Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మహిళలూ మీకు నచ్చినట్టు ఉండండి.. నో కాంప్రమైజ్
ఆడవాళ్లకు స్వేచ్ఛ కావాలి. నిజమే కదా.. అన్ని విషయాల్లో మహిళలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. పర్సనాలిటీ నుంచి.. భావోద్వేగాల వరకు అన్ని విషయాల్లో మహిళలు స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఎదుటివాళ్ల ఆలోచనలకు విలువ ఇస్తూ.. తమ అభిరుచులను వెనక్కి నెట్టుతున్నారు. ఇలాంటి వ్యత్యాసం.. మారాలి. మగవాళ్లతో సమానంగా.. ఆడవాళ్లు లైఫ్ ని తమకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి హక్కు రావాల్సిందే.
READ MORE: పెళ్లి తర్వాత బరువు తగ్గించి..బొజ్జ కరిగించే సూపర్ ఫుడ్స్
ఆడవాళ్లకు తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్చ నచ్చినట్టు జీవించే అధికారం కావాలి. ప్రస్తుతం మహిళలను నిరుత్సాహానికి గురిచేస్తున్న అంశాలు, ధైర్యంగా.. తమను తాము రక్షించుకుంటూ జీవించడానికి మహిళలకు ఉండాల్సిన రైట్స్ గురించి చర్చిద్దాం...

శరీరాకృతి
మహిళలకు పర్సనాలిటీ విషయంలో స్వేచ్ఛ రావాలి. లావుగా.. సన్నగా.. తనకు నచ్చినట్టు ఉండటానికి హక్కు పొందాలి. సన్నగా ఉంటే అందంగా ఉందని.. లావుగా ఉంటే అందవిహీనంగా ఉందని కామెంట్ చేయడం మానేయాలి. వాళ్ల శరీరాకృతి విషయంలో అబ్బాయిలకు ఎలాంటి టెన్షన్ లేదు.. ప్రశాంతంగా ఉంటారు. కానీ.. అమ్మాయిల విషయంలో వ్యత్యాసం ఎందుకు ? మనసు కంటే.. శరీరక అందానికి వ్యాల్యూ ఇవ్వడం మానాలి. అయినా ఇలాంటి అంశాలను పట్టించుకోవడం మానేసి.. తమకు నచ్చినట్టు జీవించడం ఆడవాళ్లు అలవరచుకోవాలి.

అందం
మీకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో లేరని గర్వంగా ఫీలవ్వాలి. పొట్టిగా, సన్నగా, లావుగా, ఎత్తుగా, బొద్దుగా.. ఎలా ఉన్నా మనసు మాత్రం మీదే కదా. మీకున్న అందాన్ని చూసుకుని మీరు హ్యాపీగా ఫీలవ్వాలి. ఇలాంటి ఫీలింగ్ ధైర్యానికి, ఆత్మ గౌరవానికి ముఖ్యమైనవి. కాబట్టి అందంగా లేమని ఎప్పుడూ ఫీలవకుండా.. స్వేచ్ఛగా ఉండండి.

అభిప్రాయం
అభిప్రాయాలు చెప్పే హక్కు మహిళలకు ఉండాలి. ఏ విషయాన్నైనా చర్చించేటప్పుడు మహిళలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ సమానమే అన్నప్పుడు.. వాళ్లకు మాత్రం మాట్లాడే స్వేచ్ఛ లేదా ? కాబట్టి మహిళలు కూడా ఒపీనియన్స్ ని ధైర్యంగా చెప్పడం అలవరుచుకోవాలి.. ధైర్యంగా ఉండాలి.

రిలేషన్ షిప్ స్టేటస్
సరైన వ్యక్తిని ఎంచుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు రిలేషన్ కి కాస్త టైం పడుతుంది. దేనికైనా సమయం రావాలి. కానీ సింగిల్ గా ఉండటం తప్పని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అయినా ఎవరి మాటలు పట్టించుకోకుండా.. ధైర్యంగా మనసుకి నచ్చినట్టు ఉండాలి.

భాగస్వామి ఎంపికలో ఛాయిస్
భాగస్వామిని ఎంచుకోవడానికి మహిళలకు ఛాయిస్ ఉండాలి. నిబంధనలు ఉండకూడదు. సమయానికి తగ్గట్టు ధైర్యంగా మాట్లాడటం మహిళలు నేర్చుకోవాలి. మీ మనసు చెప్పినట్టు నడుచుకోవాలి.

పిల్లల విషయంలో
పిల్లల విషయంలో మహిళలకు స్వేచ్ఛ ఉండాలి. ఎప్పుడు కావాలనుకుంటే.. అప్పుడే పిల్లలను పొందుతారు. దానికి ఇతరుల అభిప్రాయాలు, ఒత్తిడి సరైంది కాదు. పిల్లలు కనే విషయంలో వాళ్లకంటూ స్వేచ్చ ఇవ్వాలి.

సంతోషం, దుఖం
మహిళలూ మీకు నచ్చినట్టు మీరు ఉండండి. ఇతరుల గురించి ఆలోచించకండి. మీకు ఎలాంటి ఎమోషన్స్ అయినా వ్యక్తపరిచే హక్కు ఉంది. ఎవరికోసమే.. సంతోషంగా, బాధగా ఉండాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో ఏది అనిపిస్తే అది చేయాలి.

జీతం
మహిళలు డబ్బులు సంపాదిస్తున్నారంటే.. ఎదుటివాళ్లు సహించలేరు. భర్తతో సమానంగా జాబ్ చేస్తూ.. డబ్బులు సంపాదిస్తే.. చాలా మంది ఓర్చుకోలేరు. దాని వెనక మీ శ్రమ, ఒత్తిడి, ధైర్యం ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన దారిలో మీరు వెళ్లండి.

లక్ష్యం
మగవాళ్లకు మాత్రమే లక్ష్యాలు సాధించే హక్కు ఉందా ? కలలు నిజం చేసుకోవడానికి ఆడవాళ్లకు కూడా అంతే రైట్స్ ఉన్నాయి. మీకు నచ్చినది.. చేయడం, స్వతంత్రంగా ఉన్నప్పుడే ఎదుటివాళ్లను ఆకట్టుకోగలుగుతారు. కాబట్టి మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి.

సక్సెస్
మహిళల జీవితంలో, కెరీర్ లో సక్సెస్ అయ్యారంటే వాళ్లను అభినందించాలి. అంతేకాదు.. మగవాళ్లే సక్సెస్ అవుతారని ఫీలవకూడదు. మగవాళ్లు సక్సెస్ అయినప్పటి కంటే.. ఆడవాళ్లు విజయం సాధించినప్పుడే ఎక్కువ సెలబ్రేషన్స్ జరగాలి.

భావోద్వేగాలు
మహిళలకు భావోద్వేగాలు ఎక్స్ ప్రెస్ చేసే స్వేచ్ఛ కావాలి. ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండాలి. బాధ, సంతోషం, కోసం ఏదైనా వ్యక్తపరచడానికి హక్కు కావాలి. అభిప్రాయాలు, భావోద్వేగాలు పంచుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇదండీ మహిళలకు ఉండాల్సిన.. కోరుకుంటున్న స్వేచ్ఛ. నిజమే కదా.



Click it and Unblock the Notifications