Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పెళ్లి కావాలంటే.. అమ్మాయికి ఈ లక్షణాలు ఉండాల్సిందేనా ?
భార్య అంటే అందంగా ఉండాలి.. చక్కగా పని చేయాలి.. టేస్టీగా వండిపెట్టటాలి.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలి ఇవి మన భారతీయ స్త్రీకి ఉండాల్సి లక్షణాలు. అమ్మాయికి పెళ్లి కావాలంటే.. ఈ క్వాలిటీస్ తప్పనిసరి అయిపోయాయి. అబ్బాయిలు తమకు అమ్మాయి నచ్చాలంటే.. ఈ అంశాలన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉండాల్సిందే.
అమ్మాయికి పెద్దగా స్కిల్స్ ఉండక్కర్లేదు.. చేతినిండా పనివస్తే చాలు. ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు ఆలోచించే విధానం ఇలానే ఉంది. వినడానికి ఆక్చర్యంగా.. వింతగా ఉన్నా.. ఇది మాత్రం నిజమే.
ప్రపంచమంతా.. టెక్నాలజీతో ముడిపడి ముందుగు నడుస్తున్నా.. మనసుకంటే.. మగువల పనితనానికే ఇండియా ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలంటే స్త్రీకి లేదా.. భార్యకు ఉండాల్సిన లక్షణాలను అబ్బాయిలను ముందుగా ఆకర్షించే అంశాలేంటో మీరే చూడండి.

కలర్
కలర్. ఇది ముందుగా ప్రతి ఒక్క అబ్బాయి చూసే ఫస్ట్ క్వాలిటీ. అమ్మాయి చూడ్డానికి తెల్లగా.. అందంగా ఉందా ఓకే. . లేదంటే.. రిజెక్టెడ్ అంటున్నారు.

కట్నకానుకలు
కట్నం ఎక్కువ తీసుకొస్తే.. ఎక్కువ మర్యాద ఉంటుంది ఇది ఇండియన్స్ పాలసీ. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి ఆలోచనలే రాజ్యమేలుతున్నాయి. తక్కువ కట్నకానుకలు తెచ్చే అమ్మాయిలను చులకనగా చూసే కుటుంబాలూ లేకపోలేదు.

చపాతీల ఆకారం
చపాతీలు, రోటీలు చేయడం వస్తే చాలదు. అవి పక్కాగా సరైన ఆకారంలో గుండ్రంగా ఉండాల్సిందే. గుండ్రంగా.. ఆకర్షణీయంగా లేకపోతే.. ఆమెకు వంట రాదని.. డిసైడ్ చేసేస్తారు.

ఇంటి పని
చక్కగా ఇంటి పని చేసుకుంటే.. ఆమెను భారతీయ స్త్రీగా భావిస్తారు. ఇల్లంతా క్లీన్ గా ఉండాలి.. టైంకి చక్కగా వండిపెట్టాలి. అప్పుడే ఆమెకు విలువ.

మేల్ బాండింగ్
ఈ విషయంలో ప్రతి అమ్మాయికి కోపం కట్టలుతెంచుకోవాల్సిందే. ఎందుకంటే అమ్మాయిలకు అక్కాచెల్లెల్లు ఎంతమందైనా ఉండవచ్చు కానీ.. అన్నదమ్ములు మాత్రం ఎక్కువ ఉండకూడదనే దోరణిలో ఆలోచిస్తున్నారు అబ్బాయిలు. ఇలాంటి అమ్మాయిలనే పెళ్లిచేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.

శరీరాకృతి
భారతీయ స్త్రీల శరీరాకృతి మాత్రం పర్ ఫెక్ట్ గా ఉండాలి. ఒకవేళ ఆమె కాస్త బొద్దుగా.. ఉంటే.. ఇక ఆమెకు ఎలాంటి సంబంధాలు రావు.

చదువు
ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా.. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కానీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ విషయంలో తేడా ఉంది. అమ్మాయిల క్వాలిఫికేషన్ తక్కువగా ఉంటే.. వరుడిని వెతకడం ఈజీ అని భావిస్తారు. అందుకే అమ్మాయిలకు కొంతవరకే చదువు అని పరిమితులు విధిస్తున్నారు.

ఎత్తు విషయంలో
భర్త కంటే.. భార్య ఎత్తు తక్కువగా ఉండాలి. ఆమె ఖచ్చితంగా.. 4 నుంచి 5 ఇంచులు పొట్టిగా ఉండాల్సిందే. లేదంటే డామినేట్ చేస్తుందని.. అబ్బాయిలు భావిస్తారు. అందుకే తమకంటే.. భార్య ఎప్పుడూ పొట్టిగా ఉండాల్సిందే.



Click it and Unblock the Notifications
