Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
మీ వ్యక్తిత్వాన్ని పసిగట్టే క్వాలిటీస్
కొత్త వ్యక్తులను కలిసినప్పుడు, కొత్తగా జాబ్ లో చేరినప్పుడు ఎదుటి వ్యక్తుల పర్సనాలిటీ గురించి ఆలోచిస్తుంటాం. అలాగే ఎదుటివాళ్లు కూడా మీరు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లో అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంటారు. నిజాయితీ, జాలి, మేధాశక్తి వంటి అంశాలను చూడగానే కొంతవరకు అంచనా వేయవచ్చు. కానీ మనసులో దాగున్న భావాలు తెలుసుకోవడం కష్టం.
ఎదుటివాళ్లతో స్నేహం చేయవచ్చా లేదా అన్న అనుమానాలకు చెక్ పెట్టడానికి ఇక్కడ చెబుతున్న అంశాలు అవసమౌతాయి. ఈ అంశాలు చూసి ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. మనం చేసే పనులు, మనం ఎంచుకునే వస్తువులు, ఎంచుకునే రంగులే పర్సనాలిటీని పసిగట్టడానికి మార్గాలని అధ్యయనాలు చెబుతున్నాయి.

రొమాంటిక్ లైఫ్ డిసైడ్ చేయడానికైనా, వర్క్ లైఫ్ షేర్ చేసుకోవడానికైనా.. ఎదుటి వాళ్లు మనస్తత్వంపై ఓ అంచనాకి రావాలి. వాళ్ల ప్రవర్తన గురించి అవగాహనకు రావాలి. ఎలాంటి వాళ్లతో పరిచయం పెంచుకోవాలి.. ఎదుటివారు నమ్మకస్తులేనా.. అన్న అంశాలు తెలుసుకోవాలంటే... ఈ ట్రిక్స్ తెలుసుకోండి.

హ్యాండ్ రైటింగ్
రాసే విధానం, పదాల సైజుని బట్టి ఎదుటి వ్యక్తిలోని కొన్ని క్వాలిటీస్ ని పసిగట్టవచ్చంటున్నాయి అధ్యయనాలు. చిన్న అక్షరాలతో హ్యాండ్ రైటింగ్ ఉండే వాళ్లకు సిగ్గు ఎక్కువ, శ్రద్ధగా పరిశీలించే గుణం, విద్యాసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా.. తీవ్రంగా ఆలోచించే వాళ్లు పెన్నును గట్టిగా ఒత్తి రాస్తారు. సున్నితంగా రాసేవాళ్లు సున్నిత స్వభావులు, ఎలాంటి భావాలనైనా వ్యక్తపరచగలరు.

కలర్
మీరు ఎక్కవగా ఎంచుకునే రంగులకు, మీ వ్యక్తిత్వానికి చాలా దగ్గర పోలిక ఉందట. ఎంచుకునే రంగు ద్వారా మీరెలాంటి వాళ్లో ఈజీగా చెప్పవచ్చు. బ్లాక్ ఎక్కువగా ధరించే వాళ్లు.. చాలా సున్నిత స్వభావులు. కళాత్మకంగా ఉంటారు. వివరాలపై శ్రద్ధవహిస్తారు. ఎరుపు రంగు ఎక్కువగా ఎంచుకునే వాళ్లు.. జీవితం గురించి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు. గ్రీన్ ఇష్టపడేవాళ్లు నమ్మకస్తులు, అభిమానం చూపించేవాళ్లు. వైట్ ను ఎంచుకునే వాళ్లు లాజికల్ గా ఆలోచిస్తారు. బ్లూ ఇష్టపడే వాళ్ల ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. సున్నితంగా ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు.

గోళ్లు కొరకడం
కొన్ని లక్షణాలు మనుషుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లో మీ శరీరం ఎలా రియాక్ట్ అవుతుందనేది మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. జుట్టు పీక్కోవడం, గోళ్లు కొరకడం, చర్మాన్ని సాగదీయడం వంటి లక్షణాలు అసహనం, నిరాశ, విసుగు, అసంతృప్తిని తెలుపుతాయి. గోళ్లు కొరికే వాళ్లకు ఆందోళన, భయం ఎక్కువని తెలుపుతాయి.

షూస్
ఎదుటి వ్యక్తి షూస్ చూసి వాళ్ల వ్యక్తిత్వం చెప్పేయవచ్చంటున్నారు సైకాలజిస్ట్ లు. షూ కాస్ట్, కలర్, స్టైల్ ని బట్టి 90 శాతం క్యారెక్టర్ ని గుర్తించవచ్చట. ఆదాయం, రాజకీయ అనుబంధం, వయసును పసిగట్టవచ్చంటున్నారు.

కళ్లు
కళ్లు మనసుకు ప్రతీక. కళ్లు చూస్తే ఎదుటి వాళ్ల గురించి ఇట్టే చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కళ్లను చూసి ఆలోచనలు, ఫీలింగ్స్ ని చెప్పచ్చట. మీ కళ్లు మీరు నమ్మకస్తులా కాదా అని కూడా చెప్పేస్తాయి. నీలి కళ్లు ఉన్న వాళ్లను నమ్మడం కష్టమని.. వీళ్లు ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఐ కాంటాక్ట్ ని బట్టి కూడా మనస్తత్వం చెప్పచ్చు అంటున్నారు. ఐ కాంటాక్ట్ కరెక్ట్ గా లేనివాళ్లకు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు.. నిజాయితీగా ఉండలేరని చెబుతున్నాయి.

పంక్చువాలిటీ
పంక్చువాలిటీ మీ మీద పాజిటివ్ లేదా నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో కీలకం. మీటింగ్ లలో సమయానికి అటెండ్ అవకపోతే మీ వ్యక్తిత్వంపై నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. సమయానికి చేరుకున్నారంటే.. మీరు ఎదుటివాళ్ల సమయానికి, వాళ్లకు విలువ ఇస్తున్నారని.. సెల్ఫ్ మోటివేటెడ్ అని అర్థం.

షేక్ హ్యాండ్
స్ట్రాంగ్ హ్యాండ్ షేక్ ఇచ్చిన వాళ్లు కాన్ఫిడెన్స్ తో ఉన్నారని, స్ట్రాంగ్ క్యారెక్టర్ అని తెలుపుతాయి. భావవ్యక్తీకరణ, ప్రశాంతంగా ఉంటారని తెలుపుతాయి. వీక్ హ్యాండ్ షేక్ ఇచ్చే వాళ్లు కాన్ఫిడెన్స్ లేని వాళ్లు, ఛాలెంజ్ నుంచి తప్పించుకోవాలని చూస్తారు. ముందుగా షేక్ హ్యాండ్ ఆఫర్ చేసేవాళ్లు ఫ్రెండ్లీగా ఉంటారని తెలుపుతుంది.



Click it and Unblock the Notifications