించుకోగలుగుతారు.
4వ తదీన జన్మించిన వ్యక్తులు..
4వ తేదీన జన్మించిన వ్యక్తులు క్రమశిక్షణ కలిగి ఉంటారు. అలాగే వారిలో కస్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. అలాగే ఈ వ్యక్తులు ఆర్థికంగా వివేకం కలిగి ఉంటారు. నిధులను తెలివిగా ప్లాన్ చేయడం, వాటిని సరైన పద్దతిలో నిర్వహించుకోవడం వారికి చాలా తెలుసు. పెట్టుబడి విషయంలో వీరు సరైన నిర్ణయాలను తీసుకోవడంతో పాటు వ్యాపారాలను ఎలా సరైన పద్దతిలో నిర్వహించుకోవాలి అనేది తెలిసి ఉంటుంది.
22వ తేదీన జన్మించిన వ్యక్తులు
ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు ఆర్థికంగా గొప్ప గొప్ప విజయాల్ని సాధించే అవకాశం ఉంటుంది. వారి లక్ష్యాలను అనుగుణంగా కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. డబ్బు సంపాదించడంలో వీరికి స్పష్టమైన ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలు ఉంటాయి. పెట్టుబడుల్లో తెలివిగా ఆలోచించి అమితమైన వృద్ధిని సాధిస్తారు.
13వ తేదీన జన్మించిన వ్యక్తులు..
13వ తేదీన జన్మించిన వ్యక్తులు అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ నైపుణ్యాలను కలిగి ఉంటారు. అలాగే ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు బాగా విశ్లేషణాత్మకంగా ఉంటారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి విశ్లేషణాత్మక నైపుణ్యాల కారణంగా, వారు తమ జీవితంలో చాలా డబ్బు సంపాదించగలుగుతారు.
గమనిక: ఈ కథనంలోని సమాచారం, జోతిష్య వివరణలు కేవలం మీకు జ్ఞానం అందించేందుకు మాత్రమే అందించబడింది. ఈ కథనం ఆధారంగా మీకు ఎలాంటి నష్టాలైన కలిగిస్తే వాటికి బోల్డ్ స్కై తెలుగు బాధ్యత వహించదు. ఈ సమాచారం ఆధారంగా మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా గుర్తింపుపొందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని Boldsky.com మీకు సూచిస్తుంది.



Click it and Unblock the Notifications