For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయ్యప్ప భక్తులు ఒకరిని ఒకరు స్వామి అని ఎందుకు పిలుచుకుంటారు ?

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం గురించి మీకు తెలియని అనేక ఆశ్చర్యకర విషయాలున్నాయి. చాలామందికి అవగాహన లేని విశేషాలేంటో చూద్దాం...

|

శబరిమల చాలా పవిత్రమైన హిందూ దేవాలయం. కేరళలోని పెరునాడ్ గ్రామ పంచాయితీలో కొలువై ఉంది శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం. అయ్యప్ప స్వామి అభయా ఆశీస్సుల కోసం ఏటా కోట్లాది మంది భక్తులు శబరిమల దర్శించుకుంటారు. స్వామియే అప్పయ్య అన్న నామస్మరణ శబరిమల నలుదిక్కులా వ్యాపించి ఉంటుంది.

శబరిబల అయ్యప్ప స్వామికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్వామిని పూజించడానికి, దర్శించుకోవడానికి చాలా నియమనిబద్ధతలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు 41 రోజులు శ్రద్ధా భక్తులతో, కఠిన నియమాలతో ఆ మణికంఠుడిని పూజించాలి.

shabarimala

కేరళలో కొలువుదీరిన ఈ అయ్యప్ప స్వామి దేవాలయం అన్ని ఆలయాల మాదిరిగా సంవత్సరమంతా తెరిచి ఉండదు. కొన్ని సార్లు, అది కూడా కొన్ని రోజులు మాత్రమే ఆలయం తలపులు తీసి.. భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. కార్తీక మాసంలో అనేకమంది అయ్యప్ప భక్తులు స్వామి దీక్ష తీసుకుని మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం గురించి మీకు తెలియని అనేక ఆశ్చర్యకర విషయాలున్నాయి. చాలామందికి అవగాహన లేని విశేషాలేంటో చూద్దాం...

MOST READ:అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ? MOST READ:అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ?

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

ప్రపంచంలోనే అతిపెద్దా వార్షిక తీర్థయాత్ర ఈ శబరిమలలో జరుగుతుంది. ఇక్కడకు ప్రతి సంవత్సరం దాదాపు 5 కోట్ల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని అంచనా.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

18 కొండల మధ్య శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం కొలువై ఉంది. హిందువుల ఆరాధ్య దైవమైన అయ్యప్పస్వామి రాక్షసుడైన మహిషిని సంహరించి అక్కడ కొలువుదీరినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ స్వామి చాలా పవర్ ఫుల్ అని భక్తుల నమ్మకం.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

సముద్రానికి 1535 అడుగుల ఎత్తులో కొండ పైభాగంలో ఈ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయం చుట్టూ పర్వతాలు, దట్టమైన అడవులు ఉంటాయి.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమల చుట్టూ ఉన్న ప్రతి కొండపై ఒక దేవాలయం ఉంది. నిలాక్కల్, కలకేటి, కరిమల అనే పూర్వ దేవాలయాలు చుట్టూ ఉన్న కొండలపై వెలిశాయి.

MOST READ:పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?MOST READ:పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

హిందూ దేవాలయం అయిన శబరిమల ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని వయసుల మగవాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి పురుషుడు నలుపు లేదా నీలి రంగు వస్ర్తాలు ధరిస్తారు. మాలధారణ తర్వాత ఆ దీక్ష పూర్తయ్యేవరకు షేవింగ్ చేసుకోరు. అలాగే విభూతి, గంధంతో కలిపి బొట్టు పెట్టుకోవడం ఈ మాలధారణ నియమం. నిత్యం ఆ స్వామి నామస్మరణలోనే మాల ధరించి భక్తులు ఉండాలి.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమలకు వెళ్లడానికి అర్హత లేదు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కావడంతో రుతుక్రమంలో ఉన్న మహిళలు అయ్యప్ప దర్శనానికి వెళ్లడానికి వీలు లేదని కఠిన నియమం ఉంది. కాబట్టి ఆడవాళ్లు అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే.. 10 ఏళ్ల లోపు లేదా రుతుక్రమం నిలిచిపోయిన తర్వాత అంటే 50 ఏళ్ల తర్వాత శబరిమల వెళ్లవచ్చు.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి మరో విశేషముంది. ఈ దేవాలయం సంవత్సరమంతా తెరిచి ఉంతడదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దర్శించుకోవడానికి వీలు లేదు. కేవలం మండల పూజ సమయం అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకు ఉంటుంది. మకరవైళక్కు అనేది జనవరి 14న అంటే మకర సంక్రాంతి రోజు. మహా విశువ సంక్రాంతి సమయం అంటే ఏప్రిల్ 14న ఉంటుంది. మళయాలం నెలల ప్రకారం ప్రతి నెల 5 రోజులు మాత్రమే ఆలయం తీస్తారు.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

అయ్యప్ప భక్తులు 41 రోజులు వ్రతం లేదా దీక్ష చేస్తారు. రుద్రాక్షలు, తులసి విత్తనాలతో తయారు చేసిన మాలలతో ప్రత్యేకంగా మాలధారణ ధరించి అయ్యప్ప స్వామిని ఈ 41 రోజులు నియమ నిష్టలతో పూజిస్తారు. ఈ పూజావిధానంలో చాలా నియమాలు, పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

వందల మంది భక్తులు సంప్రదాయం ప్రకారం పర్వతాలు ఎక్కుతూ అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. ఎరుమిలీ నుంచి దాదాపు 61 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా శబరిమల చేరుకుంటారు. వండిపెరియార్ నుంచి 12.8 కిలోమీటర్లు, చాలకయం నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాదయాత్ర ద్వారా స్వయంగా అయ్యప్ప స్వామిమే తమను నడిపిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. కొండకు చేరేంత వరకు భక్తులు స్వామియే అయ్యప్ప అంటూ స్మరిస్తుంటారు.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

థాంఝామాన్ మడోమ్ అనే పూజారి కుటుంబం ఈ శబరిమల నియమాలు, పద్ధతులను నిర్ణయిస్తారు. ఈ పూజారులను తాంత్రి అని పిలుస్తారు. శబరిమల ఆలయానికి వీళ్లే అధికారులు. ఆలయం తెరిచినప్పుడు ఎప్పుడు ఎలాంటి కార్యాలు నిర్వహించాలి అనే విషయాలన్నీ వీళ్లే నిర్ణయిస్తారు. కలశ పూజ, మహామండల పూజ వంటివన్నీ కార్యక్రమాలకు వీళ్లు వస్తారు. వీళ్లు లేకుండా శబరిమలలో ఎలాంటి పూజా కార్యక్రమాలు ప్రారంభం కావు. ఈ పూజారి కుటుంబంతోనే ఈ ఆలయంలో విగ్రహం కూడా శంకుస్థాపన జరిగింది.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలలో ప్రసాదం చాలా ఫేమస్. ఈ ప్రసాదాన్ని అరవన ప్రసాదం, అప్పం అంటారు. దీన్ని బియ్యం, నెయ్యి, చక్కెర, బెల్లం ఉపయోగించి తయారు చేస్తారు.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

ప్రతిరోజు ఆలయం తలుపులు మూసే ముందు రాత్రిపూట హరివరసనమ్ అనే పాట పాడుతారు. ఈ పాటను శ్రీ శ్రీనివాస అయ్యర్ అనే వ్యక్తి కంపోజ్ చేశారు. దేవాలయం ముఖ ద్వారం ముందు నిలబడి ఈ పాట పాడుతారు. ఈ పాటలో 32 లైన్స్, 108 పదాలు, 352 అక్షరాలు ఉంటాయి.

MOST READ:శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..?MOST READ:శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..?

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

మాల ధరించిన ప్రతి భక్తుడు ఇరుముడి తీసుకుని శబరిమల చేరుకుంటాడు. కాటన్ క్లాత్ లో స్వామికి సమర్పించాల్సిన కానుకలను ఇందులో కడతారు. ఇది అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. మొదటిసారి శబరిమలకు వచ్చే భక్తులు ఎరుపు రంగు వస్ర్తం, ఆ తర్వాత మూడు సార్లు వచ్చే భక్తులు నీలి రంగు, ఆ తర్వాత వచ్చే భక్తులు సాఫ్రాన్ కలర్ క్లాత్ లో ఇరుముడి తీసుకుని వస్తారు. ఈ ఇరుముడిలో ముఖ్యంగా నెయ్యాభిషేకం ఉంటుంది. కొబ్బరికాయలో నెయ్యిని నింపుకుని తీసుకుని వచ్చి ఇక్కడ స్వామికి సమర్పిస్తారు.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

రామావతారంలో శ్రీరాముడు వనవాసం చేసి, సీతాన్వేషణ చేస్తున్న సమయంలో భక్తురాలు శబరి శ్రీరామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చి, కొలిచిన కొండ కావడం వల్ల ఈ కొండకు శబరిమల అని పేరు వచ్చింది. శ్రీరాముడు శబరిమల దర్శించుకున్న రోజు మకర విలక్కు. అందుకే ఆ రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

శబరిమలకు అంతటి వైభవం రావడానికి కారణాలు

ప్రతి ఒక్కరూ దైవంతో సమానమని.. శబరిమల కొండ ద్వారా సందేశం ఇస్తారు. అందుకే అక్కడ ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు స్వామి అని పిలుచుకుంటారు. అలాగే అయ్యప్ప మాల ధరించిన ప్రతి భక్తుడు ప్రతి ఒక్కరినీ స్వామి అనే పిలుస్తారు.

English summary

15 Lesser known facts about Sabarimala

Sabarimala is a Hindu pilgrimage center located in the Western Ghat mountain ranges of Pathanamthitta District, Perunad grama panchayat in Kerala.
Desktop Bottom Promotion