Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Little finger: చిటికెన వేలుని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చూడండి
మనలో ప్రతి ఒక్కరికీ ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. ఓ వ్యక్తి క్యారెక్టర్ ను అనేక రకాలుగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి ముఖం, కళ్ళు, చెవులు, ముక్కు,వేళ్లు మొదలైనవి ఆ వ్యక్తి స్వభావం, అలవాట్లు,రిలేషన్స్ తో వ్యవహరించే విధానం గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. అయితే ఒక వ్యక్తి చిటికెడు వేలు అతని గురించి ఆసక్తికరమైన లక్షణాలను వెల్లడిస్తుందని మీకు తెలుసా? అవును, ఒకరి చేతిపై ఉన్న గీతలు ఒకరి భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నట్లే చిటికెన వేలు పరిమాణం ఒకరి క్యారెక్టర్ ని తెలియజేస్తుంది.
చిటికెన వేలు ఉంగరపు వేలు పైన ఉన్న రేఖకు పైన ఉంటే
మీ చిటికెన వేలు మీ ఉంగరపు వేలు పైన ఉన్న రేఖకు పైన ఉంటే మీరు ఇతరులతో బాగా కలిసిపోలేరు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో కూడా మీరు మీ మనస్సువిప్పి మాట్లాడరు. ఎల్లప్పుడూ ఎవరిపట్ల అయినా నిజాయితీగా ఉంటారు. ఎల్లప్పుడూ ఇతరుల నుండి పక్కకు జరిగి,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. దీని వల్ల చాలా మంది మిమ్మల్ని అహంకారి అని తప్గా అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ మీ గురించి బాగా తెలిసిన వారికి మీరు ఎలా ఉంటారో తెలుసు. ఓవరాల్ గా మిమ్మల్ని మీరు ఇతరులకు నిరూపించుకోవాలని అనుకోరు.

ఉంగరపు వేలు పైభాగం కంటే చిటికెన వేలు పొడవుగా ఉంటే
మీ ఉంగరపు వేలు పైభాగం కంటే మీ చిటికెన వేలు పొడవుగా ఉంటే మీరు చాలా విశ్వాసపాత్రులు, చాలా సున్నితంగా ఉంటారు. మీకు బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్ ఉంటే వారే మీకు ప్రపంచం అని అర్థం. మీ జీవితంలో వారికి ప్రాధాన్యత ఇస్తారు. వారితో లోతుగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎల్లప్పుడూ సంతోషకరమైన వ్యక్తిగా కనిపిస్తారు. జీవితంలో మీ పని,విద్య,కుటుంబం లేదా స్నేహితులు ఏదైనా మీరు విలువైనదని భావించే దేనికైనా పూర్తిగా అంకితం అయి ఉంటారు. ఈ రకమైన ఆలోచన మీరు అనుకున్నది సాధించడంలో సహాయపడుతుంది. మీరు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ మీరు కూల్ గా ఉంటారు.
చిటికెన వేలు ఉంగరపు వేలుపై ఉన్న రేఖ కంటే తక్కువగా ఉంటే
చిటికెన వేలు ఉంగరపు వేలుపై ఉన్న రేఖ కంటే తక్కువగా ఉంటే వారు ఉల్లాసమైన వ్యక్తులు. నెగిటివిటీ వీరి దరి చేరదు. ఎవరి తప్పులను అయినా సులభంగా క్షమించగలరు,మర్చిపోతారు. ఏదో మనసులో పెట్టుకుని బయట ఏదో మాట్లాడే రకం కాదు. మనసులో ఏముందో అదే స్పష్టంగా మాట్లాడతారు. చాలా చురుకైన వ్యక్తిగా ఉంటారు. భాగస్వామితో లేదా ప్రియమైన వారితో వాగ్వాదం లేదా గొడవలు జరిగినప్పుడు వీరు చేసే మొదటి పని క్షమాపణ చెప్పడం. పరిచయం మీకు ఓదార్పునిస్తుంది, మీకు భద్రతా భావాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications