Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Prasad Tech In Telugu: అప్పు చేసి ఫోన్లు కొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్.. తోపు యూట్యూబర్‌గా ఎలా మారాడో తెలుసా?
తెలుగులో టెక్ న్యూస్, టెక్ సంబంధిత అంశాలు, మొబైల్స్, గాడ్జెట్స్ గురించి యూట్యూబ్ లో చూసే వారికి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. 3.93 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో తెలుగులో టాప్ లో కొనసాగుతున్న టెక్ ఛానల్ ఇది. ఈ ఛానల్ నడిపించేది దేవరకొండ వరప్రసాద్. ఒంగోలుకు చెందిన ఈ కుర్రాడు.. ఓ యూట్యూబ్ స్టార్ అనే చెప్పాలి. అంతలా ఫ్యాన్ బేస్, ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.
జీరో నుంచి మొదలు పెట్టి హీరో అయ్యాడు దేవరకొండ వరప్రసాద్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డానని, తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెబుతున్న వరప్రసాద్ బయోగ్రఫీ తన మాటల్లోనే..

'నేను పుట్టింది ఒంగోలులో. ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివి బీటెక్ కోసం హైదరాబాద్ కు వచ్చాను. ఇంజినీరింగ్ చదివేటప్పుడే నా వైఫ్ పరిచయం అయింది. అప్పుడు 2009 లో ఇంజినీరింగ్ అయిపోయాక 21 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయితే చేసుకున్నాను కానీ నా భార్యను పోషించడానికి నా దగ్గర డబ్బు లేకపోవడంతో కొన్ని నెలల పాటు మా నాన్నే నెలకు రూ. 6 వేల రూపాయలు పంపించేవారు.
తర్వాత బతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి హైదరాబాద్ కు తిరిగి వచ్చేశాం. ఓ చిన్న పెంట్ హౌజ్ రెంట్ తీసుకున్నాం. మార్కెటింగ్ జాబ్ చేశాను. నెలకో రూ. 12వేలు వచ్చేవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బైక్ తిరగడంతో ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. తర్వాత మార్కెటింగ్ జాబ్ మానేసి గవర్న్‌మెంట్ జాబ్ కు కొన్ని రోజులు ప్రిపేర్ అయ్యాను. కానీ అదేదీ వర్కవుట్ అవ్వలేదు.
తను వచ్చాక నాకు కాలం కలిపివచ్చింది:
ఇలా అయితే కాదని మళ్లీ జాబ్ ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాను. నెలకు రూ. 15 వేలు వచ్చేవి. ఐదారు వేలు వచ్చే వారికి రూ. 15 వేలు రావడంతో చాలా సంతోషంగా జీవనం సాగిపోయింది. వారానికో సినిమా అలా సాగిపోయింది జీవితం. పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించాం. ఇద్దరం ఎంటెక్ పూర్తి చేశారు. 2009 లో పెళ్లి జరిగితే 2016లో సాయి సచిన్ రూపంలో ఓ కొత్త వ్యక్తి మా కుటుంబంలోకి అడుగు పెట్టాడు. సాయి సచిన్ వచ్చినప్పటి నుంచి మాకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి.
సాయి సచిన్ పుట్టిన తర్వాతే నేను యూట్యూబ్ ఛానల్ పై వర్కవుట్ చేయడం మొదలు పెట్టాను. రోజూ ఏదో ఒక వీడియో చేస్తూ ఉండే వాడిని. ఆ సమయంలో ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు. మొబైల్ అన్‌బాక్సింగ్, రివ్యూలు చేసే తెలుగు యూట్యూబ్ ఛానల్ నాది ఒక్కటే కనిపించేది. ఒకటీ రెండు సంవత్సరాల పాటు నా ఛానల్ ఒక్కటి మాత్రమే తెలుగులో కనిపించేది. అదే నేను చేసిన మంచి పని. అందరి కంటే ముందే మొదలు పెట్టడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది.
అన్‌బాక్సింగ్, మొబైల్ రివ్యూలు, టెక్ న్యూస్ లు అన్నీ తెలుగులో నేను మొదలు పెట్టా. క్రమంగా నన్ను ఇష్టపడే వాళ్లు, నా కంటెంట్ చూసే వాళ్లు, నా రివ్యూలను నమ్మేవాళ్లు పెరిగారు. అది నాకు దేవుడు ఇచ్చిన వరం అనే అనుకుంటా. నాలుగు గోడల మధ్య మొదలైన నా యూట్యూబ్ ఛానల్ జర్నీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. సాయి సచిన్ పుట్టిన తర్వాత సాయి సచిన వాళ్ల అమ్మమ్మ ఊరికి వెళ్లిపోయారు.
ఇంట్లో ఒక్కడినే ఉంటూ టెక్ కు సంబంధించిన వీడియోలు చేస్తూ ఉండేవాడిని. రోజూ ఒక వీడియో తప్పకుండా పెడుతూ ఉండేవాడిని. రోజంతా జాబ్ చేసుకుని వచ్చి. సాయంత్రం సమాచారాన్ని మొత్తం సేకరించే వాడిని. తర్వాత వీడియో చేసి ఎడిట్ చేసే వాడిని. అలా ఎప్పుడో అర్ధరాత్రి పడుకొని మళ్లీ ఉదయమే లేచే వాడిని.
బస్సుల్లో వెళ్లి వచ్చేటప్పుడే పడుకునే వాడిని:
3, 4 నెలల పాటు రోజూ రాత్రుళ్లు మూణ్నాలుగు గంటలు మాత్రమే పడుకునే వాడిని. జాబ్ కోసం బస్సుల్లో వెళ్తున్నప్పుడు, వచ్చేటప్పుడు పడుకునే వాడిని. అలా ఓ 4 నెలల పాటు జాబ్ తో పాటు యూట్యూబ్ వీడియోలు చేస్తూ వచ్చే వాడిని. 2017 సమ్మర్ లో యూట్యూబ్ లో యాడ్స్ ఆపేశారు. అలా మరోసారి దురదృష్టం నన్ను పలకరించింది. అయినా నేనూ రోజూ వీడియోలు చేస్తూ ఉన్నాను.
యూట్యూబ్ నుండి పైసా ఆదాయం లేకపోవడంతో చాలా యూట్యూబ్ ఛానల్స్ మూసేశారు. కానీ నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను. 2017 ఆగస్టులో యూట్యూబ్ లో మళ్లీ యాడ్స్ రావడం మొదలైంది. అప్పటి నుంచి యూట్యూబ్ నుంచి స్థిరంగా ఆదాయం వచ్చేది. అలా మొదటి రెండున్నరేళ్ల పాటు యూట్యూబ్ ద్వారా సంపాదించినదంతా దానిపైనే ఇన్వెస్ట్ చేశాను. మొబైల్స్, ఎక్విప్‌మెంట్లు, ల్యాప్‌టాప్‌లు కొనడానికి వాడేశాను.
అలా తెలుగులో తొలిసారిగా రివ్యూ యూనిట్లు వచ్చాయి:
ఆ తర్వాత నా ఛానల్ కు రివ్యూ యూనిట్లు రావడం మొదలైంది. క్రమంగా అన్ని కంపెనీలు రివ్యూ యూనిట్లు వచ్చేవి. చాలా మంది యూట్యూబర్లకు డ్రీమ్ అయిన ఆపిల్ ప్రొడక్ట్స్ కూడా రివ్యూకు వచ్చేవి. అలా తెలుగులో మొదటిసారి నా ఛానల్ కే రివ్యూ యూనిట్లు వచ్చేవి. అప్పటి నుంచి నేను సంపాదనంతా దాచుకోవడం మొదలు పెట్టాను. అలా రూ. 80 లక్షల ఇల్లు తీసుకున్నా, బైక్ కొన్నా, కారు కొన్నా. అలా నా డ్రీమ్స్ నెరవేర్చుకుంటున్నా. మొదటి నుంచి యూట్యూబ్ పై కష్టపడ్డాను. ప్రతిఫలం అందుకుంటున్నాను. నాలుగైదేళ్లుగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను. నేను సంపాదించిందంతా యూట్యూబ్ ఛానల్ నుండే వచ్చింది.
ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటేనే నెగ్గుకురాగలం:
ప్రత్యేక ఫ్యాన్ బేస్, ఫాలోవర్స్, మనల్ని ఇష్టపడే వారిని సంపాదించుకోవాలి. అప్పుడే యూట్యూబ్ లో స్థిరంగా ఆదాయం సంపాదించుకోగలం. నేను మొదటి నుంచి చేసింది అదే. దాని వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.
కష్టపడ్డాను, చాలా ఎదిగాను:
యూట్యూబ్ లో చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి తగ్గ ఫలితం పొందాను. కొన్ని సార్లు నిద్రలేకుండా కూడా వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి. ఎంత కష్టపడ్డానో అంత ఎదిగాను. దేశ విదేశాలు వెళ్లినా యూట్యూబ్ వీడియోలు చేయడం మాత్రం ఆపలేదు. ఒక్కోసారి ఎయిర్ పోర్టుల్లో కూడా టెక్ న్యూస్ వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతగా కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు ఇంతలా సంపాదిస్తున్నాను. ఈ స్థాయిలో ఉన్నాను.'



Click it and Unblock the Notifications











