For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామాయణంలోని అంశాలను కళ్లకు కట్టే పుణ్యక్షేత్రాలు

By Nutheti
|

రామాయణం ఒక ఇతిహాసం, మహా కావ్యం. రామాయణంలో చెప్పబడిన ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఎన్నో భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. అక్కడి ఆలయాలు అపారమైన భక్తివిశ్వాసాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సాక్షాత్తూ ఆ శ్రీ రాముడు నడయాడిన ప్రదేశాలు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి.

READ MORE: రామాయణంలో రాముడి తండ్రి దశరథుడు శాపానికి గురవ్వడానికి కారణాలేంటి

మనం పవిత్రంగా భావించే చాలా ప్రాంతాలు ఆయా ప్రత్యేకతలే కాకుండా.. పురాణ గాధలతో సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని పురాతన కట్టడాలు చాలా విశిష్టతను కలిగి ఉంటాయి. అయితే రామాయణంతో ముడిపడిన కొన్ని పవిత్ర స్థలాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సీతారాములు అడుగుపెట్టిన ఎన్నో ప్రాంతాలు ఇప్పటికి చిరస్మరణీయంగా మిగిలాయి.

READ MORE: శ్రీ సీతారామస్వామి కొలువైన భద్రాచల ఆలయానికున్న చరిత్ర

భారతీయులు చాలా ప్రాంతాలను పవిత్ర, పుణ్య స్థలాలుగా భావిస్తారు. కానీ వాటి వెనక రామాయణ విశేషాలు ఉన్న విషయం అందరికీ తెలియకపోవచ్చు. ఇంతకీ రామాయణంతో ముడిపడిన పవిత్ర పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలేంటో చూద్దాం..

నాసిక్

నాసిక్

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో నాసిక్ ఒకటి. ఇది ముంబైకి 187 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరణ్యవాసానికి వెళ్లినప్పుడు శ్రీరామ చంద్రుడు నాసిక్ లో కొన్ని రోజులు నివసించారు. రావణుడు సీతను అపహరించింది కూడా ఇక్కడి నుంచే. అంతేకాదు రావణుడి సోదరి సూర్పనక ముక్కును లక్ష్మణుడు కోసినది కూడా ఇక్కడే. అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరు వచ్చింది.

కుంభమేళా

కుంభమేళా

నాసిక్ లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. నాసిక్ లో రామకుండ అనేది ప్రధాన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ రాముడు, సీత స్నానాలు చేసేవాళ్లని అందుకే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఇందులో ఎముకలు ఈజీగా కలిసిపోతాయి.. అందుకే ఇందులో చనిపోయిన వాళ్ల అస్థికలు కలుపుతారు. కాబట్టి దీన్ని అస్థి విలయ తీర్థ అని కూడా పిలుస్తారు.

నాసిక్ లో దశరథ మహారాజు అంత్యక్రియలు

నాసిక్ లో దశరథ మహారాజు అంత్యక్రియలు

శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించినట్లు ప్రస్తావన ఉంది. అంతేకాదు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరికొందరు ప్రముఖుల అంతిమ సంస్కారాలు ఇక్కడే జరిగాయి.

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరంలోని చాలా ప్రాంతాలు రామాయంతో ముడిపడి ఉన్నాయి. రామేశ్వరంలోపలికి వెళ్లాలంటే ఇక్కడ ఉన్న బ్రిడ్జి దాటాల్సి ఉంటుంది. శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు వానరసేనతో కలిసి ఈ బ్రిడ్జ్ దాటడానికి రాళ్లు వేసివెళ్లినది ఇక్కడే. దీన్ని లక్ష్మణ తీర్థ, రామ తీర్థ అని పిలుస్తారు. బాణాలను గ్రౌండ్ లోకి విసిరిన ప్రాంతాన్ని కోడి తీర్థ అని, రాముడు తన జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించిన ట్యాంక్ ని జట తీర్థ అంటారు.

హంపి

హంపి

విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపి. విజయనగర సామ్రాజ్యానికి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సైన్యం ఉండేది. అయితే రాముడికి హంపికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? ఉంది. ఇక్కడే శ్రీరాముడు హనుమంతుడిని మొదటిసారి కలిసిన ప్రాంతం. అలాగే పార్వతి తన భర్త అయిన శివున్ని కలిసినది కూడా ఇక్కడే.

కిష్కింద

కిష్కింద

హంపి నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉంది అనేగుడి. ఇక్కడ తుంగబద్ర నది ప్రవహిస్తుంది. అయితే ఈ ప్రాంతానికి పురాణగాధ ఉందని స్థానికులు నమ్ముతారు. అదే రాముడు హనుమంతుడు, సుగ్రీవుడిని కలిసిన కిష్కిందగా భావిస్తారు. రామాయణంలో ప్రస్థావించిన రిష్ ముఖ్ పర్వతం హంపికి దగ్గరలోనే ఉంది.

కిష్కంద - పురాతన ప్రాంతం

కిష్కంద - పురాతన ప్రాంతం

కిష్కందను సుగ్రీవుడు, బాలీ పాలించారు. వీళ్లద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఆ తర్వాత సుగ్రీవుడు మాతాంగ పర్వత కొండపై నివసిస్తాడు. ఇది చాలా ఫేమస్ వ్యూ పాయింట్. రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాక.. రామలక్ష్మణులు సుగ్రీవుడు, హనుమంతుడిని ఇక్కడే కలుస్తారు.

బాలీ

బాలీ

బాలీని రాముడు చంపి.. తన సామ్రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తారు. సీతను వెతకడానికి హనుమంతుడు వెళ్లినప్పుడు రాముడు మాల్యావంట కొండపై నివసిస్తాడు. ఇది కంప్లి సమీపంలో ఉన్న విరూపాక్ష ఆలయం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే ఉన్న రంగనాథ ఆలయంలో శ్రీరాముడి పెద్ద విగ్రహం ఉంటుంది.

విరూపాక్ష ఆలయం

విరూపాక్ష ఆలయం

విరూపాక్ష ఆలయం, విఠల ఆలయం మధ్యలో తుంగభద్ర నటి ప్రవహిస్తుంటుంది. ఇక్కడే సుగ్రీవుడు సీతమ్మ తల్లి ఆభరణాలను దాచిపెడతారు. ఇక్కడ సీతాదేవి ఆభరణాలు పెట్టినట్టు గుర్తులు కూడా కనిపిస్తాయి.

రామాలయం

రామాలయం

కర్ణాటక సమీపంలో ఉన్న హజర రామా టెంపుల్ చాలా ప్రసిద్ధమైనది. 15వ శతాబ్ధంలో ఈ ఆలయంలో రామాయణానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు, చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. రామాయణ ఇతిహాసాన్ని శిల్పాల రూపంలో ఇక్కడ గోడలపై మలిచారు.

అయితే ఇప్పడు అవి కనుమరుగైపోయాయి.

గుహ

గుహ

విరూపాక్ష ఆలయం, విఠలాలయం మధ్య ప్రవహించే తుంగభద్ర నదికి సమీపంలో ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడే సుగ్రీవుడు సీతాదేవి ఆభరణాలు దాచిపెట్టిన ప్లేస్ ని పెయింటింగ్ ద్వారా వివరించాడట.

కోదండరామ ఆలయం

కోదండరామ ఆలయం

కోదండరామ ఆలయంలో సీతా, రామ లక్ష్మణుల పెద్ద పెద్ద విగ్రహాలున్నాయి. ఇది స్నానాల ఘాట్ కి ఎదురుగా ఉంటుంది. ఇక్కడే సుగ్రీవుడిని వానర రాజుగా రాముడు ప్రకటించారు.

విఠల ఆలయం

విఠల ఆలయం

తుంగభద్ర నదికి దక్షిణవైపుగా ఉంది విఠల ఆలయం. ఇక్కడ సంగీత స్వరాలు వినిపించే స్థంభాలు ఉండటం చాలా విశేషం. ఈ ఆలయం హంపిలోనే అత్యంత ప్రత్యేకమైనది. దీనికి దగ్గరలోని మాతాంగ కొండపై వీరభద్ర ఆలయం ఉంది. అక్కడే శ్రీరాముడు నివసించాడు.

చిత్రకూట

చిత్రకూట

ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ్ బార్డర్ లో ఉంది చిత్రకూట. 14 ఏళ్ల వనవాసం సమయంలో ఇక్కడ ఉన్న అడవిలో సీతారాములు నివసించారు. 14ఏళ్ల వనవాసం సమయంలో 11 ఏళ్లు ఇక్కడే నివసించారు సీతారాములు.

సంబంధం

సంబంధం

రాముడి సోదరుడు భరతుడు చిత్రకూటకు వచ్చి.. తన అన్నను అయోధ్యకు తిరిగిరావాలని కోరాడు. అయితే తండ్రి మాట తప్పనని ఇక్కడే ఉంటానని తెలిపాడు రాముడు.

పంచవటి

పంచవటి

హిందూ పురాణాల ప్రకారం రామాయణంలో పంచవటిని ప్రస్తావించారు. పంచవటి అనేది దండకారణ్యంలో ఒక ప్రాంతం. ఇక్కడే శ్రీరాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి నివసించడానికి ఇల్లు నిర్మించుకున్నాడు. పంచవటి అంటే ఐదు మర్రిచెట్టు ఒకే చోట ఉండటం అని అర్థం.

రామ్ కుండ్

రామ్ కుండ్

ఈ తీర్థం హిందువులకు చాలా పవిత్రమైనది. ఇక్కడ ఎవరైతే మునుగుతారో వాళ్ల కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. నాసిక్ లో నివసించిన సమయంలో రాముడు ఈ తీర్థంలోనే స్నానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే గోదావరి నది వరుణి, తరుణి అనే రెండు నదులతో కలుస్తుంది. ఇలా మూడు నదులు కలవడాన్ని త్రివేణి సంగమం అంటాం.

సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం

సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం

బితూర్ బితూర్ అనే ప్రదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. అంతే కాక సీతా దేవి లవకుశలను జన్మనిచ్చిన ప్రదేశం గా అభివర్ణిస్తారు. ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైనది.

సీతారాములు నడిచిన ప్రాంతం

సీతారాములు నడిచిన ప్రాంతం

ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. రాముడు తన వనవాసం సమయంలో సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. ఈ ప్రదేశంలో సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

ముక్తిదాం ఆలయం

ముక్తిదాం ఆలయం

ముక్తిదాం ఆలయం నాసిక్ రోడ్ లో ఉంది. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వైట్ మార్బుల్ తో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 18 అధ్యయాల భగవద్గీతతో కూడిన బొమ్మలు ఉన్నాయి. అలాగే 12 జ్యోతిర్లింగాల విగ్రహాలున్నాయి.

కలరామ్ టెంపుల్

కలరామ్ టెంపుల్

ఇది రామాలయం. కలరామ్ అంటే నలుపు రాముడు అని అర్థం. ఈ ఆలయాన్ని ప్రతి యేటా వేలాది మంది సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న 70 అడుగుల బ్లాక్ స్టోన్ స్ర్టక్చర్ చూడటానికే ప్రజలు ఆసక్తిచూపుతుంటారు.

సీతమ్మ దాహం తీర్చిన రాముడు

సీతమ్మ దాహం తీర్చిన రాముడు

సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశంగా చెప్పబడుతుంది కడపజిల్లా ఒంటిమిట్ట. ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధం ఉంది. సీత కోరిక ప్రకారం శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని పురాణం చెబుతోంది.

సీతారాములు సంచరించిన రామగిరి

సీతారాములు సంచరించిన రామగిరి

ఖమ్మం జిల్లా రామగిరిలోనూ సీతారాముల ఆనవాళ్లున్నాయి. వనవాసం సమయంలో శ్రీరాముడు రామగిరిపై కొంతకాలం కుటీరం ఏర్పరుచుకుని సీతా లక్ష్మణులతో ఉన్నారని స్థానికులు చెబుతారు. సీతారామలక్ష్మణులు సంచరించినట్లు కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఒక బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా ఉంది.

త్రయంభకేశ్వర్

త్రయంభకేశ్వర్

ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో త్రయంభకేశ్వర్ ఒకటి. అంతేకాదు 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉండటం విశేసం. నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఈ ఆలయం దర్శించిన తర్వాత మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

సోమేశ్వరాలయం

సోమేశ్వరాలయం

శివుడు, హనుమంతుడి ఆలయాల్లో ఇది కూడా పురాతనమైనది. నాసిక్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. గోదావరి నది పైన ఈ ఆలయం ఉంది.

రామ్ సేత్ ఫోర్ట్

రామ్ సేత్ ఫోర్ట్

రామ్ సేత్ ఫోర్ట్ నాసిక్ కి 10 కిలోమీటర్ల దూరంలో పిండోరి గ్రామానికి దగ్గరలో ఉంది. పురాణాల ప్రకారం రాముడు ఇక్కడే సేద తీరేవాడని తెలుస్తోంది.

కపలేశ్వర ఆలయం

కపలేశ్వర ఆలయం

నాసిక్ లో ఉన్న పురాతన ఆలయాల్లో కలపేశ్వర ఆలయం ఒకటి. ప్రతి శివాలయంలో నంది విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ నంది ఉండదు. అదే ఇక్కడి ప్రత్యేకత.

English summary

Holy places connected with The Ramayana: Historical places connected to Ramayana

Not many people know Nasik’s connection with The Ramayana. Let’s unravel this connection as well as other important cities connected with this epic trail…
Desktop Bottom Promotion