For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సామాజిక మాధ్యమాలు నేర్పే 5 జీవిత పాఠాలు !

By Super
|

ఆధునిక సాంకేతికతలను సాంప్రదాయ వాదం సంస్కృతి చెడగోట్టేవిగా అభివర్ణిస్తుంది. ఫేస్ బుక్ (ప్రపంచ జనాభాలో ఆరో వంతు, సుమారు 1.3 బిలియన్ మంది), ట్విట్టర్ (సుమారు సుమారు 300 మిలియన్) లాంటి అప్లికేషన్ ల మీద వినియోగించే విస్తారమైన సమయం ప్రమాదకరమే అయినా, ఈ రెండు అధ్బుతమైన ఆవిష్కరణల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే వున్నాయి.

వాటిలో కొన్ని ఇవిగో. ఈ నియమాలను మీ జీవితానికి వర్తింప చేసుకుని చూడండి, ఫేస్ బుక్ కూడా మీ విజయానికి మార్గం చూపిస్తుంది.

1. దేన్నైనా బహిరంగంగా ఇష్టపడడానికి భయ పడకండి, ఇంతవరకూ ఎవరూ ఇష్టపడక పోయినా, మీరే మొదటి వారైనా సరే, ఎందుకంటే ఎవరైనా బహిరంగంగా ఇష్టం ప్రకటించే దాకా మనం కూడా మన అభిప్రాయం చెప్పడానికి సంకోచిస్తాం. దానికి స్వస్తి పలకండి. నిజ జీవితంలో కూడా ఎంత చిన్న విషయానికైనా మీ ఇష్టం చెప్పడానికి ఆసక్తి చూపండి.


2. ఫేస్ బుక్ లో లాగానే మీ జీవితం లో కూడా ‘అన్ లైక్’ బట్టన్ తీసివేయండి. దేన్నీ బయటకు తెలిసే౦తగా అయిష్టపడవద్దు. మీకు జీవితం లో కొన్ని ఇష్టం లేక పోవచ్చు, పర్వాలేదు, కానీ ఇంకొకరికి ఆ మాట చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పని సరిగా దాన్ని వదిలేయండి.

3. జీవితంలో కూడా చురుకైన “కామెంట్స్” ఏరియా ను కలిగి ఉండండి. చాలా భిన్నమైన విషయాల మీద అభిప్రాయాలు కలిగి ఉండండి. భిన్నంగా ఉండడానికి సంకోచం వద్దు, దాన్ని ప్రకటించండి. మీరు మీ భావాలను ప్రకటిస్తే అది ఇంకొకరి అభిప్రాయాలను అయిష్టపడినట్టు కాదని తెలుసుకోండి.

4. మీ నచ్చిన దాన్ని షేర్ చేయండి, బాగా నచ్చితే పదే పదే షేర్ చేయండి. జీవితంలో మనం బాగా నచ్చిన దాన్ని దాచుకుంటాం, కానీ ఫేస్ బుక్ వల్ల ఈ పాఠం నేర్చుకుంటే, ప్రపంచమే కాదు మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు.

5. స్నేహితులను సంపాదించుకోండి : ఎవరైనా మీకు స్నేహహస్తం అందిస్తే, దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. అయితే – విచక్షణ లేకుండా కాదు – దుష్టులకు ఎప్పుడూ దూరంగానే ఉండండి.
5 life lessons from the social media

English summary

5 life lessons from the social media

The old school often pulls down the new age technologies as culture-killers. Though excessive time spent on applications like Facebook (with 1.3 billion users - nearly a sixth of the world's population) and Twitter (nearly 300 million) can be detrimental, there are also many lessons that you can learn from these two omniscient apps.
Desktop Bottom Promotion