Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పవర్ స్టార్ ది గ్రేట్ : ఈ విషయాలు ఆమెకు తప్ప మరెవ్వరికీ తెలియదు..!
పవర్ స్టార్ ది గ్రేట్ : ఈ విషయాలు ఆమెకు తప్ప మరెవ్వరికీ తెలియదు..!
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంటే కన్నడిగులు ప్రాణం ఇస్తారు. ఒక్క రూపాయి ఇచ్చేవాడు కూడా అందరికి తెలిసేలా, అందరూ చూసేలా ఇస్తాడు. అయితే కుడిచేతితో దానం చేసిన విషయం ఎడమచేతికి కూడా తెలీకూడదు అనే సామెతను అక్షరాలా పునీత్ రాజ్ కుమార్ పాటించారు.

మా హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంతకాలం ఇలాంటి దానాలు చేశారా ?, ఇంత మందిని ఆదుకున్నారా అని ఆయన చనిపోయే వరకు అభిమానులు, ప్రజలు ఎవ్వరికీ తెలీకుండా దాచిపెట్టడం నిజంగా గ్రేట్.

1. భార్యకు మాత్రమే తెలుసు
కట్టుకున్న భార్యకు తప్పా బిడ్డలకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు కూడా చాలా సంవత్సరాల నుంచి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చేస్తున్న దానాల గురించి తెలీదు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తరువాత ఆయన చేసిన దాన ధర్మాల గురించి ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన రోజు మార్చి 17వ తేదీ. అభిమానుల మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ కుటుంబ సభ్యుల మీద పునీత్ రాజ్ కుమార్ కు ఉంది.

2. ఫ్యామిలీ అంటే
సినిమా హీరోగా మంచి పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ లైఫ్ స్టైల్ విషయంలో, దాన ధర్మాల విషయంలో కూడా అంతే శ్రద్ద చూపించారు. పునీత్ రాజ్ కుమార్ అంటే ఒక బ్రాండ్ అనే స్థాయికి అప్పు ఎదిగిపోయారు. ఎంతో మంది హీరోలు పోటీ పడుతున్నా, చివరికి సొంత అన్న డాక్టర్ శివరాజ్ కుమార్ కూడా సినీ ఇండస్ట్రీలో పోటీలో ఉన్నా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నీ చాలా సిల్లీగా తీసుకుని ఆయన పని ఆయన చేసుకుని వెళ్లారు.

3. అంత పెద్ద హీరో కొడుకు అయినా ?
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఎవరో కాదు, కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ముద్దుల కొడుకు. పుట్టుకతోనే డబ్బు, హోదా, తండ్రి పెద్ద స్టార్ హీరో అయినా పునీత్ రాజ్ కుమార్ మాత్రం చాలా సింపుల్ గా బతికారు. ఎప్పుడు కూడా తాను పెద్ద స్టార్ హీరో కొడుకు, నా అన్న హ్యాట్రిక్ హీరో, నేను పెద్ద హీరో అని పునీత్ రాజ్ కుమార్ గర్వపడలేదు. మనం ఎంత ధనవంతులు అయినా, పెద్ద హీరో అయినా, శ్రీమంతుడు అయినా సరే మనం సామాన్యుడిలా బ్రతికితే అదే మనల్ని కాపాడుతుందనే నమ్మకంతో పునీత్ రాజ్ కుమార్ జీవించారు.

4. చనిపోయే వరకు ఎవ్వరికీ తెలీదు
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయే వరకు ఆయన చేసిన ధాన ధర్మాల గురించి ఆయన సన్నిహితులకే చాలా మందికి తెలీదు. ఎప్పుడు అయితే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయారో తరువాత ఆయన చేసిన ధాన ధర్మాల గురించి ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. ఇంత చిన్న వయసులో ఇన్ని ధాన ధర్మాలు చేసే గుణం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అంటూ పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తల్లడిల్లిపోయారు. పునీత్ రాజ్ కుమార్ చేసిన ధాన ధర్మాల గురించి వెలుగు చూడటంతో తరువాత చాలా మంది కోటీశ్వరులు వారి డబ్బుల్లో కొంచెం అనాథలకు ఇవ్వడానికి ముందుకు రావడంతో అప్పు అభిమానులు సంతోషించారు.

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటుడిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, ఫ్యాన్స్ ను ఆదుకునే హీరోగా అందరికి న్యాయం చేశారు. స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ ఆయన ఆరోగ్యం విషయంలో, ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రతిరోజు ఎక్కడ ఉన్నా కచ్చితంగా వ్యాయాయం, జియ్ చెయ్యడం మరిచిపోని పునీత్ రాజ్ కుమార్ కండలు తిరిగిన శరీరంతో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అదే జిమ్ సెంటర్ లో వ్యాయాయం చేస్తున్న సమయంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోవడంతో ఇప్పటికి ఆ విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు.



Click it and Unblock the Notifications