For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్స్ లో ఉత్సాహాన్నిచ్చే హ్యాబిట్స్

By Nutheti
|

వీకెండ్ వచ్చిందంటే చాలు.. హాయిగా నిద్రపోవాలని.. బాగా రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ.. సక్సెస్ ఫుల్ పీపుల్ లక్షణం ఇది కాదు. వీకెండ్ ని కూడా.. ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ తో ప్లాన్ చేసుకుంటే.. చాలా ఎంజాయ్ చేయొచ్చు.

Read more:7 డేస్ డైట్ ప్లాన్ తూచా తప్పకుండా పాటిస్తే బరువు తగ్గడం తేలికే

లైఫ్ లో సక్సెస్ అయిన పవర్ ఫుల్ పీపుల్ వీకెండ్ యాక్టివిటీస్ ఆధారంగా.. ఈ టిప్స్ ఇస్తున్నాం. వీకెండ్ వస్తే బద్దకంగా.. ఏ పని చేయాలన్నా మూడ్ లేదని ఫీలవుతారు. కానీ.. వీకెండ్ కూడా.. యాక్టివ్ గా ఉంటే.. మళ్లీ వచ్చే వీక్ డేస్ ని ఉత్సాహంగా గడిపేయొచ్చట. మరి వారాంతంలో పాటించాల్సిన అలవాట్లేంటో చూసేద్దామా...

ఉదయాన్నే నిద్రలేవడం

ఉదయాన్నే నిద్రలేవడం

వీకెండ్ వచ్చింది కదా అని.. మధ్యాహ్నం వరకు బెడ్ మీద నుంచి దిగకూడదని ఫిక్స్ అయ్యారా ? అయితే అది మంచిది కాదు. వీకెండైనా సరే ఉదయాన్నే నిద్రలేవాలి. నిద్రలేచాక రెండున్నర నుంచి 4 గంటల వరకు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. కాబట్టి వారాంతంలోనైనా సరే వేకువజామునే లేవడం అలవరుచుకోవాలి.

ప్లాన్

ప్లాన్

వారాంతాల్లో లక్ష్యాలకు బ్రేక్ పడకూడదు. వీకెండ్ అయినా సరే.. చేయాల్సిన పనులు చేసుకోవాలి. అప్పుడే జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్నింటిని సక్రమంగా నిర్వహించాలి.

మల్టీ టాస్క్ వద్దు

మల్టీ టాస్క్ వద్దు

వీకెండ్స్ లో మల్టీ టాస్క్ లకు ఛాన్స్ ఇవ్వకండి. ఒకేసారి అన్ని పనులు భుజానవేసుకుంటే.. మీ శక్తి, సామర్థ్యం అన్ని వృధా అయిపోతాయి. కాబట్టి ఒక్కో పనిని ఒక్కోసారి నిదానంగా పూర్తి చేసుకోండి. మల్టీ టాస్కింగ్ వల్ల ఆందోళన పెరుగుతుంది.

యాక్టివ్ గా ఉండండి

యాక్టివ్ గా ఉండండి

వీకెండ్స్ లో యాక్టివ్ గా ఉండటానికి ప్లాన్ చేసుకోండి. ఉదయాన్నే గేమ్స్, వ్యాయామం వంటివి చేస్తే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. నిత్యం ఫాలో అయ్యే పద్ధతులనే వీకెండ్ లోనూ అనుసరించడం వల్ల.. శరీరంతోపాటు, మైండూ ఉత్సాహంగా ఉంటుంది.

ప్రాముఖ్యత

ప్రాముఖ్యత

ఏ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ముందే డిసైడ్ కావాలి. వీకెండ్స్ లో ఏ రోజు.. ఏ పని చేయాలి.. ఎవరిని కలవాలి.. ఎవరితో ఎంత టైం స్పెండ్ చేయాలి అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుంటే.. అందరితోనూ జాలీగా గడపవచ్చు. భార్యా పిల్లలు, ఫ్రెండ్స్ ఇలా ఎవరికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో నిర్ణయించుకోవాలి.

అలవాట్లకు సమయం

అలవాట్లకు సమయం

అందమైన అలవాట్లకు వీకెండ్ లో సమయం కేటాయించాలి. టైం వేస్ట్ చేయకుండా.. మీకిష్టమైన పెయింటింగ్, గేమ్స్, కుట్లు, అల్లికలు వంటి వాటికి కొంత సమయం కేటాయించడం వల్ల మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీల వల్ల ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

మెడిటేషన్, యోగా

మెడిటేషన్, యోగా

వారాంతంతలో కొంత సమయాన్ని మెడిటేషన్, యోగా వంటి వాటికి కేటాయించాలి. ఒక 20 నిమిషాల పాటు.. రోజుకి రెండు సార్లు.. ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. ఒత్తిడి తగ్గి, రోగనిరోధక శక్తి పెరిగి, క్రియేటివ్ గా ఆలోచించే శక్తి పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

రిఫ్లెక్ట్

రిఫ్లెక్ట్

సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి.. కానీ.. ఫెయిల్యూర్స్ ని కూడా మైండ్ లో పెట్టుకోవాలి. కాబట్టి గత వారంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి వీకెండ్ లో టైం కేటాయించాలి. అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. వర్క్ లో ఇంప్రూవ్ మెంట్స్ గురించి ఆలోచించాలి.

ఈవెంట్స్

ఈవెంట్స్

నూతనోత్సాహాన్నిచ్చే ఈవెంట్స్ కండక్ట్ చేయడం లేదా.. అలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మైండ్ కి రిలాక్స్ గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం వంటి సోషియల్ యాక్టివిటీస్ ని వీకెండ్ లో ప్లాన్ చేసుకుంటే బెటర్.

వచ్చే వారానికి ప్రణాళికలు

వచ్చే వారానికి ప్రణాళికలు

సోమవారం నుంచి శుక్రవారం వరకు.. ఫుల్ గా వర్క్ టెన్షన్ లో మునిగిపోతున్నారా ? అయితే శనివారం వర్క్ కి గుడ్ బై చెప్పేసి.. పూర్తీగా రెస్ట్ తీసుకోండి. కానీ ఆదివారం.. కొంత సమయం పనికి కేటాయించాలి. వారమంతా చేసిన పనికి ఫీడ్ బ్యాక్, ఎలాంటి అనుభవం ఎదురైందో బేరీజు వేసుకోవాలి. రాబోయే వారంలో పనితీరుకు మైండ్ ని రెడీ చేసుకోవాలి.

English summary

Interesting Weekend Habits: pulse in telugu

Interesting Weekend Habits that boost you.
Story first published: Saturday, October 24, 2015, 14:18 [IST]
Desktop Bottom Promotion