Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
ప్రభాస్ నా పెద్ద కొడుకు, బుజ్జి నా చిన్న కొడుకు, కృష్ణంరాజు భార్య సందడి
ఈ రోజు ఎక్కడ థియోటర్ దగ్గర చూసినా ప్రభాస్ మేనియానే. డార్లింగ్ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో కల్కి2898 సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తెలుగు చలనచిత్ర రంగంలోనే అత్యున్నత సాంకేతికతో రూపొందించిన ఈ చిత్రం విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా సందడి మామూలుగా లేదు.ఎందుకుంటే పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన ఈ సినిమా హిందీవర్షన్ లో కూడా విడుదలైంది. బారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం మొదటి షో నుంచే భారీ అంచనాలతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ప్రభాస్ వాడిన కారుకు క్రేజ్ అంతా ఇంతా లేదు. ఆ వాహనం పేరు 'బుజ్జి' అన్న విషయం మీకు తెలిసిందే. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఈ బుజ్జీ బుల్లికారును కూడా రోడ్లపై తిప్పేసి ప్రమోషన్స్ కు వాడుకున్న సంగతి తెలిసింది. ఇక అప్పటి నుండి ఎక్కడ చూసినా ఈ బుల్లి కారు మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఈ బుల్లికారుపై టెక్ దిగ్గజం ఆనంద మహీంద్ర కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కల్కి సినిమా విడుదల సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ ముందు ఈ 'బుజ్జి' వాహనం ఫ్యాన్స్ కోసం నిలపడంతో, తెగ ఆకర్షించేస్తుంది. కల్కి సినిమా ఒక ఎత్తు అయితే ఈ బుజ్జి కారు మరో ఎత్తు, ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈరోజు కల్కి సినిమాను చూడటానికి ప్రసాద్ ఐమ్యాక్స్ వచ్చిన ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి కూడా అక్కడనున్న బుల్లి బుజ్జి కారును చూసి తెగ ముచ్చట పడ్డారు. ఏకంగా ఆమె ఆ వాహనం ఎక్కి సందడి చేశారు. దాంతో అక్కడున్న ప్రభాస్ ఫ్యాన్స్ కేరతలు కొడుతుండగా ఆమె వారికి అభివాదం చేశారు.. కాసేపు ఆ వాహనంలో కూర్చొని ఎంజాయ్ చేసిన ఆమె, తర్వాత కొద్దిసేపటికి బయటకు వచ్చారు. ఆ వీడియో ఒకటి ప్రస్తుతం సోషియల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పాన్ ఇండియా సినిమాగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రముఖ తారాగణం నటించిన కల్కి సినిమాలో బుజ్జి అనే వాహనం (కారు) కీలకమైయ్యింది. మొదటి నుంచి కల్కి సినిమా బృందం బుజ్జి వాహనం గురించి గొప్పగా చెబుతోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం బుజ్జి వాహనం హైదరాబాద్ లో కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం తీసుకువచ్చారు.
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారతదేశ సినీ చరిత్ర గత రికార్డులను తిరగరాయడానికి సిద్దం అవుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దీశాపటాని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, శోభన, స్వాస్థ చటర్జీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు నటించారు.



Click it and Unblock the Notifications