Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
థాయ్ లాండ్ యాత్రకు సిద్ధమవుతున్నారా? టూరిస్ట్ వీసాకు కొత్త నిబంధనలు అమల్లోకి
సమ్మర్ హాలిడేస్ లో థాయ్‌లాండ్ అందాలను ఆస్వాదించాలని, అక్కడి సంస్కృతిలో మమేకమవ్వాలని కలలు కంటున్నారా? అయితే మీ ప్రయాణ ప్రణాళికల్లో ఒక ముఖ్యమైన మార్పును చేర్చే సమయం ఆసన్నమైంది. థాయ్ ప్రభుత్వం పర్యాటక వీసా దరఖాస్తుదారుల కోసం ఆర్థిక రుజువు అవసరాలను మే 2025 నుండి పునఃప్రవేశపెడుతోంది. కరోనా సమయంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 2023 చివరి నుండి ఈ నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
థాయిలాండ్ కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏ వ్యక్తి అయినా థాయ్‌లాండ్ టూరిస్ట్ వీసా కోసం అప్లయ్ చేసుకునే ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ప్రయాణానికి అవసరమైన కనీస నిధులు మీ వద్ద ఉన్నాయని థాయ్ అధికారులకు స్పష్టం చేయాలి. ప్రత్యేకంగా ప్రయాణికులు కనీసం 20,000 థాయ్ బాట్ (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.45,000 నుండి 46,000 వరకు) తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని చూపించాలి.

ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకదాన్ని సమర్పించవచ్చు
-గత మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించాలి. మీ అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ ఉందని లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయని ఇవి ధృవీకరిస్తాయి.
-ఒకవేళ మీ ప్రయాణ ఖర్చులను వేరొకరు భరిస్తున్నట్లయితే ఉదాహరణకు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా సంస్థ అయితే వారి నుండి అధికారిక స్పాన్సర్ షిప్ లేఖ, వారి ఆర్థిక పత్రాలతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.
వీసా దరఖాస్తుకు ఇవి కూడా తప్పనిసరి
-థాయ్ వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆర్థిక రుజువుతో పాటు మరికొన్ని పత్రాలు కూడా అవసరం.
-థాయ్ లాండ్ నుండి తిరిగి వచ్చే తేదీ నుండి కనీసం 6 నెలల చెల్లుబాటు వ్యవధి ఉండే పాస్ పోర్ట్ ఉండాలి.
-రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఒకటి.
-మీ నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. యుటిలిటీ బిల్లు, అద్దె ఒప్పందం, ఆధార్ కార్డు వంటివి ఉండాలి.
-థాయ్ లాండ్ కు వెళ్లి తిరిగి రావడానికి నిర్ధారించబడిన రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్లు ఉండాలి.
-మీరు బస చేయబోయే హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ లేదా ఎవరైనా ఆతిథ్యం ఇస్తుంటే వారి వివరాలు ఇన్విటేషన్ డాక్యుమెంట్.
వీసా రహిత ప్రయాణం?
థాయిలాండ్ కి ప్రస్తుతానికి వీసా రహిత ప్రయాణం కొనసాగుతోంది. భారతదేశంతో సహా 93 దేశాల పౌరులు పర్యాటక లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఎలాంటి వీసా లేకుండా 60 రోజుల వరకు థాయ్ లాండ్ లో ప్రవేశించి బస చేయవచ్చు. అయితే ఈ సౌలభ్యం భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. థాయ్ అధికారులు ప్రస్తుత వీసా రహిత విధానాన్ని సమీక్షిస్తున్నారని బస వ్యవధిని 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించే అవకాశం ఉందని సమాచారం.
కొత్తగా డిజిటల్ అరైవల్ కార్డ్ అవసరం
మే 1, 2025 నుండి థాయ్ లాండ్ ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ (వీసా ఉన్నా, లేకపోయినా) మరో కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. అదే థాయ్ లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (TDAC). ప్రయాణికులు థాయ్ లాండ్ లో ల్యాండ్ అవడానికి కనీసం మూడు రోజుల ముందు ఈ TDAC కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. దేశ వలస ప్రక్రియలను డిజిటలైజ్ చేసి క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా ఈ తప్పనిసరి ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్‌ను ప్రవేశపెట్టారు.
వీసా ఆన్ అరైవల్ పరిస్థితి ఏమిటి?
కొన్ని దేశాల పౌరులకు అందుబాటులో ఉన్న వీసా ఆన్ అరైవల్ (VoA) సౌకర్యాన్ని ఎంచుకునే ప్రయాణికులు కూడా ఆర్థిక తనిఖీల నుండి పూర్తిగా మినహాయించబడరు. థాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు సరిహద్దు దగ్గర (ఎయిర్ పోర్ ట్‌లో) మీ ఆర్థిక స్తోమతకు సంబంధించిన రుజువును అడిగే అవకాశం ఉంది. గతంలో ఈ విషయంలో తనిఖీలు అంత కఠినంగా లేకపోయినప్పటికీ భవిష్యత్తులో మరింత కఠినమైన పరిశీలన ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



Click it and Unblock the Notifications