Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఇక్కడ వ్యభిచారం చట్టబద్దం..ఫుల్ సేఫ్,నో పోలీస్ రైడ్!
మనదేశంలో వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం వల్ల దేశంలో క్రైమ్ రేటు తగ్గుతుందని,మహిళలపై అఘాయిత్యాలు తగ్గిపోతాయని ఆ డిమాండ్ చేసేవాళ్లు చెబుతుంటారు. వ్యభిచారం చట్టబద్దం చేయకపోతే మహిళపై అఘాయిత్యాలకు ఎలా పాల్పడతారు,అలాంటివారిని కఠినంగా శిక్షించాలని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే కొన్ని దేశాలలో క్రైమ్ రేటు తగ్గుదలకు ఆ దేశాల్లో వ్యభిచారం చట్టబద్దం కావడమే అని తరుచుగా చాలామంది వాదిస్తున్న నేపథ్యంలో అసలు ఏయే దేశాల్లో వ్యభిచారం చట్టబద్దంగా ఉందో,అక్కడ వ్యభిచారం చేసే ఆడవాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బెల్జియం
పశ్చిమ యూరప్ దేశమైన బెల్జియంలో వ్యభిచారం నేరం కాదు. చట్టబద్దం. 2022లో బెల్జియం ప్రభుత్వం వ్యభిచారాన్ని చట్టబద్దమైన వృత్తిగా చేసింది. ఇతర వర్కర్లకు(అధికార కాంట్రాక్టస్,సోషల్ ప్రొటెక్షన్ వర్కర్లు కూడా)ఉండే ఉద్యోగ హక్కులు వ్యభిచారం చేసే మహిళలకు కూడా ఉండే వీలు కల్పిస్తూ 2024 లో బెల్జియం ప్రభుత్వం ఓ చట్టాన్నికూడా ఆమోదించింది. వ్యభిచారం చేసే మహిళలకు కూడా హెల్త్ ఇన్య్యూరెన్స్, వేతనంతో కూడిన సెలవు, ప్రసూతి ప్రయోజనాలు, పెన్షన్ లభిస్తుంది. బెల్జియం దేశ జనాభా 1 కోటీ 15 లక్షల పైన ఉంది. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రపంచ దేశాల్లో బెల్జియం 22వ స్థానంలో ఉంది.

జర్మనీ
యూరప్ లోని ధనిక దేశాల్లో ఒకటైన జర్మనీలో వ్యభిచారం నేరం కాదు. జర్మనీ దేశంలో 1927 నుండి వ్యభిచారం చట్టబద్ధం చేయబడింది. వేశ్యాగృహాలు చట్టబద్ధమైనవి గుర్తిస్తారు,వాటికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. ఈ దేశంలో వ్యభిచారం చేసే మహిళలకు ఆరోగ్య సదుపాయాలు, బీమా,పెన్షన్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ దేశంలోని ఆమ్ స్టర్ డామ్ లోని రెడ్ లైట్ ఏరియా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఈ రెడ్ లైట్ ఏరియాని చూసేందుకే ఆమ్ స్టర్ డామ్ నగరాన్ని ప్రతి ఏటా లక్షల మంది ప్రత్యేకంగా సందర్శిస్తుంటారు. 1 కోటీ 79 లక్షల పైగా జనాభా ఉండే నెదర్లాండ్స్‌లో వేశ్యవృత్తిని చట్టబద్ధం చేయడం వల్ల ఆ పని చేసే మహిళలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి,అదే సమయంలో వారు ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా చెల్లిస్తారు. ఇక్కడ వ్యభిచారం చేసే మహిళలు సగటున రోజుకు 600 యూరోలు సంపాదిస్తారు. ఇతర చట్టబద్ధమైన ఉద్యోగుల మాదిరిగానే ఈ పని చేసే మహిళలు కూడా తమ ఆదాయంపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా వారు నిరుద్యోగ భృతి, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలకు అర్హత సాధిస్తారు.
న్యూజిలాండ్
2003లో న్యూజిలాండ్ లో వ్యభిచారం చట్టబద్ధం చేయబడింది. 2003లో జరిగిన ప్రాస్టిట్యూషన్ రిఫార్మ్ యాక్ట్ ద్వారా దీనిని లీగల్ చేశారు. ఈ చట్టం వ్యభిచారాన్ని నేరంగా పరిగణించకుండా, దానిని ఒక సాధారణ వృత్తిగా గుర్తించింది. కేవలం 54 లక్షల వరకు జనాభా ఉండే ఈ దేశంలో వ్యభిచారం చేసే మహిళలు ఇతర కార్మికుల మాదిరిగానే సామాజిక ప్రయోజనాలు పొందుతారు, పన్నులు చెల్లిస్తారు.
ఆస్ట్రియా
91 లక్షలకు పైగా జనాభా ఉండే ఆస్ట్రియాలో దేశంలో కూడా వ్యభిచారం చట్టబద్ధం చేయబడింది. 2000ల ప్రారంభంలో వ్యభిచారాన్ని మరింత స్పష్టంగా నియంత్రించడానికి,వ్యభిచారం చేసే మహిళల హక్కులను పరిరక్షించడానికి కొన్ని ముఖ్యమైన చట్టాలు వచ్చాయి. ఈ సమయంలోనే ఆ పని చేసేవాళ్లకు రిజిస్ట్రేషన్, ఆరోగ్య పరీక్షలు వంటి అంశాలు మరింత ప్రాముఖ్యత పొందాయి. ఈ దేశంలో కూడా వేశ్యవృత్తిలో పాల్గొనే మహిళలు ప్రభుత్వానికి ట్యాక్స్ లు కూడా కడతారు.
గ్రీస్
అందమైన బీచ్ లకు ప్రసిద్ధి చెందిన గ్రీస్ దేశం వేశ్యవృత్తి చేసేవాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని, వైద్య బీమా పొందాలి. వారికి గుర్తింపు కార్డులు జారీ చేయబడతాయి. 99 లక్షలకు పైగా జనాభా ఉండే ఈ దేశం టూరిజానికి కూడా బాగా ప్రసిద్ధి. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శిస్తుంటారు.
ఇక్కడ కూడా
కొన్ని దేశాల్లో జాతీయ స్థాయిలో కాకుండా కొన్ని రాష్ట్రాలు లేదా నగరాల్లో మాత్రమే వేశ్యవృత్తిని చట్టబద్ధం చేశారు. ఉదాహరణకు, అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని కొన్ని కౌంటీలల్లో,అలాగే ఆస్ట్రేలియాలోనా కొన్ని ప్రాంతాల్లో ఇదిా చట్టబద్దం చేశారు.
దీనిని చట్టబద్ధం చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఇదేనంట
లైంగిక కార్మికులకు చట్టపరమైన రక్షణ కల్పించడం, వారి హక్కులను కాపాడటం. వారి ఆరోగ్యం, భద్రతను మెరుగుపరచడం. మానవ అక్రమ రవాణా, దోపిడీని తగ్గించడం. ఈ పరిశ్రమను నియంత్రించడం,పన్నులు వసూలు చేయడం. అయితే వేశ్యవృత్తిని చట్టబద్ధం చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని దేశాలు దీనిని పూర్తిగా నిషేధించాయి లేదా పాక్షికంగా చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నాయి.
మనదేశంలో ఇలా
ఇండియాలో వేశ్యావృత్తి చట్టబద్ధమైనది కాదు..కానీ అది చట్టవిరుద్ధం కూడా కాదు. అంటేస్వచ్ఛందంగా వ్యభిచారం పనిచేయడం నేరం కాదు. అయితే సంబంధిత కార్యకలాపాలు చట్టవిరుద్ధం. భారతదేశంలో వేశ్యాగృహాలు నిర్వహించడం చట్టవిరుద్ధమైనది. వ్యభిచారం కోసం ఎవరినైనా బలవంతపెట్టడం లేదా ట్రాఫికింగ్ చేయడం తీవ్రమైన నేరం,చట్టరీత్యా శిక్షార్హమైనది.



Click it and Unblock the Notifications











