For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జాతకం ప్రకారం మీ పేరులో అదృష్టం తెలుసుకోవడం ఎలా

|

చాలా మంది వారివారి రాశిచక్రాల ప్రకారం వారి పేర్లు పెట్టుకుంటారు. కానీ ఎవరైతే రాశిచక్రాల ప్రకారం పేర్లు కలిగి లేరో, పెట్టుకున్న పేర్లు ఇతర రాశిచక్రాల చెందినవి అవటం వలన, భవిష్యత్తులో వీటి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.

పేర్లు జాతక ప్రకారం పెట్టుకోకపోవటం వలన వారికి మంచిది కాదని చాలా సందర్భాల్లో రుజువు అవుతున్నది. ఎందువలన అంటే ప్రతి రాశికి వేరువేరు స్వభావం మరియు విశేషం ఉన్నది. అదే విధంగా, తొమ్మిది గ్రహాలు మరియు నక్షత్రమండలం మన జీవితాల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి.

మీ పేరులోని రహస్యం కనుక్కోండి...!క్లిక్ చేయండి

జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశులు ఉన్నాయి. జాతకంలో చంద్రుడి స్థానాన్ని బట్టి వారి రాశి నిర్ణయించబడుతుంది. శతాబ్దాల నుండి ప్రజలు, పిల్లలకు వారివారి రాశుల ప్రకారం నామకరణం చేస్తున్నారు ప్రతి రాశి వివిధ అక్షరాల సమూహాన్ని కలిగి ఉంటుంది. పుట్టిన సమయంలో, చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో అదే ఆ పిల్లల రాశి అవుతుంది.

 మేషం

మేషం

మేషం మార్స్ చేత పాలించబడుతుంది. మేషరాశివారు మంచి శక్తి మరియు చైతన్యంతో ఉంటారు. ఆకర్షణ మరియు తేజస్సుతో ప్రజలను ఆకట్టుకునే ప్రముఖ నాయకులు అయి ఉంటారు. కొత్తది ఏ విషయమైనా, వీరు ఏ విధంగా సిగ్గుపడరు. వీరు నిర్భయంగా ఉంటారు.

 వృషభం

వృషభం

వృషభం, వీనస్ చేత పాలించబడుతుంది. ఈ రాశివారు ఎక్కువగా భౌతిక వొస్తువులకు మరియు సంతోషాలకు ప్రాముఖ్యత ఇస్తారు. వృషభరాశివారు సుఖాల పట్ల, చుట్టుపక్కల సంతోషంతో ద్విగుణీకృతం అవటం మరియు విషయాలు సౌమ్యంగా ఉండటం వంటివాటిని ఇష్టపడతారు.

 బుధుడు

బుధుడు

మెర్క్యురి చేత పాలించబడటం వలన మిథునరాశివారు వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు మరియు వీరి సంభాషణ వెనుక చోదక శక్తిగా వారి మెదడు పని చేస్తుంది. మిథునరాశివారు సంబంధబాంధవ్యాల అభివృద్ధి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు.

క్యాన్సర్

క్యాన్సర్

క్యాన్సర్లు, చంద్రుడి చేత పాలింపబడటం వలన, వీరు ఇంటి మరియు కుటుంబ సుఖాలు, సౌఖ్యాల పట్ల గొప్ప ఆనందం కలిగి ఉంటారు. కర్కాటక రాశివారు దేశీయ, తల్లి మరియు ఇతరుల పెంపకం పట్ల ప్రేమ కలిగి ఉంటారు.
 సింహం

సింహం

సింహం, సూర్యుడి చేత పాలించబడుతుంది. ఈ రాశివారు తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవటంలో నేర్పరులు. వీరు చాలా ప్రతిష్టాత్మకతను కలిగి ఉంటారు. ఈ రాశివారు చాలా సృజనాత్మకంగా కూడా ఉంటారు.

కన్య

కన్య

కన్య రాశి బుధుడి చేత పాలించబడుతుంది. ఈ రాశిలో జన్మించినవారు క్లిష్టమైన మరియు సమస్యాత్మక పరిస్థితులలో కూడా జోకులు వేసుకుంటూ వాతావరణాన్ని తేలికగా తీసుకుంటారు. వీరు కష్టపడే మనస్తత్వం కలవారు మరియు సమర్థులు అయిఉండటం వలన వారివారి సంబంధిత ఉద్యోగాలలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
తుల

తుల

తుల వీనస్ ద్వారా పాలించబడుతుంది. ఈ రాశివారు ప్రజల్లో చాలా కేంద్రీకరించబడి ఉంటారు. ఈ రాశివారు ఎప్పటికీ ప్రేమికులతో జత చేసినప్పుడు పూర్తి అనుభూతిని కలిగి ఉంటారు.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చికం, మార్స్ మరియు ప్లూటో చేత పాలించబడుతుంది. ఈ రాశివారిలో ఎటువంటి సౌమ్యత లేదా వాక్చాతుర్యత ఉండదు. అనవసరమైన రహస్యాలు సేకరించటం, అవసరమైన ప్రశ్నలకు సున్నా జవాబులు వీరి ప్రత్యేకత. వీరు విషయాలను తెలుసుకోవటంలో చాలా ఆసక్తికరంగా ఉంటారు.

 ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు బృహస్పతి ద్వారా పాలించబడుతుంది. ఈ రాశివారు సత్యాన్ని అన్వేషించేవారు మరియు తత్వశాస్త్రం మరియు మతంలో ఆసక్తి కలిగి ఉంటారు.

 మకరం

మకరం

మకరం శని ద్వారా పాలించబడుతుంది. వారు వ్యవస్థీకృత, సమర్థవంతమైన, కష్టపడే మనస్తత్వం కలవారు మరియు ఎక్కువగా మాట్లాడరు . ఈ రాశివారు రోగాలతో బాధపడుతుంటారు.

 కుంభం

కుంభం

కుంభం, శని మరియు యురేనస్ చేత పాలించబడుతుంది. ఈ రాశివారు మానవతావాదులు, దాతృత్వస్వభావం కలవారు మరియు ప్రపంచంలో మెరుగైన స్థానం సంపాదించుకోవటం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.

మీనం

మీనం

మీనం, బృహస్పతి మరియు నెప్ట్యూన్ చేత పాలించబడుతుంది. వీరు చాలా సహాయకారులు మరియు నిస్వార్థపూరితంగా ఉంటారు

English summary

Is your name lucky for you?

Many people keep their names as per their horoscopes. But those who keep names, which are not as per their horoscopes face after affects as these names belong to some other horoscopes.
Desktop Bottom Promotion