Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రపంచ శాఖాహార దినోత్సవం స్పెషల్.. విభిన్నంగా వెజిటేరియన్ డే సెలబ్రేషన్స్
అక్టోబర్ 1 ప్రపంచ శాఖాహార దినోత్సవం. శాఖాహారం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో అవగాహన కల్పించడానికి నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ... ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సులభంగా జీర్ణమయ్యే శాఖాహారాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ వెజిటేరియన్ డేను ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు ఆరోగ్యానికి మంచిదని.. మాంసాహారం జీర్ణకోశ వ్యాధులకు కారణమవుతోందని.. శాఖాహార దినోత్సవం చెబుతోంది. కాబట్టి అందరూ వెజిటేరియన్ ఫుడ్ నే ఇష్టపడాలని ప్రోత్సహిస్తూ.. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వెజిటేరియన్ డేను ఇంట్రెస్టింగ్ గా.. టేస్టీగా
జరుపుకోవడానికి ఏడు మార్గాలు.. లెట్స్ చెక్ ఔట్..

మాంసాహారానికి బ్రేక్
అక్టోబర్ 1న వెజిటేరియన్ డే సందర్భంగా.. ఈ నెలంతా.. శాఖాహారం తీసుకోవాలని చెబుతుంది నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ. బీఫ్, పోర్క్ మాత్రమే కాదు.. చేపలు, కోడి మాంసం వంటి అన్ని నాన్ వంటకాలకు ఈ నెలంతా దూరంగా ఉండాలి.

అథితులకు శాఖాహార విందు
స్నేహితులు, బంధువులను భోజనానికి ఆహ్వానించండి. వెజిటేరియన్ లో ఉన్న హెల్తీ అండ్ టేస్టీ రెసిపీలను వండి రుచి చూపించండి. కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, ధాన్యాలతో ఎంత రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చో వివరించండి.

శాఖాహారం వల్ల లాభాలు వివరించండి
ఎక్కువ మోతాదులో పండ్లు, గింజలు, కూరగాయలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించండి. మాంసాహారం పదే పదే తీసుకోవడం మంచిది కాదని సూచించండి.

శాఖాహారాన్ని ప్రోత్సహించండి
శాఖాహారులుగా ఉండటం అంటే చాలామంది బోర్ గా ఫీలవుతారు. కానీ.. వెజిటేరియన్ ఫుడ్ లోనే ఎక్కువ పోషకాలు, విటమిన్స్ ఉంటాయని.. వాటిని ఆహారంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని సూచించండి. సమావేశం ఏర్పాటు చేసి.. వెజిటేరియన్ పై అవగాహన కల్పించండి. రకరకాల వెజిటేరియన్ ఫుడ్.. వండటం లేదా వెజిటేరియన్ ఇష్టపడే వాళ్లతో శాఖాహార వంటల గురించి చర్చించడం వంటి కార్యక్రమాలు చేయండి.

శాఖాహారంపై అవగాహన
శాఖాహారం తీసుకోవడంపై కలిగే లాభాలు వివరిస్తూ.. వరల్డ్ వెజిటేరియన్ రోజు పోస్టర్లు అతికించండి. మాంసాహారం తక్కువగా తీసుకోవడం.. పండ్లు, కూరగాయలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. వాటి వల్ల కలిగే లాభాలు వివరించాలి. లైబ్రరీ నుంచి శాఖాహార వంటల పుస్తకాలు సేకరించి.. వాటి ద్వారా ప్రమోట్ చేయండి.

రెస్టారెంట్లలో వెజిటేరియన్ ఫుడ్
ఈ మధ్య చాలా రెస్టారెంట్స్ లో నాన్ వెజ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. శాఖాహారంలో ఎక్కువ వెరైటీస్ ఆఫర్ చేయడం లేదు. కాబట్టి.. వెజ్ ఐటమ్స్ మెనూ పెంచాలని డిమాండ్ చేయాలి. రెస్టారెంట్ లోనూ, వెబ్ సైట్లలోనూ వెజిటేరియన్ పై అవగాహన కల్పిస్తూ పోస్టర్స్ అతికించాలని సూచించండి.

సోషల్ మీడియాలో ప్రచారం
వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం ఎంత అవసరమో వివరిస్తూ.. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వాటిల్లో వెజిటేరియన్ కు సపోర్ట్ చేసే వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలి. దాని ద్వారా ఈ ప్రపంచాన్ని వెజిటేరియన్ వరల్డ్ గా మార్చండి.



Click it and Unblock the Notifications