Latest Updates
-
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా?
నిగనిగలాడే ఎర్రటి స్ట్రాబెర్రీలను మీ చేతులతో కోసి తినాలని ఉందా? అయితే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే!
చాలామందికి చెట్లకు ఉండే పండ్లను స్వయంగా తమ చేతులతో తింపి తినడం చాలా ఇష్టం ఉంటుంది. కొంతమంది అయితే తాము తినకున్నా జస్ట్ తమ చేతులతో వాటిని తుంపితే చాలు అని భావిస్తుంటారు కూడా. ఇక, నిగనిగలాడే ఎర్రటి స్ట్రాబెర్రీలను చెట్లకు చూస్తే ఎవ్వరికైనా సరే..వాటిని తమ చేతులతో స్వయంగా కోసి తినాలనిపిస్తుంది.
చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల మధ్య మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి స్ట్రాబెర్రీలను కోసే అద్భుతమైన అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే భారతదేశంలో స్ట్రాబెర్రీ పికింగ్ కోసం ప్రసిద్ధి చెందిన ఆ ఉత్తమ ప్రదేశాలు ఏవో ఇక్కడ చూడండి.

మహాబలేశ్వర్, మహారాష్ట్ర
భారతదేశపు స్ట్రాబెర్రీ క్యాపిటల్ అని మహాబలేశ్వర్ ను పిలుస్తారు. దేశంలో పండే స్ట్రాబెర్రీలలో అత్యధిక శాతం ఇక్కడే పండుతాయి. పర్యాటకులకు అనుకూలంగా ఉండే ఎన్నో అద్భుతమైన స్ట్రాబెర్రీ పొలాలు ఇక్కడ ఉన్నాయి. సందర్శకులు నేరుగా పొలాల్లోకి వెళ్లి, పండిన బెర్రీలను స్వయంగా కోసుకోవచ్చు. మీరు కోసిన పండ్ల బరువును బట్టి మాత్రమే డబ్బులు చెల్లించే సదుపాయం ఉంటుంది.
పంచగని, మహారాష్ట్ర
మహాబలేశ్వర్‌కు దగ్గర్లోనే ఉండే మరో అందమైన హిల్ స్టేషన్ పంచగని. ఇది కూడా స్ట్రాబెర్రీ తోటలకు పెట్టింది పేరు. ఇక్కడి రైతులు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా గైడెడ్ ఫామ్ టూర్లను నిర్వహిస్తారు. పండ్ల సేకరణతో పాటు, వాటిని రుచి చూసేందుకు ఫామ్ నిర్వాహకులు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేస్తారు. అయితే స్ట్రాబెర్రీ పంట కాలంలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తు బుకింగ్ చేసుకోవడం బెటర్.
లంబసింగి, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రా కాశ్మీర్ గా పిలువబడే లంబసింగి కేవలం మంచుకే కాదు, అందమైన స్ట్రాబెర్రీ తోటలకు కూడా ఫేమస్. ఇక్కడి చల్లని వాతావరణం స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలం. పర్యాటకులు ఇక్కడి పొలాల్లో పండిన తాజా స్ట్రాబెర్రీలను కోసుకుని బరువును బట్టి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు స్థానిక రైతులు ఇంట్లో తయారు చేసిన స్ట్రాబెర్రీ జామ్ లు, స్ప్రెడ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి.
కూనూర్, తమిళనాడు
నీలగిరి కొండల అందాల మధ్య ఉండే కూనూర్, స్ట్రాబెర్రీ కోతకు మరొక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ విశేషం ఏమిటంటే.. స్ట్రాబెర్రీ సేకరణ సీజన్ నెలల తరబడి కొనసాగుతుంది. పర్యాటకులు ఇక్కడ గైడెడ్ ఫామ్ టూర్స్ లో పాల్గొనడమే కాకుండా, పచ్చని ప్రకృతి మధ్య కూర్చుని స్ట్రాబెర్రీలను ఆస్వాదిస్తూ పిక్నిక్ కూడా చేసుకోవచ్చు.

బెంగళూరు, కర్ణాటక
ఐటీ సిటీ బెంగళూరుకు సమీపంలో కూడా అనేక స్ట్రాబెర్రీ పొలాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. వీకెండ్స్ లో సిటీ ట్రాఫిక్ నుండి తప్పించుకుని ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ఫామ్స్ పర్యాటకులకు స్ట్రాబెర్రీ కోసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే కొన్ని ఫామ్స్ లో ఎంట్రీ ఫీజు ఉంటుంది, ముందుగానే ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రి భోయ్ జిల్లా, మేఘాలయ
నార్త్ ఈస్ట్ అందాలను ఆస్వాదిస్తూ స్ట్రాబెర్రీలు కోయాలంటే మేఘాలయలోని రి భోయ్ జిల్లాకు వెళ్లాల్సిందే. ఇక్కడి గ్రామీణ వాతావరణం, పచ్చని కొండల మధ్య ఉన్న స్ట్రాబెర్రీ పొలాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. మీరు ఇక్కడ బుట్టల కొద్దీ తాజా బెర్రీలను కోసుకోవడమే కాకుండా, స్థానికులు తయారు చేసే నోరూరించే స్ట్రాబెర్రీ జామ్ లు, డ్రింక్స్ కొనుగోలు చేయవచ్చు.



Click it and Unblock the Notifications