Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
చేతి గోళ్లను బట్టి పర్సనాలిటీ అంచనా వేయవచ్చా ?
మెరిసే మోము.. ఆకట్టుకునే నవ్వు.. అందమైన కురులు.. అద్భుతమైన శరీరాకృతి. ఇవి మాత్రమే కాదు అందానికి చిహ్నాలు. ప్రతి పనికి అవసరమయ్యే చేతులు. చక్కటి హావభావాలను వ్యక్తపరుస్తూ.. వయ్యారాలు తిరుగుతూ మాటలు కలిపే.. చేతి వేళ్లకూ అందంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కాస్త నెయిల్ పాలిష్ తో కలరింగ్ ఇస్తే చేతి గోళ్లు కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి గోళ్లు చూసుకుని మురిసిపోని అమ్మాయి ఉండదు.
READ MORE: గోళ్ళ సమస్యలకు 7 సులభ మార్గాలు
అందానికే కాదు.. అన్ని రకాల పనుల్లోనూ గోళ్లు కీలకంగా పనిచేస్తాయి. ఫింగర్ నెయిల్స్ మన నిత్య జీవితంలో చాలా రకాలుగా హెల్ప్ చేస్తాయి. అవి లేకపోతే చాలా కష్టం. ఒక్కసారి ఆలోచించండి. గోళ్లు లేకపోతే.. వస్తువులను ఎలా ఓపెన్ చేస్తాం ? పళ్ల తొక్కలు ఎలా తీస్తాం ? అంతేకాదు ఏదైనా తాడు ముడి వేయడం వంటి అవసరాలకు కూడా గోళ్లు ఉపయోగపడతాయి. ఏషియన్ జ్యోతిష్యుడి అధ్యయనం ప్రకారం మనిషి ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని.. వాళ్ల గోళ్ల ఆకారాన్ని బట్టి అంచనా వేయవచ్చు అంటున్నారు.
అయితే ఈ గోళ్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. రూపంలో, కలర్ లో చాలా వ్యత్యాసాలే ఉంటాయి. అయితే గోళ్ల ఆకారం కూడా వ్యక్తిత్వాన్ని చెబుతాయి అంటే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. మీ గోళ్ల షేప్ ని బట్టి.. మీ పర్సనాలిటీ చెప్పవచ్చు. మీ గోళ్లు ఏ ఆకారంలో ఉన్నాయి.. ఏ విశేషాలు చెబుతున్నాయో ఆలస్యం చేయకుండా వెంటనే చెక్ చేసుకోండి.

పొడుగ్గా
గోళ్లు పొడుగ్గా.. నిలువుగా ఉంటే.. చాలా అందంగా ఉంటాయి కదూ ? నిజమే ఇలాంటి గోళ్లు చూడ్డానికి అందంగా ఉంటాయి. దాంతో పాటు వీళ్ల పర్సనాలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. వీళ్లు చాలా ఊహాజనితంగా, రొమాంటిక్ గా ఉంటారు. వీళ్లు పర్ఫెక్షనిస్ట్ లు కూడా. అందరితో చాలా ఈజీగా కలిసిపోతారు.

వెడల్పుగా
గోళ్లు వెడల్పుగా ఉండే వాళ్లు చాలా స్ర్టెయిట్ ఫార్వర్డ్ గా ఉంటారు. వీళ్లకు ఓర్పు తక్కువ. వీళ్లు ఎక్కువగా కోప పడుతూ ఉంటారు. అంతేకాదు వీళ్లు నిజాలు మాట్లాడుతూనే అపద్దాలు కూడా చెబుతారు. అయితే మంచి సలహా ఇచ్చే సత్తా వీళ్లకు ఉంటుంది.

గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో
గోళ్లు గుండ్రంగా గానీ, కోడి గుడ్డు ఆకారంలో ఉండే వాళ్లు చాలా సరదాగా, సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటారు. ఏ పనినైనా విభిన్నంగా చేయడాన్ని ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల గొడవల్లో మధ్యవర్తిత్వం వహిస్తారు.

చతురస్రాకారం (Square)
గోళ్ల ఆకారం చతురస్రాకారంలో ఉండేవాళ్లు సహజంగా లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ల కఠినంగా వ్యవహరిస్తారు. ఏ విషయంలోనైనా చాలా మొండిగా వ్యవహరిస్తారు. పట్టుదల ఎక్కువ. చాలా సీరియస్ ఆటిట్యూడ్ ఉంటుంది. దీనివల్ల ఎవరూ పట్టించుకోరు.

త్రిభుజాకారం
పైన నుంచి గానీ, కింద నుంచి గానీ గోళ్లు త్రిభుజాకారంలో కనిపిస్తు ఉంటే.. అలాంటి వాళ్లు చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు. చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు. చాలా సందర్భాల్లో అసహ్యంగా ఫీలవుతూ ఉంటారు.

బాదాం గింజ ఆకారం
బాదాం షేప్ లో చేతి గోళ్ల ఆకారం ఉండే వాళ్లు చాలా నిజాయితీపరులు. చాలా ఫ్రెండ్లీ నెచర్ ఉంటుంది. వీళ్లు చాలా నమ్మకస్తులు. వీళ్లు ఎదుటివాళ్లలో ఉన్న మంచితనాన్ని గ్రహిస్తారు. చాలా పొలైట్ గా వ్యవహరిస్తారు.

కత్తి ఆకారం
చేతి గోళ్లు కత్తి ఆకారంలో ఉండే వాళ్లు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. లక్ష్యసాధన కోసం కృషి చేస్తుంటారు. చాలా నింపాదిగా ఉండే వాళ్లతో మెలగడానికి వీళ్లకున్న సహనం సరిపోదు. ఏ టాస్క్ ఇచ్చిన హ్యాండిల్ చేయగలిగే సత్తా వీళ్లకు ఉంటుంది.
ఇదండీ గోళ్ల ఆకారంలో దాగున్న పర్సనాలిటీ సీక్రెట్స్. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.



Click it and Unblock the Notifications