For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ ఎందుకంత ఫేమస్ అయింది

By Nutheti
|

హైదరాబాద్.. !! పర్యాకట ప్రాంతంగానే కాదు.. ఐటీ హబ్ గానూ భాగ్యనగరం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఎంతో మందికి జీవనాధారాన్ని కల్పిస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంతో అందరినీ రారమ్మని పిలుస్తుంది హైదరాబాద్. రకరకాల జాతులు, వివిధ ప్రాంతాలవాళ్ల సమ్మేళనం భాగ్యనగరం.

హైదరాబాద్ అనగానే గోల్కొండ, చార్మినార్ వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలు కళ్ల ముందు మెదుతాయి. ఇవే కాకుండా హైదరాబాద్ లో ఆకర్షించే అంశాలు ఇంకా ఉన్నాయి. హైదరాబాద్ గురించి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం..

హైదరాబాద్ హిందీ

హైదరాబాద్ హిందీ

హైదరాబాద్ లో హిందీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఎక్కువగా ముస్లింలు ఉండటం వల్ల ఉర్దూ, నార్త్ ఇండియన్ హిందీ రెండిటి సమ్మేళనం కావడంతో.. హైదరాబాద్ హిందీ కాస్త భిన్నంగా ఉంటుంది.

పాపులేషన్ సిటీ

పాపులేషన్ సిటీ

భారతదేశంలో.. 6వ అతిపెద్ద జనాభా గల నగరం హైదరాబాద్. 2014లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ జనాభా 12 మిలియన్లు దాటినట్లు తేలింది.

బిజినెస్ స్కూల్స్

బిజినెస్ స్కూల్స్

హైదరాబాద్ లో టాప్ బిజినెస్ స్కూల్ ఉంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తోపాటు ఐఐటీ, త్రిపుల్ ఐటీ, బీఐటీఎస్ లకు హైదరాబాద్ వేదికైంది.

ఉత్తర భారతదేశ రాష్ట్రపతి నిలయం

ఉత్తర భారతదేశ రాష్ట్రపతి నిలయం

హైదరాబాద్ లో చెప్పుకోదగిన మరో ఆసక్తికర ప్రదేశం రాష్ట్రపతి నిలయం. ప్రతి ఏడాది శీతాకాలంలో రాష్ట్రపతి ఒకసారి ఈ రాష్ట్రపతి నిలయానికి వస్తారు. ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ సేద తీరుతారు.

త్రీడీ ఐమాక్స్

త్రీడీ ఐమాక్స్

హైదరాబాద్ త్రీ ఐమాక్స్ థియేటర్ కు స్పెషల్. 72 అడుగుల ఎత్తు, 95 అడుగుల వెడల్పుతో స్క్రీన్, ఒకేసారి 635 మంది సినిమా చూసేలా ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ ఉంది. ఇది ప్రపంచంలోనే పెద్ద త్రీడీ ఐమాక్స్. హారీ పోటర్, స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తారు.

అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్

అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్

హైటెక్స్ హైదరాబాద్ ఇంట్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఇండియాలోనే అతిపెద్దది. 15 ఎకరాలలో రూపుదిద్దుకున్న దీనిలో ఒకేసారి 5 వేలమంది కూర్చోవచ్చు.

బుధ్ద విగ్రహం

బుధ్ద విగ్రహం

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఉండే బుద్ధ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. 18 మీటర్ల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. తెల్ల రాతితో నిర్మించిన ఈ విగ్రహం బరువు 450 టన్నులు. దీన్ని 200 మంది కళాకారులు రెండేళ్లు శ్రమించి రూపుదిద్దారు.

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఫిల్మ్ సిటీ

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఫిల్మ్ సిటీ

1996లో ప్రారంభిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే పెద్దది. 1666 ఎకరాలలో ఫిల్మ్ సిటీ అందాలు విస్తరించాయి.

చిత్రగుప్తుల ఆలయాలు

చిత్రగుప్తుల ఆలయాలు

మనుషుల పాప కర్మలను భద్రపరిచే చిత్రగుప్తుడిని ఎక్కడ దేవుడి భావించలేదు. ఆలయాలు కూడా లేవు. కానీ.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చిత్రగుప్త మహాదేవ దేవాలయం ఉన్నట్లు గుర్తించారు.

సరస్సులకు ప్రత్యేకం

సరస్సులకు ప్రత్యేకం

ఆకర్షణీయమైన సరస్సులకు కేరాఫ్ హైదరాబాద్. డ్యామ్ లు, నదుల ద్వారా పలు సరస్సులను క్రియేట్ చేశారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఫేమస్ లేక్స్.

కోహినూర్ డైమండ్

కోహినూర్ డైమండ్

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా ప్రత్యేకత పొందిన కోహినూర్ డైమండ్ హైదరాబాద్ లోనే బయటపడింది. కొల్లూర్ గనులలో లభ్యమైన ఈ కోహినూర్ డైమండ్ తర్వాత గోల్కొండ కోటకు తరలించారు.

హైదరాబాద్ బిర్యానీ

హైదరాబాద్ బిర్యానీ

వావ్.. బిర్యానీ అనగానే.. నోరూరిపోతుంది కదూ.. నిజమే హైదరాబాద్ బిర్యానీ అంటే.. ఎవరికైనా నోరూరాల్సిందే. నిజాముల కాలంలో అథితులకు 26 రకాల బిర్యానీలను వడ్డించేవాళ్లట. అంటే 140 కి పైగానే హైదరాబాద్ బిర్యానీల రుచులున్నాయట. వాటిలో బాగా ఫేమస్ అయినవి.. హైదరబాదీ చికెన్ ధమ్ బిర్యాని, హైదరాబాదీ ల్యాంబ్ బిర్యానీ, కచ్చే ఘోస్ట్ కి బిర్యానీ, హైదరాబాదీ జఫ్రానీ బిర్యానీ, ఖీమా కీ కిచిడి.

ముత్యాలు, గాజులు

ముత్యాలు, గాజులు

అమ్మాయిల అలంకరణ వస్తువులకు హైదరాబాద్ కేరాఫ్. ఎందుకంటే.. అతివలు అమితంగా ఇష్టపడే గాజులకు భాగ్యనగరే సాటి. చార్మినార్ దగ్గర రకరకాల గాజులు, విభిన్న రంగులు, ఆకట్టుకునే కాంబినేషన్ లో అందరిచూపుని ఆకర్షిస్తాయి. అంతేకాదు.. ఇక్కడ ముత్యాలు కూడా చాలా ఫేమస్. ఇక్కడ దొరికే పర్ల్స్ చాలా క్వాలిటీతో ఉంటాయి. ఇక్కడ ముత్యాలు చాలా తక్కువ ధర కూడా.

సాలార్ జంగ్ మ్యూజియమ్

సాలార్ జంగ్ మ్యూజియమ్

సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్ అద్భుత చరిత్రని ప్రతిబింబిస్తుంది. కార్పెట్లు, ఫర్నిచర్, శిల్పాలు, చిత్రలేఖనాలు, పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు,

లోహపు వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులన్నీ సాలార్ జంగ్ కుటుంబానికి చెందినవి.

బిర్లా ప్లానిటోరియం

బిర్లా ప్లానిటోరియం

హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియం దేశంలోనే మొట్ట మొదటి ప్లానిటోరియం. వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఈ ప్లానిటోరియమ్ అందరినీ ఆకట్టుకుంటుంది. విశ్వంలో దాగున్న ఎన్నో రహస్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

English summary

Interesting Facts About Hyderabad

A city which always made its mark by being different, being a dominant Muslim empire in the midst of Hindu & Buddhist dominated Ancient India or being the IT Hub of south India, accommodating various cultures and being one of the richest cities in India. There is more to it. Here’s a list of few things about Hyderabad you should know.
Story first published: Friday, October 16, 2015, 15:49 [IST]
Desktop Bottom Promotion