Latest Updates
-
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం
ఆకాశంలో అద్భుతం..అరుదైన గ్రహ చతుష్టయం..100 ఏళ్లకు ఒకసారి ఇలా
అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావనుంది. ఈ నెల 17,18 తేదీల్లో సమాంతర రేఖలో నాలుగు ముఖ్య గ్రహాలు రావడంతో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనమివ్వనుంది. అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి ఒకే రేఖపై కనుమిందు చేయనున్నాయి. ఈ తేదీల్లో సూర్యాస్తమయం తర్వాత అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి అసాధారణ వీక్షతను అందిస్తాయి. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా, 100 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది.
17,18 తేదీల్లో నైరుతి దిక్కులో శుక్రుడు-శని కలిసి ఉండగా, బృహస్పతి-అంగారకుడు ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తూ గ్రహాల శ్రేణిలో తిరుగుతుంటాయి. నాలుగు గ్రహాలు ఒకే సరళరేఖపైకి లేదా కక్ష్యలోకి రావడం చాలా అరుదుగా జరుగుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు.

ప్లానెట్ పరేడ్ తో అద్భుత దృశ్యం
ఈ పరిణామాన్ని 'ప్లానెట్ పెరేడ్' అని పిలుస్తారు. 17,18 తేదీల్లో నైరతిలో శుక్రుడు,శని గ్రహాలు ఒకదానికొకటి చాలా దగ్గరిగా కనిపిస్తాయి. ఈ సంయోగం చూపరులను ఆకర్షిస్తుంది. -1.4 మాగ్నిట్యూడ్ తో అంగారక గ్రహం చాలా నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. బృహస్పతి ఆకాశంలో ప్రకాశవంతమైన గ్రహాల వరుసను పూర్తి చేస్తుంది. అయితే ఈ గ్రహాలన్నీ భూమి నుంచి చూస్తే దగ్గరగా ఉన్నట్టు కనిపించినా వాటి మధ్య దూరం కొన్ని బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది.
అంతరిక్ష పరిశోధనలకు కూడా ముఖ్యమే
అంగారకుడి వ్యతిరేకత దిశ కదలిక చూడటానికి అందంగా ఉండటమే కాకుండా అంతరిక్ష పరిశోధనలకు కూడా ముఖ్యమైనది. ఈ కాలంలో భూమి,అంగారక గ్రహాల మధ్య దూరం తగ్గుతుంది, ఇది అంతరిక్ష నౌకలను ప్రయోగించడానికి, అంతరిక్ష యాత్రలను పంపడానికి అనువైన సమయంగా మారుతుంది.
టెలిస్కోప్ ఉన్న వారు ఈ నెలలో భూమి నుండి యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను కూడా చూడవచ్చు. ఈ సుదూర గ్రహాలు తక్కువ ప్రకాశవంతంగా కనిపించినప్పటికీ వాటి చేరిక ఈ ఖగోళ సంఘటన అందాన్ని మరింత పెంచుతుంది.



Click it and Unblock the Notifications
