Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
New Year 2025: కొత్త సంవత్సరంలో ఈ మొక్కలు ఇంట్లో నాటితే డబ్బే డబ్బు!
కొత్త ఏడాది మొదలు కాబోతుంది. ఈ కొత్త ఏడాదిలో చాలా మంది రకరకాల రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. కొందరు జిమ్‌కు వెళ్లాలని, కొందరు తాగడం మానేయాలని, మరికొందరు జాబ్ చేయాలని ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించాలని మాత్రం కచ్చితంగా అనుకుంటారు. అలాంటి వ్యక్తులు కొత్త సంవత్సరం రోజున ఈ మొక్కలు ఇంటికి తీసుకొస్తే కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఇంతకీ ఆ మొక్కలు ఏంటి? వాటితో ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తులసి మొక్క
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి మొక్కను హిందువులు దేవతలతో సమానంగా పూజిస్తుంటారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బులు బాగా సంపాదించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అలాగే సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు.

జమ్మి మొక్క
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో జమ్మి మొక్క పెంచుకోవడం చాలా శుభప్రదం. ఇంట్లో జమ్మి మొక్కను పెంచడం వలన సాక్షాత్తు ఆ పరమశివుడి ఆశీస్సులు మనపై ఉంటాయని నమ్ముతుంటారు. అలాగే శని దేవుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తుంటారు. శని దోషాలు తొలిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు. అందుకే కొత్త సంవత్సరం రోజున జమ్మి మొక్కను నాటడం చాలా మంచిందని సూచిస్తున్నారు.
మనీ ప్లాంట్
ఈ మొక్కను చాలా మంది తమ తమ ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఎవరి ఇంట్లో అయితే ఈ మొక్క లేదో వారు కొత్త సంవత్సరం రోజున తమ ఇంట్లో ఈ మొక్కను నాటడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి. ఆర్ధిక, ఆరోగ్య పురోగతి బాగుంటుంది. అలాగే కుటుంబంలో సమస్యలు తొలిగి సుఖ సంతోషాలు నెలకొంటాయి.
జిల్లేడు చెట్టు
జోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం మన హిందూ సంప్రదాయంలో జిల్లేడు చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా శుభ సూచికమని నిపుణులు చెబుతుంటారు. ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం వలన సుఖ సంతోషాలు, సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతుంటారు. అలాగే నరదృష్టి, ఏదైనా ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. ఈ కొత్త ఏడాదికి మీ ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఈ ఫలితాలు అంతా మీరు పొందే అవకాశం ఉంటుంది.
క్రాసుల మొక్క
దీనికి జడే మొక్క అనే పేరు కూడా ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం వలన శుభపరిణామాలు జరుగుతాయి. ఈ చెట్టు ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే కొత్త సంత్సరంలో ఈ మొక్కను నాటడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్య, ఆర్ధిక పురోగతిని చవి చూస్తారు.



Click it and Unblock the Notifications