Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ క్యారెక్టర్ కి, మీ బ్లడ్ టైప్ కి సంబంధమేంటి ?
మీకు తెలుసా మీ బ్లడ్ గ్రూప్ మీ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని, మీ మెంటాలిటీని తెలుపుతుందని ? జపాన్ లో చేపట్టిన రీసెర్చ్ లో బ్లడ్ గ్రూప్ కి, వ్యక్తిత్వానికి దగ్గరి సంబంధం ఉందని తేలింది. ఒక వ్యక్తి క్యారెక్టర్ బ్లడ్ గ్రూప్ ని బట్టి ఉంటుందన్న విషయం అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది.
వ్యక్తుల రాశులకు బదులు బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటున్నారు జపాన్ ఆస్ర్టాలజర్స్. బ్లడ్ గ్రూప్ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, వాళ్ల ఆరోగ్య పరిస్థితిని, అలాగే భవిష్యత్ ను వివరిస్తోందట. కొరియాతో పాటు కొన్ని ఈస్ట్ ఏసియన్ దేశాలు కూడా బ్లడ్ గ్రూప్ ని బట్టి మనిషి క్యారెక్టర్ తెలుసుకోవచ్చన్న అంశాన్ని నమ్ముతున్నారు.
సాధారణంగా A, B, AB, O బ్లడ్ గ్రూప్ లున్నాయి. ఈ బ్లడ్ గ్రూప్ ని అందరూ మెడికల్ ట్రీట్మెంట్ సమయంలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అయితే లవ్ లైఫ్, వర్క్ లైఫ్, సామాజిక జీవితం, ఇష్టాయిష్టాలు, పర్సనాలిటీ గురించి కూడా తెలుపుతాయని ఈ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
మీకు మీ బ్లడ్ గ్రూప్ లేదా బ్లడ్ టైప్ తెలిస్తే చాలు. ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఎలాంటి వ్యక్తో ఈజీగా తెలుసుకోవచ్చు. చాలా ఆసక్తికర అంశాలు మీ బ్లడ్ గ్రూప్ వివరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ బ్లడ్ గ్రూప్ మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసుకోండి.

A బ్లడ్ గ్రూప్
A బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు చాలా ఓర్పు, సహనం కలిగి ఉంటారు. అలాగే తమ ఫీలింగ్స్ దాచిపెడతారు. వీళ్లు పర్ఫెక్షన్, ఆర్గనైజేషన్ స్కిల్స్ అలవరుచుకుంటారు. వీళ్లు చాలా బాధ్యతాయుతంగా, విశ్లేషణాత్మకంగా, క్రియేటివ్ గా, చాలా పద్ధతిగా ప్రవర్తిస్తారు. అలాగే సున్నిత స్వభావంతో, మొహమాటం ఉండటం వీళ్ల నెగటివ్ పాయింట్స్.

A బ్లడ్ గ్రూప్ - సోషల్ లైఫ్
వీళ్లకు వాదించడం, ఘర్షణ పడటం వంటివి ఇష్టముండదు. వీళ్లు నమ్మదగినవాళ్లు. అలాగే ఈజీగా హర్ట్ అయ్యే మెంటాలిటీ A బ్లడ్ గ్రూప్ వ్యక్తులది. వీళ్లు పెద్ద పెద్ద పార్టీలు ఎంజాయ్ చేయలేరు. తక్కువ మంది ఫ్రెండ్స్ సర్కిల్ నే ఇష్టపడతారు. ఒకవేళ వీళ్లను బాధపెడితే.. చాలా కోపానికి గురవుతారు.

A బ్లడ్ గ్రూప్ - వర్క్ లైఫ్
A బ్లడ్ గ్రూప్ వ్యక్తులు వర్క్ విషయంలో చాలా నమ్మదగినవాళ్లు. వీళ్లు ప్రతి ఒక్కదాన్ని చాలా పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటారు. తమ పని చాలా బాగుండాలని కోరుకుంటారు. అయితే వీళ్లు చాలా సులభంగా పని ఒత్తిడికి లోనవుతారు.

A బ్లడ్ గ్రూప్ - లవ్ లైఫ్
కొత్త సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు A బ్లడ్ గ్రూప్ వాళ్లు అంత ఈజీగా అన్ని విషయాలు పంచుకోలేరు. వీళ్ల భాగస్వామి చాలా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే తమ ప్రేమను, ఆప్యాయతను క్రమక్రమంగా చూపిస్తారు.

B బ్లడ్ గ్రూప్
B బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు చాలా ప్రేమ, క్రియేటివ్, ఇమాజినేటివ్, ఆశావాదం, ఉత్సాహంగా ఉంటారు. వీళ్లు ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడతారు. ఎమోషనల్ గా చాలా స్ర్టాంగ్ గా ఉంటారు. అలాగే వీళ్ల నెగటివ్ పాయింట్స్ కి వస్తే చాలా రెబెల్ క్యాండిడేట్స్. స్వార్థపరులు, రివెంజ్ ఫుల్ గా ఉంటారు. దాంతోపాటు బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు.

B బ్లడ్ గ్రూప్ - సోషల్ లైఫ్
ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వీళ్లు ఎక్కువ ఇష్టపడతారు. జీవితాన్ని ఈవెంట్ లా గడుపుతారు. వీళ్లు చేయాలనుకున్నదే చేస్తారు. ఇతరుల మాట అస్సలు వినరు, పట్టించుకోరు.

B బ్లడ్ గ్రూప్ - వర్క్ లైఫ్
వీళ్లు రూల్స్ ఫాలో అవడాన్ని అస్సలు ఇష్టపడరు. వీళ్లకు ఏది అనిపిస్తే, ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. వర్క్ విషయంలో కూడా అలాంటి నిబంధనే ఫాలో అవుతారు. ఇతరులకు అస్సలు సహకరించరు.. వీళ్లకు నచ్చినట్లే వీళ్లు వర్క్ చేస్తారు. అయితే వీళ్ల లక్ష్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

B బ్లడ్ గ్రూప్ - లవ్ లైఫ్
B బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు అస్సలు ఓర్పు ఉండదు, అలాగే చాలా షార్ట్ టెంపర్ గా ఉంటారు. వీళ్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు. కోపంలో పార్టనర్ ని నిందిచినా.. అది కావాలని చేయరు. ఎలా నడుచుకున్నా.. భాగస్వామిపై ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే రిలేషన్ లో చాలా ఫన్ క్రియేట్ చేస్తారు.

AB బ్లడ్ గ్రూప్
AB బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా, తెలివికలిగిన, కలిసిపోయే తత్వం, ఆసక్తికరంగా, ఇమాజినేటివ్ గా ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో మూడీగా, ఎమోషనల్ గా, స్వార్థపరులుగా ప్రవర్తిస్తారు.

AB బ్లడ్ గ్రూప్ - సోషల్ లైఫ్
స్నేహితులకు చాలా ఇష్టమైన వాళ్లుగా ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కి చాలా ప్రేమ పంచుతారు. చాలా ఫన్నీగా ఉంటారు.. ఫ్రెండ్స్ ని ఎంటర్ టైన్ చేస్తారు. కొన్ని రకాల స్పీచ్ ల ద్వారా తమ టాలెంట్ నిరూపించుకుంటారు. అయితే ఎమోషన్స్, ఎవరికీ అర్థంకాని స్వభావం వల్ల ఓటమిపాలవ్వాల్సి వస్తుంది.

AB బ్లడ్ గ్రూప్ - వర్క్ లైఫ్
వీళ్లతో పనిచేయడం చాలా బావుంటుంది. కానీ సులభంగా ఎమోషనల్ గా పీలవుతారు.. దీంతో చాలా హర్ట్ అవుతారు. దీనివల్ల వర్క్ లో క్వాలిటీ తగ్గిపోతుంది.

AB బ్లడ్ గ్రూప్ - లవ్ లైఫ్
AB బ్లడ్ గ్రూప్ వ్యక్తులు తమ భాగస్వామికి ఎప్పుడూ బోర్ కలుగకుండా చూస్తారు. ప్రతి నిమిషం, ప్రతి సెకన్ వాళ్ల కోసం స్పెండ్ చేస్తారు. చాలా ఫన్ గా, రొమాంటిక్ గా ఉంటారు. అయితే వీళ్లు చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో తమ పార్ట్ నర్స్ ని తమ ఫీలింగ్స్ తో హర్ట్ చేస్తారు.

O బ్లడ్ గ్రూప్
O బ్లడ్ గ్రూప్ వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా, కష్టపడి పనిచేసేవాళ్లు. కాన్ఫిడెంట్, స్ర్టాంగ్ విల్ పవర్, నిజాయితీ, క్యూరియస్, ఉదారత కలిగి ఉంటారు. వీళ్లు నెగటివ్స్ విషయాలకి వస్తే.. బాధ్యతారహితంగా, అహంకారం, దూకుడు స్వభావం కలిగి ఉంటారు.

O బ్లడ్ గ్రూప్ - సోషల్ లైఫ్
O బ్లడ్ గ్రూప్ వ్యక్తులు చాలా అనువైన, ఓపెన్ మైండెడ్, సులభంగా కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. వీళ్లు తాము పనిచేసే కంపెనీని ప్రేమిస్తారు. అలాగే తన స్నేహితులంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు.

O బ్లడ్ గ్రూప్ - వర్క్ లైఫ్
వీళ్లు పనిలో బాగా నిమగ్నమవుతారు, అలాగే సక్సెస్ అవుతారు. గోల్ రీచ్ అవడానికి చాలా కష్టపడతారు. అయితే కొన్ని సందర్భాల్లో చాలా సులభంగా పనిలో ఆసక్తి కోల్పోతారు. కొన్నిసార్లు వీళ్లకు గైడ్ అవసరమవుతారు. ఎవరైనా పరిశీలించినప్పుడే.. వర్క్ ఈజీగా పూర్తి చేయగలుగుతారు.

O బ్లడ్ గ్రూప్ - లవ్ లైఫ్
ఫ్రీగా ఉండే స్వభావాన్ని వాళ్ల భాగస్వాములు ఇష్టపడక పోవచ్చు. O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు తమ పార్ట్ నర్స్ విషయంలో కొద్దిగా కేర్ లెస్ గా ఉంటారు. అలాగే ఎక్కువ ప్రేమ చూపించరు. అలాగే వాళ్లకు ఉండాల్సిన ప్రాముఖ్యతకు మాత్రం ఏ మాత్రం తక్కువ ఉండదు.. ఆ విషయాన్ని తమ భాగస్వాములు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications











