For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు మీరు చేయకూడని 10 పనులు

By Super
|

బాడ్ మూడ్ మరియు కోపం, అనేవి సాధారణ మానవ భావాలు, మనమందరం కూడా వీటికి లొంగుతూ ఉంటాము. మనకు ఇష్టం లేని లేదా సంతోషం కలిగించని మరియు చెడు విషయాలపట్ల లేదా అసహ్యకరమైన విషయాలపట్ల కోపం తెచ్చుకోవటం అన్నది ఒక సహజ ప్రతిచర్య. చెడు మూడ్ లో ఉండటం అన్నది కూడా కోపం యొక్క కారకాలలో ఒకటి. ఇప్పుడు, పాయింట్ ఏమిటంటే మనం బాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అన్నది తెలుసుకుందాం.

READ MORE: సంతోషానికి-ఈ ఆహారాలకు మద్య ఉన్న సంబంధమేమి..?

మనకు ఆఫీసులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి లేదా స్నేహితుల దగ్గర కానివ్వండి, ఎక్కడైనా మన మూడ్ పాడవవొచ్చు లేదా కోపం రావొచ్చు. మీ చెడు మూడ్ ఇతరులను కష్టపెట్టవొచ్చు, అది మీకు మరింత బాధ మరియు అసంతృప్తి కలిగించవొచ్చు. మీ బాడ్ మూడ్ మీ సహనాన్ని దిగజారుస్తుంది మరియు అది మీ ప్రాణస్నేహితుని లేదా మీ జీవిత భాగస్వామిని కూడా బాధిస్తుంది.

READ MORE: మంచి మూడ్ కోసం తినాల్సిన 10 హ్యాపి ఫుడ్స్

మీరు మీ బాడ్ మూడ్ ను నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నిచండి మరియు అది మీకు చాలా కష్టంగా ఉంటే దాని ఉధృతి తగ్గేవరకు మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీరు బాడ్ మూడ్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాలను దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

మీరు బాడ్ మూడ్ లో ఉంటే నివారించేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలను ఇస్తున్నాము. ఒకసారి చూడండి.

ఏ సామాజిక నెట్వర్కింగ్ వెబ్సైట్లో పోస్ట్ చేయవద్దు

ఏ సామాజిక నెట్వర్కింగ్ వెబ్సైట్లో పోస్ట్ చేయవద్దు

మీ బాడ్ మూడ్ కొంత సమయం మాత్రమే ఉంటుంది మరియు శాశ్వతంగా ఎప్పటికీ ఉండదు. మీరు మీ కోపాన్ని లేదా చెడు భావనను వ్రాత రూపంలో పెట్టాలి అనుకుంటే, మీ వ్యక్తిగత నోటు పుస్తకంలో వ్రాసుకోండి మరియు సామాజికంగా పోస్ట్ చేయవొద్దు. మీకు తెలిసే ఉంటుంది, మీ సామాజిక నెట్వర్కింగ్ సైట్లు నిజానికి స్నేహితులు కావు.

నిర్ణయాలు తీసుకోవొద్దు

నిర్ణయాలు తీసుకోవొద్దు

మీరు కోపంతో మరియు బాడ్ మూడ్ లో ఉన్నప్పుడు నిర్ణయాలు ఏవీ తీసుకోవొద్దు. తొందరపాటు, కోపంలో తీసుకున్న నిర్ణయాలవాళ్ళ మెరుగైన ఫలితాలు పొందలేరు. మీరు మీ నిర్ణయాలపట్ల తరువాత చింతించినా ఫలితం ఉండదు,దురదృష్టవశాత్తు దాని గురించి మీరేం చేయలేరు. మీరు తిరిగి మనస్సును శాంతియుత స్థితికి తెచ్చుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకోండి.

దేనిని పట్టించుకోవొద్దు

దేనిని పట్టించుకోవొద్దు

ఎక్కడైనా సరే, మీరు పనిచేసే ప్రదేశంలో ఎవరైనా మీ బాడ్ మూడ్ కు కారకులు అయిఉంటే, ఉండనివ్వండి. మీపట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి కొన్ని వ్యక్తిగత సమస్యలు వున్నాయేమో అని ఆలోచించండి. తను మీపట్ల అమర్యాదకరంగా ఉండటానికి కారణం మీరు కాదు, తన వ్యక్తిగత సమస్యలు కారణం.

వాదనలు కొనసాగనివ్వవొద్దు

వాదనలు కొనసాగనివ్వవొద్దు

మీ బాడ్ మూడ్ కు కారణం వాదన అయి ఉంటే, ఇంకా తదుపరి వాదనలు చేయటం మానేయండి. వాదనల వలన మంచి ఫలితాలను పొందలేరు, కానీ మీ మనసు మాత్రం ముక్కలౌతుంది. మీరు చెప్పవొచ్చు మరియు వాదిస్తున్న ఇద్దరు వ్యక్తులు బాడ్ మూడ్ లో మరియు కోపంతో మాట్లాడుకున్న విషయాలు వినడానికి గుండె మండిపోయేలా ఉండవచ్చు. కాబట్టి, మీ స్నేహితుడితో లేదా జీవితభాగస్వామితో గాని మరింతగా వాదనలు పెంచవొద్దు. ఆ స్థలం వదిలి వెళ్ళండి మరియు మానసిక శాంతి పొందుతారు.

మద్యం త్రాగవొద్దు

మద్యం త్రాగవొద్దు

జనాలు మద్యం తాగినందు వలన వారిలో ఉధృతి తగ్గుతుందని భావిస్టారు కాని, అది నిజం కాదు. మద్యం, మీ మనస్సు నుండి మంచి,చెడు అన్నిటిని తొలగిస్తుంది మరియు అందువలన మీ మనస్సులో ఉన్న అన్నివిషయాలను బయటకు ప్రసంగిస్తారు. దీనివలన అవతలి వ్యక్తి సంతోషపడవొచ్చు లేకపోతే మీ సంబంధం నాశనం కావచ్చు.

 ఇ-మెయిల్స్ రాయడం మానుకోండి

ఇ-మెయిల్స్ రాయడం మానుకోండి

మీరు పని చేసే ప్రదేశంలో కోపంగా ఉంటే, మిమ్మల్ని మీరు ప్రశాంతపరచుకునే వరకు కొంత సమయం ఇవ్వండి. అన్ని ప్రతికూల ఆలోచనలు మాసిపోయేవరకు మీ స్నేహితునితో కలిసి కాఫీకి వెళ్ళండి. ఈ స్థితిలో మీరు మీ బాస్ కు ఇమెయిల్ వ్రాస్తే, మీరు మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఒకసారి ఇ-మెయిల్ పంపుతే, దానిని తిరిగి తీసుకోవాలనుకున్నా సాధ్యపడదు.

అందరితో మీ కోపం మరియు బాడ్ మూడ్ పంచుకోవద్దు

అందరితో మీ కోపం మరియు బాడ్ మూడ్ పంచుకోవద్దు

మీ స్నేహితులు అని చెప్పుకునే వారిలో చాలామంది నిజానికి స్నేహితులు కాదు స్నేహితుడు అన్న ముసుగు ధరించిన మీ శత్రువులు. మీరు మీ కోపాన్ని మరియు మీలో కలిగిన చెడు భావాలను వారితో పంచుకుంటే, వారు సంతోషంగా ఉండవచ్చు మరియు గాసిప్స్ మొదలుపెడతారు. వారు మీ భావాలను అతిశయంగా చెప్పుకుంటారు మరియు మీరు గురించి తప్పుడు పుకార్లు వ్యాప్తి చేస్తారు. మీ నిజమైన మరియు సన్నిహితులైన స్నేహితులతో మాత్రమే మాట్లాడండి.

నిద్రలో మునగటం మానుకోండి

నిద్రలో మునగటం మానుకోండి

మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు ఉంచుకుని మరియు కోపంతో నిద్రకు చేరకండి. దీనివలన మీ మెదడు పాడవుతుంది మరియు మీ నిద్ర చెడిపోతుంది. మీకు బాడ్ మూడ్ ఏ వ్యక్తి వల్ల కలిగిందో వారిపట్ల మొదట మీ మనస్సును ప్రశాంతపరచుకోండి. అలా మీకు సాధ్యపడకపొతే, మీరు మీ మెదడుని కొన్ని మనోల్లాసభరితమైన పద్ధతుల ద్వారా ప్రశాంతంగా ఉంచండి మరియు మంచి నిద్రకు చేరువకండి.

అధిక తిండి మానుకోండి

అధిక తిండి మానుకోండి

మీరు బాడ్ మూడ్ లో ఉన్నప్పుడు, మీరు ఒక పేస్ట్రీ లేదా ఒక ఐస్ క్రీం తినడంవలన మీ మనస్సు ఉపశమించవొచ్చు అని అనుకుంటారు. ఇది నిజం, కానీ మీరు మితిమీరి తింటున్నారనే విషయాన్ని కూడా గుర్తించకుండా అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినడంలో మునిగిపోతారు. కాబట్టి, మీరు కోపంతో ఉన్నప్పుడు మీరు గుటకలువేస్తున్న ఆహారం ఉన్న కేలరీలపట్ల కూడా జాగ్రత్త వహించండి.

డ్రైవ్ చేయవొద్దు

డ్రైవ్ చేయవొద్దు

మీరు బాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఏ వాహనం అయినా డ్రైవింగ్ చేయవొద్దు. మీ మనస్సు కోపంగా ఉన్నది మరియు దానివలన ఇతరులకు హాని కలగవచ్చు. బాడ్ మూడ్ లో ఉన్నప్పుడు, మీరు కోపానికి కారణమయిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు మరియు చివరికి అది ఒక ప్రమాదంగా మారవొచ్చు. కాబట్టి మీరు బాడ్ మూడ్ లో ఉన్నప్పుడు మీ వాహనం నుండి దూరంగా ఉండండి.

English summary

10 Things To Avoid In A Bad Mood: Pulse Articles in Telugu

10 Things To Avoid In A Bad Mood: Pulse Articles in Telugu, Bad mood and anger are normal human feelings that all of us encounter somehow. It is a natural reaction to get angry over the things that make us feel bad or are unpleasant to us.
Desktop Bottom Promotion