Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
అదృష్టం తీసుకొచ్చే ఏడు వర్ణాలు
వారం రోజుల్లో.. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా ? అసలు ఒక్కో రోజు ఒక్కో రంగుకి ప్రాధాన్యత ఉందని మీకు తెలుసా ? ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా ? నిజమే ఆదివారం నుంచి శనివారం వరకు.. ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందుకు తగ్గట్టు ఆ రంగు దుస్తులు ధరించడం వల్ల.. మీకు బలం కలిసొచ్చినట్టే.
మనం వేసుకునే దుస్తుల రంగులు.. మన మూడ్, పనిపైన ప్రభావం చూపుతాయన్నది ఎంత నిజమో.. హిందు పురాణాల ప్రకారం ఒక్కో రోజు ఒక్కో గ్రహానికి ప్రత్యేకత ఉందన్నది అంతే నిజం. కాబట్టి.. గ్రహాన్ని బట్టి ఆ రోజు ఆ రంగు వస్త్రాలు ధరించడం వల్ల.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రేయస్సు పెరుగుంది. అదృష్టం వరించే వర్ణాలేంటో ఓ లుక్కేయండి..

సోమవారం
సోమవారం చంద్రగ్రహంతో ముడిపడి ఉంది. కాబట్టి.. తెలుపు రంగు దుస్తులు వేసుకుని చందమామలా మెరిసిపోండి. తెలుపు బట్టలు అదృష్టాన్ని సూచిస్తాయి. వైట్ డ్రెస్ కి కాంబినేషన్ గా వజ్రాభరణాలు, ముత్యాల నగలు వేసుకుంటే.. శ్రేయస్సుతో పాటు.. క్వీన్ లానూ మెరిసిపోవచ్చు.

మంగళవారం
మంగళకరమైన మంగళవారం.. ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రంగుకి సెట్ అయ్యేలా రూబీస్, కోరల్స్ జ్యువెలరీ వేసుకుంటే అందరినీ ఆకట్టుకుంటుంది.

బుధవారం
బుధవారం గ్రీన్ కలర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆకుపచ్చ రంగు దుస్తులు.. గ్రీన్ స్టోన్ జ్యువెలరీ వాడితే మంచిది. ఎమరాల్డ్స్, జేడ్ వంటి స్టోన్స్ వేస్తే అందంతో పాటు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

గురువారం
గురువారం బంగారు వర్ణం మీ శ్రేయస్సును పెంచుతుంది. ఎల్లో డ్రెస్సులు.. ఎల్లో స్టోన్ నగలు ధరిస్తే.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

శుక్రవారం
శుక్రవారం అమ్మాయిలు మెచ్చే పింక్ కలర్. పింక్ డ్రెస్సులు.. రూబీ జ్యువెలరీకి ప్రాధాన్యత ఇవ్వండి.

శనివారం
శనివారం వచ్చిందంటే.. నలుపుకి ప్రాధాన్యత ఇవ్వాలి. నలుపుతో పాటు బ్లూ, ఇండిగో, పర్పల్ కలర్స్ కూడా వాడచ్చు. బ్లూ స్టోన్స్, బ్లాక్ బీడ్స్ వాడటం శ్రేయస్కరం.

ఆదివారం
ఆదివారం సూర్యుడి రోజు. సూర్యుడు అన్ని రంగులను ఇమ్చుడుకుంటాడు కాబట్టి ఏ రంగైనా ధరించవచ్చు. కానీ ఆరంజ్ డ్రెస్సులు ధరిస్తే.. శత్రువులను అధిగమించవచ్చు.
ఏ రోజు ఏ డ్రెస్ శ్రేయస్కరమో తెలుసుకున్నారు కదూ.. ఇంకే వెంటనే ఫాలో అయి అదృష్టాన్ని పరీక్షించుకోండి.



Click it and Unblock the Notifications