2016 న్యూఇయర్ మీ లైఫ్ లో తీసుకొస్తున్న మార్పులేంటి ?

By Nutheti

కొత్త సంవత్సరం వస్తోంది అంటే.. అందరికీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త షెడ్యూల్స్, కొత్త రిలేషన్స్, కొత్త అడుగులు ఇలా.. కొత్త సంవత్సరంలో అన్నీ కొత్తగా ఉండాలనే ఆలోచిస్తారు. ఈ ఇయర్ లో ఫుల్ ఫిల్ చేసుకోలేని లక్ష్యాలను వచ్చే ఏడాదైనా నెరవేర్చుకోవాలని కలలు కంటుంటారు. ఇప్పుడు రాబోతున్న 2016 న్యూఇయర్ లో అంతా మంచే జరగాలని ప్రతి ఒక్కరూ ఆశించడంలో అతిశయోక్తిలేదు.

అయితే వచ్చే సంవత్సరం ఏ నెల ఎలా ఉండబోతోందో చైనీస్ ఆస్ర్టాలజీ అప్పుడే అంచనా వేసేసింది. ఏ నెలలో ఎలాంటి పనులకు అనుకూలం, ఏ నెల బిజినెస్ లో పెట్టుబడులకు అనుకూలిస్తుంది, ఏ నెలలో ఐశ్వర్యం సిద్ధిస్తుంది వంటి ఆసక్తికర అంశాలు రివీల్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. ఏ నెల ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలుగజేస్తుందో చూసేద్దాం..

జనవరి

జనవరి

జనవరి నెల అంత స్మూత్ గా ఉండటం లేదు. ప్రధానంగా సంపద విషయంలో కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా ఉండవు. కాబట్టి పరిచయం లేని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఇతరులతో చేతులు కలపాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమందికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కునే అవకాశముంది.

ఫిబ్రవరి

ఫిబ్రవరి

సంపద, వ్యాపారం ఫిబ్రవరిలో కాస్త మెరుగుపడతాయి. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇక్కడ సువర్ణావకాశాలు దొరుకుతాయి. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి, రెండుసార్లు ఆలోచించాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అలాగే రోజువారి ఖర్చులు రికార్డ్ చేసుకుంటే మంచిది.

మార్చ్

మార్చ్

మార్చ్ నెలలో చాలామంది స్టడీస్ లో, వర్క్ లో పురోగతి సాధిస్తారు. కొత్త కొత్త ఐడియాలు కలిసివస్తాయి. గతంలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు ఈ నెలలో తీరిపోతాయి. కొత్త పుస్తకాలు చదవడం, స్కిల్స్ నేర్చుకుని ఈ నెలలో మరింత నాలెడ్జ్ పొందుతారు.

ఏప్రిల్

ఏప్రిల్

ఏప్రిల్ లో కెరీర్ పరంగా చాలా ఎదురుదెబ్బలు తగలవచ్చు. దీనివల్ల సహోద్యోగులు, బాస్ ల దగ్గర రిలేషన్ లో సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులు, తోబుట్టువుల ఇచ్చే సలహాలు ఈ సమయంలో చాలా విలువైనవి. సమస్యలు ఎదురైనప్పుడు డిప్రెషన్ కి లోనవకుండా జాగ్రత్తపడాలి. ఇలాంటి సందర్భంలో చాలా ఓపిగ్గా, నిదానంగా ఉంటడం చాలా అవసరం.

మే

మే

ఐదో నెల అయిన మేలో కెరీర్ స్థిరంగా ఉంటుంది. అలాగే సందప కూడా అలానే ఉంటుంది. రోజు రోజుకీ కష్టపడటం వల్ల మంచి లాభాలు పొందుతారు, అలాగే.. సంవత్సరం మధ్యలో ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. వీలు దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో ట్రావెల్ చేయడం, ట్రిప్స్ కి వెళ్లడం వల్ల మానసికంగా హ్యాపీగా ఉంటారు. సరిగ్గా వ్యాయామం చేయడం వల్ల వర్క, స్టడీస్ లో స్ర్టాంగ్ గా ఉంటారు.

జూన్

జూన్

ఈ నెలలో అదృష్టం సాధారణంగా ఉంటుంది. తుది విజయం సాధించడానికి ఇంకా సమస్యలు ఎదురవుతాయి. సమస్యలు పరిష్కరించుకోవడానికి పట్టుదల, ఓపిక చాలా అవసరం. సరైన సలహాలు, సూచనలు తమ భాగస్వామి ద్వారా పొందుతారు.

జులై

జులై

సందప, కెరీర్ జూలైలో స్థిరంగా ఉంటాయని చైనీజ్ ఆస్ర్టాలజీ చెబుతోంది. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకోవాలి. చాలామంది కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది ఫీలవుతారు. కాబట్టి కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడు సంబంధాలు స్ర్టాంగ్ గా ఉంటాయి, రిలాక్స్ గా ఉంటుంది.

ఆగస్ట్

ఆగస్ట్

ఔత్సాహికంగా ఉండే వాళ్లు ప్రతి విషయాన్ని ప్రోద్బలంతో చేయడం మానేయాలి. ముఖ్యంగా ఇతరుల వ్యాపారాల్లో తలదూర్చడం మంచిది కాదు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడం వల్ల సొంత వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.

సెప్టెంబర్

సెప్టెంబర్

లవ్ రిలేషన్ షిప్, మ్యారేజ్ లైఫ్ చాలా స్వీట్ గా, అందంగా ఉంటుంది. కెరీర్ పరంగా అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది. షార్ట్ టర్మ్ గోల్స్ ఈజీగా సాధించగలరు. తుది విజయం సాధించాలంటే.. చిన్నచిన్న లక్ష్యాలు నెరవేర్చుకోవాలి.

అక్టోబర్

అక్టోబర్

జీవితంలో అన్ని విషయాల్లో అక్టోబర్ గోల్డెన్ మంత్. కెరీర్ లో కొత్త ఫీల్డ్స్ తెలుసుకుని మరింత ప్రయోజనాలు పొందుతారు. అలాగే ప్రమోషన్స్ పొందడానికి కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. దాంతోపాటు తమ తెలివితేటలు, సత్తాను తమ బాస్ ల ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ నెలలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు.

నవంబర్

నవంబర్

ఈ నెలలో సహోద్యోగులు, కుటుంబ సభ్యులతో అనుకూలమైన సంబంధాలు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. వాళ్లు చాలా ఈజీగా మిమ్మల్ని అనవసర విషయాలకు అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి. అలాగే డబ్బు ఆదా చేసుకోవడం కూడా చాలా అవసరం.

డిసెంబర్

డిసెంబర్

ఈ నెలలో చాలా ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా ఉంటారు. నెగటివ్ మూడ్ తొలగించుకోవడానికి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లాలి, వాళ్లతో మీకున్న చికాకుల గురించి మాట్లాడాలి. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించడం సాధ్యం కాదు.

Desktop Bottom Promotion