వివాహాలలో కుండలిల ప్రాముఖ్యత

By Super

హిందూమత వివాహాలు చాలావరకు వధువు మరియు వరుని కుండలీలు (జ్యోతిషశాస్త్ర చార్ట్స్) సరిపోలటం అన్న విషయం మీద జరుగుతున్నాయి. ఇద్దరి కుండలీలు దోషరహితంగా సరిపోలి ఉంటేనే, అప్పుడు ఆ జంట సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతారని గట్టి నమ్మకం.

ప్రజలు, పెద్ద సంఖ్యలో కుండలిని కలయిక (జ్యోతిషశాస్త్ర పట్టికలలో సరిపోలే) మీద నమ్మకంతో ఉన్నా, అసలు ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం మాత్రం వారికి తెలియదు. అందువలన, మేము పెండ్లిలో కుండలిని వాస్తవ ప్రాముఖ్యత వివరాలు తెలుసుకునేందుకు కొంతమంది జ్యోతిష్కులను కోరాము. వారు కుండలిని ప్రాముఖ్యత గురించి మాత్రమే చెప్పలేదు, కానీ వారు కుండలి మ్యాచింగ్ కు సంబంధించి వివిధ సమస్యలు పరిష్కారాలు మరియు వివిధ చిట్కాలు పంచుకున్నారు.

కుండలీలు ఎలా సరిపోలి ఉంటాయి?

కుండలీలు ఎలా సరిపోలి ఉంటాయి?

జ్యోతిష్కులు గ్రహాల ఉనికిని బట్టి, వాటి ప్రయాణ దిశ కోణంలో కుండలిని పరిశీలిస్తారు. వారివారి వ్యక్తిగత లక్షణాలు గ్రహాల ఉనికినిబట్టి ఉంటాయని చెప్తారు. ఒక జంట కలిసి జీవించడానికి వారివారి నక్షత్రాలు మరియు గ్రహాల ప్రభావం ఒకరిమీద ఒకరికి ఉంటుంది. కాబట్టి, జ్యోతిష్కులు ఇద్దరి భాగస్వాముల తారలు అనుకూలతను పరిశీలిస్తారు. ఇంతేకాకుండా, వారు ఒకరిపట్ల ఒకరికి, వారి ప్రవర్తన అనుకూలత గురించి కూడా చెపుతారు.

జ్యోతిష్కులు కుండలి కలయిక ప్రాముఖ్యత వివరణ

జ్యోతిష్కులు కుండలి కలయిక ప్రాముఖ్యత వివరణ

ఇద్దరి జ్యోతిషశాస్త్ర చార్ట్స్ కలిసి ఉండాలి అని చెప్పటానికి ప్రధాన కారణం ఆ జంట సంతోషంగా మరియు సౌకర్యవంతమైన జీవితం గడపాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. వైవాహిక జీవితం విజయవంతంగా ఉండాలంటే ఇద్దరి కుండలిలు సరిపోలి ఉండాలన్నది జీవితంలో చాలా అవసరం. ఎందుకంటె ఆ వ్యక్తి యొక్క స్వభావం అతని / ఆమె జాతకం ద్వారా అంచనా వేస్తారు. మీరు మీ భాగస్వామి వివాహవిషయంలో యెంత నిజాయితీగ ఉన్నారో, మీ భాగస్వామి సంబంధం మీతో ఎలా ఉంటుంది, మీ అత్తగారితో మీ సంబంధం ఎలా ఉంటుంది వంటి ఎన్నో విషయాలు తెలుసుకోవొచ్చు.

అలాగే, చాలా ముఖ్యమైన విషయం మీ లైంగిక జీవితం గురించి తెలుసుకోవొచ్చు. మీరు ముందుగానే అన్ని విషయాలను తెలుసుకోవటం వలన మీరు ఆనందకరమైన వైవాహిక జీవితం గడపగలుగుతారు.

కుండలిలో గుణాలు

కుండలిలో గుణాలు

ఈ చార్ట్స్ సరిపోలికకు గుణాలు అని పిలిచే ఎనిమిది పాయింట్లను జోడించి చూస్తారు. ప్రతి గుణానికి ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది మరియు ఈ ఎనిమిది గుణాలలో మొత్తం 36. ఒక జంట సంతోషంగా వైవాహిక జీవితం గడపాలంటే కనీసం 18 పాయింట్లు సరిపోలి ఉండాలి అని ఒక నమ్మకం . సరిపోలిన పాయింట్లు 27 ఉంటే, అప్పుడు ఆ జంట చాలా ఉత్తమజంట అని భావిస్తారు. 18 పాయింట్లు కంటే తక్కువ ఉంటే, అప్పుడు వివాహానికి తగదని అర్థం. జ్యోతిషశాస్త్ర చార్ట్స్ లో గల 8 గుణాలను క్రింద ఇస్తున్నాము.

వర్ణ

వశ్య

తార

యోని

గ్రహ మైత్రి

గాన్

భకూట్

నాడి

ఒక జ్యోతిష్కుడు ప్రకారం, " వైవాహిక జీవితానందానికి మొదటి అడుగు కుండలిని కలయిక". ఒక మంచి జీవితభాగస్వామయం ఏర్పడాలంటే 36 గుణాలలో కనీసం 50% గుణాలు ఒకరిఒకరికి సరిపోలి ఉండాలి. వీటితోపాటు మాంగలిక విచార్ వంటి విషయాలు, (మార్స్ గ్రహం యొక్క చెడు ప్రభావాలు), కాల సర్ప దోషాలు ( రాహు, కేతు మధ్యన ఏడు గ్రహాల స్థానాలు) మొదలైనవాటిని ఒక జంట సంతోషంగా మరియు విజయవంతమైన వైవాహిక జీవితం గడపటానికి జాగ్రత్తగా అధ్యయనం చేయాలి."

మీరు వాటి మీద ఆధారపడి ఉండాలా?

మీరు వాటి మీద ఆధారపడి ఉండాలా?

భారతదేశంలో ప్రేమ వివాహాల పెరుగుతున్న ధోరణితో అనేక మంది యువ జంటలు జ్యోతిషశాస్త్ర చార్ట్స్ కలయిక మీద నమ్మకం ఉంచటంలేదు. జ్యోతిషశాస్త్ర చార్ట్స్ యొక్క ప్రాముఖ్యత మరియు వాటిపట్ల పెద్దలకు ఉన్న నమ్మకం గమనిస్తే, మనకు మనసులో కలిగే ప్రశ్న ' జీవితంలో జ్యోతిషశాస్త్ర చార్ట్స్ మీద ఆధారపడి ఉండాలా?'

మన జ్యోతిషశాస్త్ర నిపుణుల ప్రకారం, "అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక మంచి మనిషిలాగా బ్రతకటం. నేను కూడా వ్యక్తిగత శ్రమ, విశ్వాసం, సర్దుబాటు, సహనం మరియు అహాన్ని వొదిలి పక్కనపెట్టటం వంటివి మీరు వైవాహిక జీవితం విజయవంతంగా గడపటంలో సహాయపడతాయని అనుభూతి చెండుతున్నాను. మేము, జ్యోతిశ్యులం మీకు సలహా మాత్రమే చెప్పగలం మీరు దానిమీదే ఆధారపడతారో లేదా అనుసరిస్తారో, అంతా మీమీదనే ఆధారపడి ఉంది. జ్యోతిషశాస్త్ర చార్ట్స్ ను పోల్చే ప్రక్రియ వలన మీరు ముందుగానే, జంట ఎదుర్కునే సమస్యలకు పరిష్కారం తెలుసుకుని అనుసరిస్తారు. వివాహం అన్నదానికి ఎప్పటికి తుది అన్నది లేదు మరియు ప్రతి జంట కలిసి విజయవంతంగా మరియు సంతోషంగా ప్రయాణం సాగించాలి. మరియు జ్యోతిషశాస్త్రం అలా ఉండటానికి నిజంగా చాలా సమర్థవంతంగా దోహదపడుతుంది.

సరిపోలని కుండలిల కోసం పరిష్కారాలు

సరిపోలని కుండలిల కోసం పరిష్కారాలు

అన్ని గ్రహాలు మరియు కుండలి ఒక వివాహ విజయవంటమవటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కుండలి సరిపోలడం లేదు అంటే, ఒక అనుభవం ఉన్న జ్యోతిష్కుడితో సంప్రదింపులు జరపటం వలన ఖచ్చితంగా దోషాలకు (సమస్యలు) ఉపాయాలు (పరిష్కారాలు) పొందవొచ్చు. మీ కుండలి సరిపోలని ఒక ప్రత్యేక వ్యక్తితో మూడుముళ్ళు వేసి, ఏడు అడుగులు నడవాలంటే జ్యోతిషశాస్త్రం మీకు పరిష్కారం చూపుతుంది.

జంటలు కోసం చిట్కాలు

జంటలు కోసం చిట్కాలు

ఒక మంచి వైవాహిక జీవితం గడపాలనుకునే జంటలకు కొన్ని చిట్కాలు. ఒక వివాహం విజయవంతంగా ఉండాలంటే 70% మానవ ప్రయత్నం ఉండాలి మరియు మీ జ్యోతిషశాస్త్ర చార్ట్స్ సరిపోలి ఉన్నా కూడా మంచిని పొందుతారు. మేము ప్రతి జంటను లార్డ్ వినాయక లాకెట్ను ధరించమని నిర్దేశిస్తుంటాం. భాగస్వాములు గానీ మరియు వారి సన్నిహిత కుటుంబ సభ్యులు గాని వివాహసమయంలో నలుపు లేదా గోధుమ రంగులో ఏది కూడా ధరించకూడదు. వధువు వివాహ సమయంలో ఎరుపు లేదా గులాబీ గాని ధరిస్తే, వారి వైవాహిక జీవితంలో ఈ రంగులు అదృష్టం తీసుకుని వొస్తాయి. మీరు ఏ సమస్యతోనైనా బాధపడుతూ ఉంటే, అప్పుడు మీరు వినాయకుడిని పూజిస్తే, అతను మీ జీవితంలోవేసే ప్రతి అడుగు వద్ద సహాయం చేస్తాడు."

ఇద్దరి మధ్య అవగాహన మరియు అనుకూలత, వ్యక్తిగత ప్రయత్నాలు మీద ఆధారపడి ఉండగా, జ్యోతిషశాస్త్ర చార్ట్ కేవలం జంటకు వారి పెళ్లికి బయటకు ఆశిస్తున్న పరిదృశ్యాన్ని ఇస్తుంది. మీకు జ్యోతిషశాస్త్రంపట్ల నమ్మకం ఉంటే, అప్పుడు సంతోషకరమైన వైవాహికజీవితం కావాలనుకుంటే జ్యోతిషశాస్త్ర చార్ట్స్ సరిపోల్చుకోండి.

Story first published: Thursday, January 15, 2015, 20:03 [IST]
Desktop Bottom Promotion