Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్లను తెలుసుకోవడానికి 10 మార్గాలు
సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్లు త్వరగా.. భావోద్వేగాలకు లోనవుతారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూడటం.. అతిగా ఆలోచించడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీళ్లు ఎక్కువగా నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు. ఏదైనా విషయంపై స్పందించాలంటే.. పూర్తీగావిశ్లేషించుకున్న తర్వాతే స్పందిస్తారు.
సినిమాలు చూస్తూ ఏడవడం.. చైర్స్ లాగినప్పుడు వచ్చే శబ్ధాలకు ఉలిక్కిపడటం.. స్నేహితులు దూరమైనప్పుడు నిద్రపోకపోవడం.. ఎక్కువగా ఆలోచించడం.. వంటి లక్షణాలన్నీ సున్నితత్వమనే చెప్పాలి. ఇవన్నీమీలో కనిపిస్తుంటే.. మీరు చాలా సున్నిత స్వభావుల జాబితాలోకి వస్తారు. చాలా సున్నితమైన వాళ్లలో కనిపించే మరికొన్ని లక్షణాలేంటో తెలుసుకుందాం..

వివరణ కోరుతారు
ప్రతి విషయంలోనూ పూర్తి వివరణ కోరుకుంటారు. చిన్న చిన్న అంశాలను విశ్లేషణాత్మకంగా చెప్పాలంటారు. ఉదాహరణకు ప్రెజెంటేషన్ లో ఫాంట్ సైజ్, అండర్ లైన్స్ లాంటివి లేకపోయినా.. వేలెత్తి చూపిస్తారు. తమ చుట్టూ వాతావరణాన్ని, మనుషులను నిశితంగా పరిశీలిస్తుంటారు.

విమర్శలను ఒప్పుకోరు
ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. తాము తీసుకునే నిర్ణయం సరైనదని నమ్ముతారు. తాము ఎలాంటి పొరపాటు చేయరని ఫీలవుతారు. దీంతో.. ఎదుటి వ్యక్తులు వాళ్ల నిర్ణయం సరైనది కాదని చెప్పినా.. పాజిటివ్ గా అంగీకరించలేరు. మరొకరు వేలెత్తి చూపితే.. తట్టుకోలేరు.

భావోద్వేగాలకు లోనవడం
చాలా సున్నిత స్వభావం ఉన్న వాళ్లు చీటికిమాటికీ ఏడుస్తూ ఉంటారు. ప్రతి విషయానికి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటారు.

త్వరగా నిర్ణయం తీసులేకపోవడం
మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా వస్తువు కొనడానికి కూడా చాలా సమయం తీసుకుంటారు. ఉదాహరణకు జీన్స్ కొనాలంటే.. పది రకాలుగా ఆలోచిస్తారు. చివరికి నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతారు.

గుడ్ టీం మెంబర్స్
సున్నిత స్వభావం కలిగిన వాళ్లు.. గ్రూప్ లో గొప్ప వ్యక్తులుగా పేరుతెచ్చుకుంటారు. తోటివాళ్ల అవసరాలను తెలుసుకుని.. వాళ్లకు కావాల్సిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు. అవసరమైతే.. ఎక్కువ సమయం పనిచేస్తూ.. అందరికీ కొత్త ఉత్సాహాన్నిస్తారు.

ఆందోళన, ఒత్తిడి
సున్నిత స్వభావులు అతిగా ఆలోచించడం, అతిగా విశ్లేషించడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆందోళన, ఒత్తిడికి లోనయ్యే అవకాశాలున్నాయి.

ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటారు
సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్లు ఎదుటివాళ్లు చెప్పేది ఓపిగ్గా, ఇంట్రెస్టింగ్ గా వింటారు. ప్రశ్నలు అడిగి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఎదుటి వాళ్ల సమస్యలు తెలుసుకుని.. సరైన సలహాలు ఇవ్వగలుగుతారు.

జంతు ప్రేమికులు
సున్నితమైన మనుషులు... జంతు ప్రేమికులై ఉంటారు. మూగజీవాలపై అమితమైన ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. రోడ్డుపై ఏవైనా.. పెట్స్ ఆకలితో కనిపిస్తే.. ఇంటికి తీసుకెళ్లి..పెంచుకుంటారు.

ప్రేమంటే మక్కువ
చాలా సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్లకు ప్రేమంటే చాలా ఇష్టం. తమకు ప్రత్యేకం అని ఫీలయ్యేవాళ్ల కోసం ఏమైనా చేస్తారు. కానీ.. ఎదుటివాళ్ల నుంచి కూడా అదే కోరుకుంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనవ్వాల్సి వస్తుంది.

ఆధ్మాత్మికత
చాలా సున్నితమైన వాళ్లు అన్ని పద్ధతిగా పాటిస్తారు. ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు చక్కగా పాటిస్తారు. యోగా, ధ్యానం వంటివి తప్పకుండా చేస్తారు.



Click it and Unblock the Notifications