Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Sankranti 2025: సంక్రాంతికి ఊరెళుతున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇంటి నుంచి మళ్ళీరారు!
సంక్రాంతికి ప్రతి ఒక్కరూ ఊరికి వెళ్తుంటారు. పండగ కావడంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి సంతోషకరమైన వాతావరణాన్ని గడపాలని చూస్తుంటారు. అలాగే సంవత్సరానికి ఓసారి పండగ వస్తుండడం, పైగా సాంప్రదాయకమైన పండగ కావడంతో అందరూ పట్టణాలను ఖాళి చేసి సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తారు. అయితే ఎవరైతే సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే మళ్ళీ వచ్చేసారి ఇళ్ళు ఖాళీ అవడం ఖాయం.
ఇంటి భద్రత
పండగకు ఇంటికి వెళ్లేముందు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిని జాగ్రత్త చేసుకొని వెళ్ళాలి. విలువైన వస్తువులను డబ్బులు బ్యాంకు లాకర్లో వేసుకొని వెళ్లడం మంచిది. ఇంటికి ఒకటికి రెండుసార్లు తాళం వేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకొని వెళ్ళాలి. దీంతో పాటు ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులను ఉంచకూడదు. డబ్బు, నగలు, దస్తావేజులను బ్యాంకులో వేసుకోవడం ఉత్తమం.

దస్తావేజులు
మీరు సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నట్లయితే మీకు సంబంధించిన ముఖ్యమైన దస్తావేజులను తీసుకెళ్లండి. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇంటిపేరు చిరునామా రుజువు వంటి అన్ని ముఖ్యమైన దస్తావేజులను తీసుకువెళ్లండి. ఇవి మీరు వెళ్లే ప్రదేశంలో మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉంటాయి. అలాగే మీకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
వాహనం తనిఖీ చేసుకోండి
మీరు మీ సొంత వాహనంలో ఇంటికి వెళ్తున్నట్లయితే కచ్చితంగా మీ వాహనాన్ని ఓసారి చెక్ చేయించుకోండి. పూర్తిగా సర్వీస్ చేయించుకోండి. టైర్లు, బ్యాటరీ, బ్రేక్స్ వంటి ముఖ్యమైన భాగాలను తనిఖీ చేయించుకోండి. అలాగే ఫ్యూయల్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని సరిదిద్దుకొని వెళ్ళండి.
మెడికల్ కిట్
మీరు మీ వెంట కొన్ని అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఓ చిన్న మెడికల్ కిట్ తీసుకెళ్లండి. ఇది మీకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రక్షణగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ చిన్న మెడికల్ కిట్ తీసుకెళ్లడం మర్చిపోకండి.
ఆహరం
ప్రయాణం చేసే సమయంలో తగినంత ఆహరం, నీరు తీసుకెళ్లండి. మీరు వెళ్లే ప్రదేశంలో మీకు ఆహరం దొరకకపోవచ్చు. అలాగే ఆ ఆహరం మీకు నచ్చకపోవచ్చు. అందుకే మీకు ఇష్టమైన ఎదో ఒక ఆహారాన్ని కొంత మీవెంట తీసుకెళ్లండి. అలా చేయడం వల్ల మీకు కచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సొంత వాహనంలో వెళ్తున్నట్లయితే కచ్చితంగా రోడ్డు నియమాలను పాటించండి. మీరు సురక్షితంగా ఉండడంతో పాటు ఎలాంటి జరిమానాలు గురికారు.



Click it and Unblock the Notifications