Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
భారతీయ పురుషులు మాట్లాడడానికి ఆసక్తి చూపే 14 గాసిప్స్ ఇవే
గాసిప్స్ పై ఇంట్రెస్ట్ కేవలం మహిళలకే ఉంటుందని అనలేము. కొలీగ్స్ గురించి ఇంకా వార్డ్ రోబ్, లవ్ లైఫ్ వంటి విషయాలపై కేవలం మహిళలే ఎక్కువగా మాట్లాడుతారు అని చెప్పలేము. ఈ విషయాలలో పురుషులు కూడా తమదైన ఆసక్తి ప్రదర్శిస్తారు. నిజానికి మహిళలతో సమానంగా పురుషులు గాసిప్స్ ను ఇష్టపడతారు. నమ్మశక్యంగా లేదు కదా. కాని ఇది నిజం.
భారతీయ పురుషులు ఏ ఏ విషయాలపై గాసిప్స్ చేస్తారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మీరు సరైన పేజ్ కే వచ్చారు. అత్త మామల గురించి చాడీలు, నేరాలు చెప్పుకోవడం, పిల్లల గురించి మాట్లాడుకోవడం, వర్క్ ప్లేస్ గురించి మాట్లాడడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన విషయాలపై భారతీయ పురుషులు ఎక్కువగా మాట్లాడతారు.
అయినప్పటికీ, గాసిపింగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మహిళలకు ప్రత్యేకించి టాపిక్ అవసరం లేదని సాధారణంగా మనమనుకుంటాము. అయితే, పురుషులు కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలుసుకోవాలి. రకరకాల అంశాలపై గాసిపింగ్ చేయడాన్ని వారిష్టపడతారు. అభూత కల్పనలు చేయడంలో వారు సిద్ధహస్తులు.
ఇటీవల కాలంలో తమ ఎపియరెన్స్ పై పురుషులకు ప్రత్యేక శ్రద్ద కలిగింది. కేవలం ఆఫీస్, ఇల్లు అని కాకుండా వారు కూడా వారికీ కావాల్సిన ఫ్యాషన్ యాక్ససరీస్ పై షాపింగ్ కోసం ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. అంతే కాదు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఎక్కు సమయం వృత్తికే కేటాయించడంతో గాసిపింగ్ తో మానసిక ఆనందాన్ని పొందడానికి పురుషులు ఇష్టపడుతున్నారు. మరి, పురుషులు ఎక్కువగా గాసిపింగ్ చేయడానికి ఇష్టపడే అంశాలేంటో చూద్దామా...

చుట్టూ ఉన్న హాటెస్ట్ గర్ల్స్ పై
తమ చుట్టూ ఉన్న, ఆఫీస్ లో నున్న హాటెస్ట్ అండ్ క్యుటేస్ట్ గర్స్ పై పురుషులు గాసిపింగ్ చేయడాన్ని ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

లేటెస్ట్ గ్యాడ్జేట్స్
లేటెస్ట్ గ్యాడ్జేట్స్ పై పురుషులు అత్యధికంగా మాట్లాడుతారు. తమని ఆకర్షించిన గ్యాడ్జేట్ గురించి మాట్లాడడానికి వారు ఇష్టపడతారు. పురుషులను, గ్యాడ్జేట్స్ ను విడివిడిగా చూడలేము.

ఫ్యూచర్ ప్లాన్స్
ఫ్యూచర్ ప్లాన్ గురించి పురుషులు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో పంచుకుంటారని అస్సలు అనుకోవద్దు. ఫ్యూచర్ ప్లాన్ అంటే వారి దృష్టిలో డబ్బు సంపాదనతో పాటు మంచి జాబ్ పొందడం మాత్రమే. తమకు దగ్గరైన వారితే ఈ విషయాల గురించి చర్చిస్తారు.

మ్యారేజ్ ప్లాన్స్
పెళ్లి గురించి గాసిప్ చేసేందుకు ఇష్టపడే పురుషులు కూడా ఉన్నారు. పెళ్లి అనేది పురుషుల దృష్టిలో ఎంతో ముఖ్యమైనది. సంబంధించి వారికున్న భయాలను, సందేహాలను ఇతర పురుషులతో పంచుకోవడాన్ని వారు అమితంగా ఇష్టపడతారు. పెళ్ళైన వారితో ఈ విషయాన్ని చర్చించేందుకు ఇష్టపడతారు.

వృత్తిపరమైన సంభాషణ
భారతీయ పురుషులు అమితంగా ప్రస్తావించే అంశాలలో వారి వృత్తికి చెందినా అంశాలే ఎక్కువగా ఉంటాయి. అవునండి, వారి వృత్తి గురించి పని గురించి మాట్లాడడాన్ని వారు ఎక్కువగా ఇష్టపడతారు.

హాబీస్
పురుషులు ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి కనబరిచే వాటిలో హాబీస్ కి ప్రధాన స్థానం దక్కుతుంది. వారికి నచ్చిన అంశాలపై మాట్లాడడానికి అలాగే వారి హాబీస్ లో వారి ఎచీవ్మెంట్స్ గురించి మాట్లాడడానికి వారు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

బాధాకరమైన బ్రేక్అప్స్
పురుషులు కూడా బాధపడతారు. కొంతమంది స్నేహితుల బృందంతో కలిసినప్పుడు వారి బాధను వారు పంచుకుంటారు. పెయిన్ ఫుల్ బ్రేక్ అప్ కు సంబంధించి వారు తమ స్నేహితులతో వారి బాధను పంచుకుంటారు.

అనుభవం
తమ అనుభవానికి సంబంధించి మాట్లాడడానికి పురుషుల అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అది పడగ్గది అనుభవం కావొచ్చు, ఉద్యోగ అనుభవం కావొచ్చు ఈ విషయాలపై మాట్లాడడానికి పురుషులు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు.

బాస్ అండ్ కొలీగ్స్
అవునండి, ఇది నిజం. మహిళలతో సమానంగా తమ బాస్ పై అలాగే తమ కొలీగ్స్ పై గాసిపింగ్ చేయడాన్ని పురుషులు ఇష్టపడతారు. ఎక్కువ మంది భారతీయులు ఆసక్తి కనబరచే అంశమిది.

సినిమాలు
పురుషులు సినిమా ప్రియులు. సినిమాల గురించి తమకిష్టమైన హాట్ యాక్ట్రస్ గురించి మాట్లాడడాన్ని పురుషులు ఇష్టపడతారు. నటీనటులపై విమర్శలు కురిపించడాన్ని ఇష్టపడతారు.

పెళ్ళాం లేదా గర్ల్ ఫ్రెండ్ గురించి
భారతీయ పురుషులు ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపించే విషయాలివి. తమ గర్ల్ ఫ్రెండ్ గురించి లేదా తమ భార్య గురించి మాట్లాడడాన్ని ఇష్టపడతారు. మహిళలలకు దీటుగా చాడీలు చెప్పుకుంటారు.

వాట్స్ అప్ ను మరచిపోకూడదు
వాట్స్ అప్ అనే అప్లికేషన్ ఎప్పట్నుంచి వాడుకలోకి వచ్చిందో అప్పట్నుంచి దీనికి బానిసైన వారు దీన్నుంచి బయటికి రాలేకపోతున్నారు. అమ్మాయిలకు గర్ల్ గ్యాంగ్స్ ఉన్నట్టే అబ్బాయిలకు కూడా గ్యాంగ్స్ అలాగే గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఆఖరికి మొబైల్ లో కూడా గాసిపింగ్ ను వాడుకుంటున్నారు.

కొత్త క్యారక్టర్స్
ఆఫీస్ లో ఎవరైనా కొత్తగా జాయినయితే వారి గురించి మాట్లాడకపోతే పురుషులకు రోజే గడవదు. మీరు కూడా గమనించే ఉంటారు కదూ?

స్పోర్ట్స్
భారతీయ పురుషులు ఎక్కువగా మాట్లాడుకునే విషయాలలో స్పోర్ట్స్ కి కూడా చోటుంది. గేమ్ తో మొదలయ్యే వారి కాన్వర్సేషన్ క్రీడాకారుడి భార్య అందచందాల టాపిక్ వరకు వెళ్తుంది. తమ ఫేవరేట్ టీం మరింత బాగా ఆడుండాల్సింది అనే టాపిక్స్ కూడా వారి మధ్య వస్తాయి.



Click it and Unblock the Notifications