For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీసులో ఉన్నప్పుడు చెయ్యకూడని 12 పిచ్చి పనులు

By Super
|

మనం ఆఫీసులో పనిచేసేటప్పుడు మన చుట్టూ రకరకాల మనుషులుంటారు. వారిలో కొందరు కాం గా తమ పని తాము చేసుకుపోయేవాళ్ళుంటారు. మరికొందరేమో గట్టిగా మాట్లాడుతూ ఇతరులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, ఇంకొందరేమో ఇంకొక అండుగు ముందుకేసి ఇతరులని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంటారు తమ చేతల ద్వారా.ఇలాంటి వాళ్ళ అలవాట్లవల్ల ఆఫీసులో పనిచేసుకునేవారు తమ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోవచ్చు.

ఒకోసారి ఆఫీసులో “ఇలాంటి” మనుషులే తెలీకుండా ఇతరుల పనిమీద ప్రభావాన్ని చూపిస్తుంటారు. ఆ “ఇలాంటి” మనుషులు మీ కొలీగ్స్ కావచ్చు లేదా మీరే కావచ్చు.

READ MORE: కార్యాలయంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లను

మీ పక్కన కూర్చునే మీ కొలీగ్ అలవాటు ఏదైనా మీకు ఇబ్బందికరమనిపిస్తే ఆ విషయన్నే మెల్లిగా వారికి తెలియజేయడమే మంచిది.

కింద పేర్కొన్న అలవాట్లు ఆఫీసులో సమర్ధనీయం కాదు ...

త్రేనుపులు:

త్రేనుపులు:

నలుగురి ముందూ గట్టిగా త్రేంచడం అసహ్యకరమైన అలవాటు.ఒకవేళ కానీ “అద్రుష్టవశాత్తూ” మీ వెనకాల కూర్చునే మీ కొలీగ్ కి ఆ అలవాటు ఉంటే , అది మీకు అభ్యంతరకరమని స్పష్టంగా చెప్పగగిలిగితే మంచిది.

ఫోనులో గట్టిగా మాట్లాడటం:

ఫోనులో గట్టిగా మాట్లాడటం:

ఒకవేళ మీకు ఫోనులో గట్టిగా మాట్లాడే అలవాటుంటే దానిని తక్షణమే మానెయ్యండి.ఇది ఇతరులకి ఇబ్బంది కలిగించడమే కాదు,చాలా చెడ్డ అలవాటు కూడా ..

వింత వింత రింగ్ టోన్స్:

వింత వింత రింగ్ టోన్స్:

మీ ఫోను వింత రింగ్ టోను ఇతరులకి ఆనందం కలిగిస్తుంది అనుకుంటున్నారేమో.కానే కాదు.కనీసం ఆఫీసులో ఉన్నప్పుడైనా ఫోను సైలెంట్ లో పెట్టి మీ వయసుకి తగ్గట్టుగా హుందాగా మెలగండి

దుర్వాసన భరిత ఆపాన వాయువు విడుదల చేయడం

దుర్వాసన భరిత ఆపాన వాయువు విడుదల చేయడం

ఆఫీసులో ఉన్నప్పుడు ఆ దుర్వాసనాభరిత వాయువొదిలే అలవాటు స్వాగతించతగ్గది కాదు.ఏసీ లో ఉన్నప్పుడు ఇది ఇంకా ఇబ్బందికరం. అందువల్ల మీరు టాయిలెట్ లోనే మీ అవసరం తీర్చుకుని వస్తే ఈ బెడద ఉండదు.

కీ బోర్డ్ మీద బాదడం:

కీ బోర్డ్ మీద బాదడం:

కీ బోర్డ్ ని గట్టిగా టక టక లాడించడం వదిలించుకోవాల్సిన అలవాటు. కీ బోర్డు మీద గట్టిగా బాదడం మీకు అలవాటయ్యి ఉండవచ్చు,కానీ ఇప్పుడైనా కీబోర్డు ని శబ్దం రాకుండా వాడుకోవడం నేర్చుకోండి.

అనవసర సంభాషణ:

అనవసర సంభాషణ:

అకస్మాత్తుగా మీ పక్కన కూర్చునే కొలీగ్ మీ ద్రుష్టిని ఆకర్షించడానికి అర్ధం పర్ధం లేని సంభాషణ మొదలుపెడితే చిరాగ్గా ఉండదూ?? ఈ అర్ధ రహిత సంభాషణలని ఆఫీసులో మానెస్తే మంచిది

ముక్కులో పొక్కులు తీసుకోవడం:

ముక్కులో పొక్కులు తీసుకోవడం:

మీ ఆఫీసులో కనీసం ఒక్కరైన ముక్కులో పొక్కులు గిల్లుకోవడాన్ని ఆస్వాదించేవాళ్ళుంటరు. ఇది చాలా అసహ్యకరమైన అలవాటు. ఒకవేళ మీకే కనుక ఆ అలవాటుంటే టాయిలెట్లో మీ ముక్కు ని శుభ్రపరచుకోవడం అలవాటు చేసుకోండి.

టాయిలెట్ ఫ్లష్ చెయ్యకపోవడం:

టాయిలెట్ ఫ్లష్ చెయ్యకపోవడం:

టాయిలెట్ ని ఉపయోగించాకా సరిగ్గా ఫ్లష్ చెయ్యకపోవడమనే అలవాటు మనల్ని ఇతరులనుండి దూరం చేస్తుందని గుర్తు పెట్టుకోండి.

డెస్క్ దగ్గర తినడం:

డెస్క్ దగ్గర తినడం:

కొంతమంది ఆఫీసులో తమ డెస్క్ దగ్గరే టిఫిన్ డబ్బా మూత తీసి తింటూ ఉంటారు.ఇది కూడా మనం ఆఫీసులో చెయ్యకూడని పనుల్లో ఒకటి

అతిగా మాట్లాడటం:

అతిగా మాట్లాడటం:

పని చేసుకునే డెస్క్ దగ్గర అతిగా మాట్లాడే వారిని ఎవ్వరూ ఇష్టపడరు.కొంతమందికి ఇతరులు మాట్లాడుకునేది దొంగతనం గా వినడం ఆనందం కలిగిస్తుందేమో కానీ, ఎదుటివారిని అది తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది.

కాళ్ళూపడం:

కాళ్ళూపడం:

డెస్క్ దగ్గర పదే పదే కాళ్ళూపడం ఒకరకమైన ఉద్వేగ లక్షణం.మీకు కనుక ఆ అలవాటుంటే కాళ్ళూపడం తగ్గించుకోవడానికి ఉన్న చిట్కాలనోసారి చూడండి.

నోటి దుర్వాసన:

నోటి దుర్వాసన:

నోటి దుర్వాసన ఆఫీసులో ఇబ్బంది కలిగించే అలవాట్లలో ఒకటి. ఆఫీసులో మీ నోరు దుర్వాసేంతుంటే ఇతరులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

English summary

12 Crazy Things We Should Stop Doing At Work

12 Crazy Things We Should Stop Doing At Work, In an office we come across different types of people. There are the noisy ones, the silent ones, the creepy ones and of course there are some who are uncontrollably annoying.
Story first published: Wednesday, August 19, 2015, 18:00 [IST]
Desktop Bottom Promotion