Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
లక్షలు పెట్టి ఇల్లు కొంటున్నారా? ఈ డాక్యుమెంట్లు చూడకపోతే నిలువునా మునిగిపోతారు!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద కల..జీవితకాలంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయం కూడా. అయితే నగరమైనా లేదా పల్లెటూరు అయినా ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మనం సాధారణంగా ఏరియా, ధర, అక్కడ ఉన్న సదుపాయాలను మాత్రమే ఎక్కువగా చూస్తుంటాం. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైనది ఆ ఆస్తికి సంబంధించిన చట్టపరమైన పత్రాలు.
మనం పెడుతున్న లక్షలు, కోట్ల పెట్టుబడికి పూర్తి భద్రత ఉండాలంటే కచ్చితంగా లీగల్ డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసే ముందు ప్రతి కొనుగోలుదారుడు తప్పనిసరిగా ధృవీకరించుకోవాల్సిన 5 అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి.

చాలామంది డాక్యుమెంట్లు చెక్ చేయడం అనేది కేవలం ఒక ఫార్మాలిటీ అని అనుకుంటారు, కానీ ఇది మీ కష్టార్జితాన్ని కాపాడుకునే రక్షణ కవచం. ఆస్తి కొనే ముందు కాస్త సమయం వెచ్చించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం లేదా నిపుణులైన లాయర్ల సహాయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే తలనొప్పులను నివారించవచ్చు. ఇల్లు కొనే ముందు తప్పక చెక్ చేసుకోవాల్సిన డాక్యెమెంట్లు ఏవో ఇక్కడ చూడండి.
అఫ్రూవ్డ్ బిల్డింగ్ ఫ్లాన్
అపార్ట్‌మెంట్లు, ఇళ్లు కొనుగోలు చేసేటప్పుడు ఆ భవన నిర్మాణ ప్లాన్ కి స్థానిక మున్సిపల్ అధికారుల (టౌన్ ప్లానింగ్) ఆమోదం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రభుత్వ భద్రతా నిబంధనల ప్రకారం ఆ జోనింగ్ కు తగ్గట్టుగా ఇల్లు నిర్మించారని ఇది తెలియజేస్తుంది.
ఎలాంటి అనుమతులు లేని అపార్ట్‌మెంట్ కొంటే, భవిష్యత్తులో జరిమానాలు చెల్లించడమే కాకుండా కొన్నిసార్లు కూల్చివేత నోటీసులు కూడా రావచ్చు. అంతేకాదు అప్రూవ్డ్ ప్లాన్ లేని ఆస్తులకు బ్యాంకులు హోమ్ లోన్స్ కూడా మంజూరు చేయవు.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC)
మీరు కొంటున్న ఆస్తిపై ఎలాంటి అప్పులు, తనఖాలు లేదా చట్టపరమైన క్లెయిమ్ లేవని ఈ సర్టిఫికేట్ నిర్ధారిస్తుంది. లోకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఈ పత్రాన్ని జారీ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఆస్తిపై జరిగిన లావాదేవీల చరిత్ర అంతా ఈసీ (EC) లో రికార్డ్ అవుతుంది. ఆ ఆస్తిపై మీకు తప్ప మూడవ వ్యక్తికి ఎలాంటి ఆర్థిక ఆసక్తి లేదా హక్కు లేదని క్లీన్ ఈసీ నిర్ధారిస్తుంది.
టైటిల్ డీడ్(యాజమాన్య పత్రం)
ఏదైనా ఆస్తి లావాదేవీలలో ఇది అత్యంత కీలకమైన డాక్యుమెంట్ ఇది.అసలైన యజమాని ఎవరు? ఆ ఆస్తిని విక్రయించే పూర్తి హక్కు వారికి ఉందా లేదా? అనేది ఈ పత్రం ద్వారా తెలుస్తుంది. కొనుగోలుదారులు ఈ టైటిల్ డీడ్ చాలా స్పష్టంగా, ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా ఉండేలా చూసుకోవాలి.
పాత యాజమాన్య రికార్డులను (లింక్ డాక్యుమెంట్లు) కూడా ఒకసారి నిశితంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఒక ప్రాపర్టీ లాయర్ సలహా తీసుకోవడం బెటర్.

సేల్ అగ్రిమెంట్,సేల్ డీడ్
కొనుగోలుదారు, విక్రేత మధ్య కుదిరిన నిబంధనలు, చెల్లింపుల షెడ్యూల్, ఆస్తిని అప్పగించే తేదీ తదితర వివరాలన్నీ సేల్ అగ్రిమెంట్ (విక్రయ ఒప్పందం)లో ఉంటాయి.
ఇక రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చే సేల్ డీడ్ ద్వారా ఆస్తి యాజమాన్య హక్కులు చట్టబద్ధంగా విక్రేత నుండి కొనుగోలుదారునికి బదిలీ అవుతాయి. సంతకం చేసే ముందు ఒప్పందంలోని క్లాజులన్నీ మీరు మాట్లాడుకున్న విధంగానే ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి.
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్
ఆమోదించబడిన ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణం జరిగిందని ఆ ఇల్లు నివాసం ఉండటానికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని స్థానిక అధికారులు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC)ను జారీ చేస్తారు. అలాగే కంప్లీషన్ సర్టిఫికేట్ (CC) అనేది ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం పూర్తయిందని నిర్ధారిస్తుంది.
ఈ డాక్యుమెంట్లు లేకపోతే కరెంట్, వాటర్ కనెక్షన్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తులో ఆ ఆస్తిని మళ్లీ అమ్ముకోవాలన్నా, యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలన్నా కష్టమే.



Click it and Unblock the Notifications