For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్లను ఇబ్బందికి గురిచేసే ఆడవాళ్ల బ్యాడ్ హ్యాబిట్స్

By Nutheti
|

ఆడవాళ్లు చేసే కొన్ని పనులు మగవాళ్లకు చికాకు తెప్పిస్తాయి. రోజూ చేసే అలాంటి పనుల వల్ల మగవాళ్లు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ఆడవాళ్లకు ఉండే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ని మగవాళ్లు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు.

READ MORE: ఇండియన్ వైఫ్స్ కు చీకాకు పెట్టే భర్త యొక్క అలవాట్లు

ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడటం వంటి అలవాట్లన్నీ మగవాళ్లకు అర్థంకానివే. ఎందుకిలా చేస్తారో అని ఎప్పుడూ తలబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అతివలు చాలా అమాయకంగా చేసే ఎలాంటి అలవాట్లు మగవాళ్లలో కోపానికి, చికాకుకు కారణమవుతాయో చూద్దాం.

మీ బరువు గురించి చికాకు పెట్టడం

మీ బరువు గురించి చికాకు పెట్టడం

ఆరోగ్యంగా ఉండటం, బరువుని కంట్రోల్ లో పెట్టుకోవడం ఆడవాళ్లకు తృప్తినివ్వదు. శరీరంలోని ప్రతి భాగాన్ని, షేఫ్ ని పరిశీలించుకుంటారు. అద్దం ముందు నిలబడి.. ఎక్కువ సైజ్ లో వేరియేషన్ ఉందో చూసుకుంటూ, భర్తను రకరకాల ప్రశ్నలతో చికాకు పెట్టిస్తుంటారు. కానీ మీ భర్త అవేవీ గమనించరు.

ఎప్పుడూ గాసిప్స్

ఎప్పుడూ గాసిప్స్

నిరంతరం గాసిప్స్ చెప్పుకోవడాన్ని మగవాళ్లు అస్సలు ఇష్టపడరు. మీ భర్త ఎదుట ఇతరుల గురించి గాసిప్స్ చెప్పడం చాలా రిస్క్ తో కూడినది. దీన్ని వాళ్లు ఆటంకంగా ఫీలవుతారు. ఇలాంటి అనవసర గాసిప్స్ వల్ల వాళ్ల ప్రేమను కోల్పోవాల్సి వస్తుంది.

చెప్పినదే పదే పదే చెప్పడం

చెప్పినదే పదే పదే చెప్పడం

చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, ఎక్కువగా వాదించడం వల్ల మీ భర్త మిమ్మల్ని అసహ్యించుకుంటారు. అతను చెప్పిన విషయాలు వినకుండా వాదించడాన్ని ఇష్టపడరు. దీన్ని మీ భాగస్వామి టార్చర్ గా ఫీలవుతారు. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు చెప్పే విషయాలు వినకుండా ఉండే అవకాశముంది. కాబట్టి వాదించకుండా.. సూచనలు, సలహాలు ఇస్తే హ్యాపీగా ఫీలవుతారు.

సైలెంట్ ట్రీట్మెంట్

సైలెంట్ ట్రీట్మెంట్

ఇద్దరి మధ్య గొడవ జరిగే సమయంలో ఇచ్చే సైలెంట్ సిగ్నల్స్ ఆడవాళ్లకు పవర్ ఫుల్ టూల్. నలుగురిలో ఉన్నప్పుడు ఇతరులకు తెలియకుండా.. భాగస్వామిని హెచ్చరించడానికి ఈ సైలెంట్ ట్రీట్మెంట్ ఉపయోగిస్తారు. కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల పిల్లలుపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది.

ఎక్కువగా మాట్లాడటం

ఎక్కువగా మాట్లాడటం

అవసరానికి తగ్గట్టు మాట్లాడితే మీ బంధం హెల్తీగా ఉంటుంది. కానీ అతిగా మాట్లాడటం వల్ల మీ భాగస్వామి ఇబ్బందిపడతాడు. కాబట్టి తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వినడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటడం వల్ల అతను మీ మాటలపై అటెన్షన్ ని కోల్పోతాడు. మీరు మాట్లాడితే బోర్ గా ఫీలవుతాడు.

ఎప్పుడూ లేట్

ఎప్పుడూ లేట్

అప్పుడప్పుడు లేట్ గా ఉంటే మీ భాగస్వామి అంగీకరిస్తాడు. కానీ ఎప్పుడూ, ప్రతిసారీ లేట్ అవడం వల్ల మీ ప్రణాళికలు, పట్టుదలను తక్కువగా అంచనా వేస్తారు. తనను గౌరవించడం లేదని భావిస్తారు. కాబట్టి ఎందుకు లేట్ అవుతున్నారో, కారణాలేంటో ఓ సారి అనలైజ్ చేసుకుని, మున్ముందు అలా జరగకుండా ప్లాన్ చేసుకోవాలి.

ఎక్కువ మేకప్

ఎక్కువ మేకప్

ఫౌండేషన్, ఐ లైనర్, మస్కారా, లిప్ స్కిక్ రోజూ ఫాలో అవడం కామన్. కానీ మీ భాగస్వామికి అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువగా మేకప్ చేసుకున్నా.. చాలా ఎక్కువగా ఉందని భావిస్తారు. కాబట్టి మేకప్ వేసుకున్నా.. సహజంగా కనిపించేలా ఉండాలి. అప్పుడే మీ పార్టనర్ ని ఎట్రాక్ట్ చేయగలుగుతారు.

సీకెట్స్ దాచిపెట్టడం

సీకెట్స్ దాచిపెట్టడం

సీక్రెట్స్ దాచిపెట్టడం వల్ల రిలేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ సంబంధానికైనా నమ్మకం పునాది. కాబట్టి ఒక్కసారి నమ్మకం కోల్పోతే.. మళ్లీ తెచ్చుకోవడం చాలా కష్టం. ఏదీ దాచుకోకుండా.. మీ పార్ట్ నర్ తో షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య కమ్యునికేషన్ పెరుగుతుంది. రిలేషన్ నిజాయితీగా ఉంటుంది.

ఇతర మహిళలతో పోల్చుకోవడం

ఇతర మహిళలతో పోల్చుకోవడం

ఇతరులతో పోల్చుకోవడాన్ని మగవాళ్లు సహించలేరు. నీకు నువ్వుగా ఉండటాన్నే ఇష్టపడతారు. దీనివల్ల మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ దెబ్బతింటాయి. మీ సమయాన్ని, సామర్థ్యాన్ని మీ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఉపయోగించాలి.

English summary

Female Bad Habits Men Can't Understand

As amazing as we women are, there are a few things we do on a regular basis that drive men up the wall. Here are ten habits that guys find annoying or fail to understand.
Story first published: Monday, November 30, 2015, 12:52 [IST]
Desktop Bottom Promotion