శరీరానికి ఎనర్జీ ఎలా వస్తుంది ? చక్రాలకు, ఎనర్జీకి సంబంధమేంటి ?

By Nutheti

మీకు శరీరంలో శక్తి కేంద్రాలు ఉన్నాయని తెలుసా? అవి ఏడు రకాలు. మన శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు ఉంటాయి. ఈ చక్రాల స్థానాలపై ఆధారపడి వివిధ అవయవాలు, మానవశరీరంలోని గ్రంథులు ఏర్పడ్డాయి. వీటి ద్వారా మనం ఏ పనైనా చేయడానికి శక్తిని, సామర్థ్యాన్ని పొందగలుగుతాం.

నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన అన్ని అవయవాలు నిర్వరామంగా పనిచేస్తాయి. కాళ్లు, చేతులు, గుండె, జీర్ణవ్యవస్థ, కిడ్నీలు, లంగ్స్.. ఇవన్నీ పనిచేయడానికి ఈ ఏడు చక్రాలు శక్తినిస్తాయి. శరీరంలో శక్తి వ్యవస్థలో ఏడు చక్రాలు భాగం. ఇవి త్రిభుజాకారంలో ఏడు ప్రాంతాల్లో ఉంటాయి. ఈ చక్రాల విశిష్టత, అవసరం, పనితీరు గురించి తెలుసుకోవాలనుందా ? లెట్స్ హావ్ ఎ లుక్

చక్రాల నుంచి ఆలోచనలు, శక్తి

చక్రాల నుంచి ఆలోచనలు, శక్తి

ఎలాంటి భావాలనైనా అంటే సంతోషాన్ని, బాధను, నెగటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, ఆరోగ్యం, అనారోగ్యం ఇలా ప్రతి ఒక్కటి ఈ చక్రాలతోనే ముడిపడి ఉంటాయి. హఠాత్తుగా ఏదైనా వస్తువు ఎత్తాలంటే శక్తి కావాలి. దానికి ఈ ఏడు చక్రాలలో ఒకటి సహాయపడుతుంది.

శరీరంలో చక్రాల అవసరం

శరీరంలో చక్రాల అవసరం

చక్రాలు శరీరంలో ఎంతో శక్తివంతమైన కేంద్రాలు. నాడులలానే ఈ చక్రాలు సూక్ష్మ స్వభావం కలిగి ఉంటాయి. వీటికి భౌతిక అస్థిత్వం ఉండదు. ఎప్పుడైతే ఈ చక్రాలను అర్థం చేసుకుని, వాటికి సరైన చికిత్స చేస్తామో అప్పుడు వెంటనే మార్పులు కనిపిస్తాయి. మీ శరీర ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

శారీరక, మేధో సంబంధం

శారీరక, మేధో సంబంధం

ఈ 7 చక్రాలు వెన్నెముక ఆధారంగా ఉంటాయి. 7 చక్రాలు వాటి వాటి మేథోశక్తిని, స్థానాలను కలిగి ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి, భావోద్వేగాలకు, నమ్మకం వంటి వాటిపైనా ప్రభావం చూపుతాయి.

మొదటి చక్రం

మొదటి చక్రం

వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది మొదటి చక్రం. దీన్నే మూలాధార చక్రం అంటారు. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది శరీరానికి తేజాన్నిఇస్తూ.. మానవ మనుగడకు ప్రాథమిక అవసరాలకు తోడ్పడుతుంది. ఈ మూలాధార చక్రం తెరుచుకుని ఉన్న వాళ్లు ఆర్థికంగా బాగుంటారు. వీళ్ల ఫైనాన్షియల్ ప్లాన్స్ చాలా సక్సెస్ ఫుల్ గా ఉంటాయి. అదే ఈ చక్రం మూసుకుని ఉన్నవాళ్లు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

రెండవ చక్రం

రెండవ చక్రం

ఆరంజ్ కలర్ లో ఉండే ఈ చక్రం నాభికి కొంచెం కింది భాగంలో ఉంటుంది. ఇది మీకు, మీ భాగస్వామికి శక్తిని ప్రసారం చేయడానికి సహకరిస్తుంది. ఈ చక్రం తెరుచుకుని ఉన్నవాళ్లకు సెక్సువల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఈ చక్రం మూసుకుని ఉన్నవాళ్లకు సెక్సువల్ ఫ్రస్ర్టేషన్, మరికొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉంటారు.

మూడవ చక్రం

మూడవ చక్రం

నాభికి దగ్గరగా ఉండే ఈ చక్రం బంగారు వర్ణంలో ఉంటుంది. మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి శక్తినిస్తుంది. ఈ చక్రం మూసుకుపోయిన వాళ్లకు తమ అభిప్రాయాలపై నమ్మకం తక్కువగా ఉండటం, వాక్ చాతుర్యం లేకపోవడం, లక్ష్యాలు, కలలు నెరవేర్చుకోవడంలో కాస్త వెనకడుగు వేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది.

నాలుగో చక్రం

నాలుగో చక్రం

చెస్ట్ కి మధ్యలో ఉండేది నాలుగో చక్రం. దీన్నే హార్ట్ చక్ర అంటారు. ఆరోగ్యానికి, ఆనందానికి ప్రాధాన్యత కల్పిస్తుంది ఈ చక్రం. ఇది భాగస్వామిని ప్రేమించుకోవడానికే కాదు మనల్ని మనం ఇష్టపడటానికి శక్తినిస్తుంది. ఈ చక్రం మూసుకుపోయిన వాళ్లకు క్షమాగుణం, ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడటం చాలా కష్టం. దీనివల్ల ఎక్కువగా బాధపడాల్సి వస్తుంటుంది.

ఐదో చక్రం

ఐదో చక్రం

గొంతు భాగంలో ఉంటుంది ఐదో చక్రం. ఇది నీలిరంగులో ఉంటుంది. ఇది క్రియేటివిటీని సూచిస్తుంది. ఈ చక్రం తెరుకుని ఉన్నవాళ్లను ఈజీగా కనిపెట్టవచ్చు. ఇలాంటి వాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తపరచడంలో ఎలాంటి బెరుకు ఉండదు. క్లోజ్ గా ఐదో చక్రం ఉన్నవాళ్లు ఏ విషయాన్నైనా గుర్తించడంలో ఇబ్బందిపడతారు. అభిప్రాయాలు తెలపడంలో సంక్షోభంలో పడతారు.

ఆరో చక్రం

ఆరో చక్రం

ఆరో చక్రాన్నే మూడో కన్ను చక్రం అని కూడా పిలుస్తాం. ఇది రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇది సెన్సెన్స్ కి శక్తిని అందించడానికి తోడ్పడుతుంది. ఇది ఇండిగో కలర్ లో ఉంటుంది. ఈ చక్రం తెరుకుని ఉన్న వాళ్లు వాళ్ల ఆలోచనలు, కలలను వింటారు. నెరవేర్చుకుంటారు.

ఏడో చక్రం

ఏడో చక్రం

తలపైభాగంలో ఉంటుంది ఏడో చక్రం. పర్పల్ కలర్ లో ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ చక్రం ఓపెన్ లో ఉన్నవాళ్లు కృత్రిమ భావోద్వేగాలు కలిగి ఉంటారు, భక్తికి సంబంధించిన అంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అదే ఈ చక్రం మూసుకుపోయిన వాళ్లు అసూయ, క్రూర మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్లు భావోద్వేగాలకు అనుగుణంగా నడుచుకోలేకపోతారు.

చక్ర వ్యవస్థ ప్రాధాన్యత

చక్ర వ్యవస్థ ప్రాధాన్యత

మన శరీరంలో ఉండే ఈ చక్ర వ్యవస్థ గురించి అర్థం చేసుకోవడం వల్ల శరీరంలో ఏ యే భాగాలకు ఎలా శక్తి అందుతుందనేది తెలుస్తుంది. ఇతరులతో ఎలా కమ్యునికేట్ కాగలరు అనే విషయంపై అవగాహన ఉంటుంది. మానసిక వ్యవస్థ పవర్ ఫుల్ గా ఉంటే.. శరీరకంగా, ఎమోషనల్ గా చాలా స్ర్టాంగ్ గా ఉంటారు.

నిత్యజీవనంపై చక్రాలు

నిత్యజీవనంపై చక్రాలు

నిత్య జీవనం ఈ ఏడు చక్రాలపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో తీసుకునే రకరకాల నిర్ణయాలపై ఈ చక్రాల ప్రభావం ఉంటుంది. వీటి ద్వారానే నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

7 రకాల సంబంధాలపై చక్రాల ప్రభావం

7 రకాల సంబంధాలపై చక్రాల ప్రభావం

వేదాల ప్రకారం మనం 7 రకాల సంబంధాలను మన జీవితంలో అనుభవిస్తాం. ఈ ఏడు రకాల రిలేషన్ షిప్స్ ఇద్దరి మధ్య సామరస్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ పద్ధతి శరీరంలోని 7 చక్రాలతో అనుసంధానం కలిగి ఉంటుంది. అదెలాగో చూద్దాం.

మొదటి చక్రంతో సంబంధం

మొదటి చక్రంతో సంబంధం

లైంగిన శక్తిని ఇవ్వడంలో మొదటి చక్రం సహాయపడుతుంది. ఈ లైంగిక సామర్థ్యం పిల్లలు పుట్టడానికి సహకరిస్తుంది. అంతేకాదు.. జీవించడానికి ప్రేరేపిస్తుంది. స్వార్థం, అసూయ, ఇగోలను ఈ చక్రం ద్వారానే పొందుతాం. మన అవసరాలు తీర్చుకోవడానికి స్వార్థాన్ని, మన భావోద్వేగాలు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అహం వాడుకుంటాం. ఈ చక్రం ఇద్దరి మధ్య ప్రేమను పెంచడానికి సహాయపడుతుంది. అయితే కొన్ని సందర్బాల్లో రిలేషన్ షిప్ లో ప్రేమ పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఈ చక్రం ద్వారా సాధ్యమవుతుంది.

రెండో చక్రంతో సంబంధం

రెండో చక్రంతో సంబంధం

రెండో చక్రంలో ఉండే జంట మధ్య సంతోషం, నమ్మకాన్ని పెంపొందుతుంది. ఇద్దరి మధ్య ప్రేమను బట్టి సంపదను పొందడానికి సహకరిస్తుంది ఈ చక్రం.

మూడో చక్రంతో సంబంధం

మూడో చక్రంతో సంబంధం

ఈ చక్రం ద్వారా ఇద్దరు లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు. అయితే వైవాహిక జీవితంలో ఇది మళ్లీ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది ఇళ్లు, కార్లు వంటి లగ్జరీలను ఈ జంట కోరుకుంటుంది. రెండోది ఫేమ్, గౌరవం, పవర్ పొందాలని ఈ చక్రం ఉన్న జంటలు కోరుకుంటాయి.

నాలుగో చక్రం జంట

నాలుగో చక్రం జంట

ఇష్టమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో ఈ చక్రం నిరాశపరుస్తుంది. వీళ్లకు సంతోషం కంటే.. అసంతృప్తిగా ఉండటానికే ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ చక్రమున్న జంటలు ఎక్కువ విడిపోతుంటారు.

ఐదో చక్రం జంట

ఐదో చక్రం జంట

వీళ్లు ధ్యానంలో ఎక్కువగా పాల్గొంటారు. వీళ్లు నిజాయితీ, అందరితో కలుపుగోలుగా ఉండటం చాలా అవసరం.

ఆరో చక్రం జంట

ఆరో చక్రం జంట

వీళ్ల సంబంధం చాలా బావుంటుంది. ఒకరికి ఒకరు జీవితాన్ని త్యాగం చేసుకునేంత ప్రేమతో ఉంటారు. ఇలాంటి సంబంధం చాలా అరుదుగా ఉంటుంది. వీళ్లు ఆధ్యాత్మికత బోధిస్తూ ఉంటారు. వీళ్లు ఇతరుల కోసం జీవిస్తారు. తమకోసం కాదు.

ఏడో చక్రం

ఏడో చక్రం

ఈ చక్రంతో ముడిపడి ఉన్న జంట భర్తనే గురువుగా, టీచర్ గా భావిస్తుంది. అతన్నిపూర్తీగా నమ్ముతుంది. అతనికి ఎప్పుడు నమ్మకస్తురాలుగా ఉంటుంది. వీళ్లు చనిపోయిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తారు.. ఎప్పటికీ కలిసే ఉంటారు.

ఇది శరీరంతో, మన జీవితంతో ముడిపడి ఉన్న చక్రాల విశేషాలు.

Story first published: Tuesday, November 17, 2015, 16:09 [IST]
Desktop Bottom Promotion