Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Modi Dance Video : వైరల్గా మారిన మోఢీ డ్యాన్స్ వీడియో... రాక్స్టార్లా చించేసిన ప్రధాని..
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు అటు కొంతమందికి ఆందోళనలను కలిగిస్తే మరికొంతమందికి వినోదాన్నిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్నికల హడావిడితో పాటు చాలా రిల్స్ వైరల్ అవుతున్నాయ్. ఇన్ఫ్లుయెన్సర్లు రకరకాలుగా ప్రధాని, ఇతర నాయకులపై మీమ్స్ సృష్టించి నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా ప్రధాని మోడీపై వచ్చిన ఓ వైరల్ వీడియోపై ఢిల్లీలోని పీఎంవో ఆఫీస్ స్పందించింది. ప్రధాని అధికారిక వైబ్సైట్ ఆ వీడియోను రీపోస్ట్ చేస్తూ పాజిటివ్గా రియాక్ట్ అయింది.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మోఢీ డ్యాన్సింగ్ మిమ్స్
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వచ్చినప్పటి నుంచి క్రియేటివిటీ పీక్స్కు చేరుకుంటోంది. క్షణాల్లో అద్భుతమైన మీమ్ ఫోటోలు, వీడియోలు మనకు దర్శనమిస్తున్నాయ్. నిజ జీవితంలో పూర్తిగా భిన్నింగా ఈ వీడియోలు, మీమ్స్ ఉండడంతో అభిమానులు ప్రేక్షుకులకు మంచి ఎంటర్టైన్ అవుతోంది.
వీడియోలో మోఢీ డ్యాన్స్
ప్రధాని మోడీ డ్యాన్స్ చేయడం మనం ఎప్పుడూ చూసి ఉండం. కానీ సంచనలనం సృష్టించిన ఓ ఆర్టిఫీషియల్ వీడియోలో ప్రధాని మోడీ రాక్స్టార్లా డ్యాన్స్ చేస్తుంటారు. ఆ వీడియోలో.. అతి పెద్ద మ్యూసిక్ లైవ్షో నడుస్తుంటుంది. అందులో ప్రధాని మోడీ ఆరెంజ్ కలర్ కోట్, పైజామా వేసుకొని స్టేజ్పై డ్యాన్స్ చేస్తూనే ఎంట్రీ ఇస్తారు. బ్యాక్గ్రౌండ్లో రాకింగ్ మ్యూజిక్కి అనుగుణంగా మోడీ స్టెప్పులేస్తుంటారు. మైఖేల్ జాక్సన్, ఇతర ప్రముఖ పాప్ స్టార్లు, సింగర్లు ఎలాగైతే డ్యాన్స్ చేస్తూ పాటపాడుతూ అలరిస్తారో అచ్చుగుద్దినట్లు అలాగే ప్రధాని మోడీ ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తారు. ఈ స్పూఫ్ వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ రావడంతో ప్రధాని అధికారిక సోషల్ మీడియా విభాగం దీనిపై స్పందించింది.

అయితే ఈ వీడియోను సోషల్ మీడియ ఎక్స్ లో అథీస్ట్కృష్ణ అనే అకౌంట్తో పోస్ట్ చేయబడింది. ఈ పోస్టునే ట్యాగ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మీ అందరిలాగే నేనూ నా డ్యాన్స్ చూస్తూ ఆనందపడుతున్నాను. ఎన్నికల సమయంలో ఇలాంటి క్రియేటివిటీ నిజంగా మనందరినీ అలరిస్తోంది". అని ప్రధాని మోదీ స్పందించారు.
రాక్ స్టార్ అంటూ ప్రశంసలు
అయితే సదరు వీడియోను అథీస్ట్కృష్ణ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రం.. "ఈ వీడియో పోస్ట్ చేసినందుకు నన్ను అరెస్టు చేయరనుకుంటా" అంటూ పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ ఈ డ్యాన్సింగ్ వీడియోను రీపోస్ట్ చేయడం, స్పందించడంతో కొన్ని నిమిషాల్లోనే అనేక వ్యూస్ను సొంతం చేసుకుంది. చాలా మంది ప్రధానిని పొగుడుతూ ఈ వీడియో కింద కామెంట్లు చేశారు. విమర్శలను, మీమ్స్ను, అవమానాన్ని తట్టుకొని నిలబడ్డం నిజంగా స్పూర్తిని రగిలిస్తోందని ప్రధానిని ఆకాశానికెత్తారు. ఇప్పుడు నియంత ఎవరో తేల్చుకోవాలని మరో వ్యక్తి కామెంట్ చేశారు. మోడీ మీరు నిజంగా రాక్స్టార్లా ఉన్నారు
అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు.
ఎవరు అసలు నియంత..?
ఇక్కడ ఆశ్చర్యం కలిగంచే మరో విషయం ఏంటంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైన కూడా ఇలాంటి వీడియోనే 3 రోజుల క్రితం పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కూడా సీఎం మమతా ఇలాగే ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై కోల్కత్ సైబర్క్రైం స్పందించి, వీడియోను పోస్ట్ చేసిన వారిపై కేసు పెడుతూ ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. దీనిపై బీజేపీ అభిమానులు స్పందింస్తూ... ఎవరు అసలు నియంత ? మమతా బెనర్జీనా లేక ప్రధాని మోడీనా అని ప్రశ్నిస్తున్నారు.



Click it and Unblock the Notifications