Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు.. అందులో మీరూ ఉన్నారేమో చెక్ చేసుకోండి!
ప్రస్తుత కాలంలో న్యూమరాలజీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మంది తమ జీవితంలో మార్పుల కోసం న్యూమరాలజీ ప్రకారం తమ పేరును మార్చుకోవడంతో పాటు తమ అదృష్ట సంఖ్యను మార్చుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద సినిమా స్టార్లు సైతం కెరీర్‌లో ఎదిగేందుకు, తమ పేరును స్క్రీన్ పేరుకు తగ్గట్టుగా, న్యూమరాలజీకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటారు.
ఇంతటి ప్రాధ్యాన్యత ఉన్న ఈ న్యూమరాలజీ ప్రకారం 9వ సంఖ్యతో పుట్టిన వ్యక్తులు అదృష్టవంతులని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. 9, 18, 27వ తేదీల్లో పుట్టిన వారిని తొమ్మిదో నంబర్ కలిగిన వ్యక్తులుగా పరిగణించబడతారు. అయితే ఈ వ్యక్తుల్లో ప్రత్యేకత ఏంటి, ఈ వ్యక్తులు ఎలాంటి స్థాయికి వెళ్తారో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

9వ సంఖ్య కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే..
- ఈ సంఖ్య కలిగిన వ్యక్తులు చాలా కీర్తి, సంపదలతో తమ జీవితాన్ని కొనసాగుతారట. సమాజంలో ఉన్న స్థానంలో ఉండడంతో పాటు, సమాజాన్ని శాసించే స్థాయికి వేడుగుతారట. అలాగే ఈ వ్యక్తులు చాలా తెలివిగలవారని, చాలా తెలివితో ఉంటారట. వీరిలో చాలా పట్టుదల ఉంటుందని, ఒకపని చేయాలని నిర్ణయించుకుంటే, తమ నిర్ణయం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్లరని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
- వీరు అనుకున్నది తమ జీవితంలో సాధించే వరకు విశ్రమించరని పేర్కొంటున్నారు. వీరు జీవితంలోనే కాదు మానవత్వంలోనూ ఉన్నత స్థాయిలో ఉంటారని, అలానే హుందాగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సంఖ్య కలిగిన వారికి చాలా తెలివి ఉంటుంది. ఆ తెలివితోనే డబ్బు సంపాదించే మార్గాలు అనేకం సృష్టించుకుంటారు.
- వీరు చాలా అరుదుగా డబ్బు కొరతతో ఉంటారు. వీరు ఏ విధంగానైనా డబ్బును సంపాదించుకుంటారు. వీరికి సహాయం గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. దాని కారణంగా వీరికి కూడా సహాయం చేసే వ్యక్తులు అధికంగానే ఉంటారు. 9వ సంఖ్య కలిగిన వ్యక్తులు చాలా ఉన్నతమైన, రిచ్ జీవితాన్ని గడపాలని చూస్తుంటారు. అందుకోసమే శ్రమిస్తూ, తమ పనిని చేసుకుంటూ పోతారు.
- ఈ 9వ సంఖ్య కలిగిన వ్యక్తులు చాలా పట్టుదలతో, కుటుంబం కోసం ముందుగా నిలబడేవారిగా ఉంటారు. కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత డబ్బు అయినా ఖర్చుపెడతారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా కలిగిన వారు. ఈ వ్యక్తులు తమ సొంత నిర్ణయంపై ఆధారపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల అభిప్రాయాలతో ప్రభావితం అవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు రాజులా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. తమ మాటే అందరూ వినాలనే మనస్తత్వంతో జీవిస్తారు.
ఈ లక్షణాలే మైనస్
- ఈ 9వ సంఖ్య కలిగిన వ్యక్తుల్లో ఎంత పాజిటివిటీ ఉన్నా.. కొంత మొత్తంలో మైనస్ కూడా ఉంది. ఈ వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు అధికంగా తీసుకుంటారు. దీని కారణంగా జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తింటారు. ఆ నిర్ణయాన్ని తమ ఎదుగుదలను నివారిస్తుంటుంది. ఈ వ్యక్తులకు ధైర్యం కూడా ఎక్కువగా ఉండడంతో కొన్ని అనుకోని సమస్యలకు అది కారణం అవుతుంది.
- ఈ వ్యక్తులు కొన్ని కొన్ని విషయాల్లో చాలా సున్నితంగా, ఎవరైనా వెంటనే నమ్మేస్తుంటారు. ఆ నమ్మకం మూలానా జీవితంలో చాలా కోల్పోతారు. కొన్ని సార్లు డబ్బు, ఇంకొన్ని సార్లు విలువను కోల్పోతూ బాధపడుతుంటారు. 9వ సంఖ్య ఉన్న వ్యక్తులు తమలో ఉన్న ఈ మైనస్‌ను చక్కదిద్దుకుంటే ఇక వారికి తిరుగు ఉండదు.
గమనిక: ఈ కథనంలో మేము అందించిన విషయాలన్నీ న్యూమరాలజీ ప్రకారం, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమైనవని మేము ధ్రువీకరించడం లేదు.



Click it and Unblock the Notifications











