For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చర్యం కలిగించే విచిత్రమైన పెళ్లిళ్లు

By Nutheti
|

కుక్కలు, మేకలను మనుషులు పెళ్లిచేసుకోవడం ఎక్కడైనా చూశారా ? సినిమాల్లో జోక్ కాదండీ.. రియల్ లైఫ్ లో ఎక్కడైనా చూశారా ? నిజమే ప్రపంచంలో జరిగే కొన్ని వింతలు, విశేషాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తూనే ఆశ్చర్యపరుస్తాయి. ఇలా కుక్క, మేకలనే కాదు.. రకరకాల వస్తువులను కూడా పెళ్లి చేసుకుని మురిసిపోతున్నవాళ్లున్నారంటే నమ్ముతారా ? ఈ ఆర్టికల్ చదివితే నమ్మాల్సి వస్తుంది.

READ MORE: మీకు నచ్చే డ్రీమ్ గర్ల్ ఏ రాశిలో ఉందో తెలుసుకోవాలనుందా ?

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. పెళ్లి అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకటవుతూ చేసుకునే ముచ్చట. కాలం మారుతున్న కొద్దీ.. ఆచారాలు, పద్ధతులు మారి రకరకాల స్టైల్స్ లో పెళ్లి చేసుకుంటున్నారు. ఏ స్టైల్లో చేసుకున్నా.. అమ్మాయి, అబ్బాయితోనే మూడుముళ్ల బంధం పడుతోంది. కానీ.. కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు మాత్రం చాలా ఫన్నీగా జరిగాయి. ఆ విశేషాలు మీ కోసం..

పిజ్జాతో ఓ వ్యక్తి పెళ్లి

పిజ్జాతో ఓ వ్యక్తి పెళ్లి

రష్యాలోని ఓ పిజేరియాలో జరిగింది ఈ వేడుక. సింగిల్ లైఫ్ బోర్ కొట్టడంతో తనకు చాలా ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ పిజ్జాని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. పెళ్లి చేసుకున్నాడు.

పామును పెళ్లి చేసుకున్న మహిళ

పామును పెళ్లి చేసుకున్న మహిళ

2006లో హిందూ మహిళ ఈ రకమైన పెళ్లి చేసుకుంది. తాను పామును ప్రేమిస్తున్నాని, పెళ్లిచేసుకోవాలని డిసైడ్ అయింది. అంతే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని మురిసిపోతోంది. ఈ వింత పెళ్లికి 2 వేల మంది వెళ్లారు.

డాల్ఫిన్ తో మహిళ మ్యారేజ్

డాల్ఫిన్ తో మహిళ మ్యారేజ్

15 ఏళ్ల పాటు డాల్ఫిన్ స్నేహం చేసిన బ్రిటీష్ మహిళ దానినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పెళ్లి వేడుక ఇజ్రాయిల్ లో జరిగింది. మొదటి సారి ఆ డాల్ఫిన్ ను కలిసినప్పుడే ప్రేమ పుట్టిందని.. అది లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పుకొచ్చింది ఆ మహిళ. అంతేకాదు ఆ డాల్ఫిన్ మేల్ అని..తన జీవితాంతం దానికే తన ప్రేమ అంకితమని చెప్పింది.

మేకతో ఓ వ్యక్తి పెళ్లి

మేకతో ఓ వ్యక్తి పెళ్లి

సూడాన్ విచిత్రమైన చట్టాలున్నాయి. ఒకవేళ ఒక మహిళతో కలిసి నిద్రపోవాల్సి వచ్చినా.. నిద్రపోయినా.. ఆమెను పెళ్లి చేసుకోవాల్సిందే. అలాగే 2006లో ఈ చట్టాన్ని మేకలకు వర్తింపజేశారు. మేకలతో సంబంధం ఏర్పరచుకుని, సరదాగా గడుపుతున్న చార్లెస్ అనే వ్యక్తి చట్ట ప్రకారం మేకను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

వ్యవసాయదారుడు, కుక్క

వ్యవసాయదారుడు, కుక్క

ఇదో విచిత్రమైన కథ. ఒక వ్యక్తి కొన్నిరకాల వ్యాధులతో బాధపడుతున్నాడు. అయితే తన వరిచేలలో తిరుగుతున్న కుక్కలపై రాళ్లు విసిరి వాటి చావుకి కారణమే ఈ అనారోగ్య సమస్యలకు కారణమని భావించాడు. ఈ సమస్యలపై డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో జ్యోతిష్యుడు దగ్గరకు వెళ్తే అతను.. కుక్కను పెళ్లి చేసుకుని దాంతోపాటు జీవిస్తే సమస్యలు తీరుతాయని చెప్పడంతో.. ఈ రకంగా కుక్కను పెళ్లి చేసుకున్నాడు.

పిల్లి, వ్యక్తి

పిల్లి, వ్యక్తి

పిల్లులతో చాలా మంది స్నేహం చేస్తుంటారు. జర్మనీలో ఓ పోస్ట్ మ్యాన్ పిల్లితో స్నేహమే కాదు పెళ్లి కూడా చేసుకున్నాడు. పిల్లికి ఆరోగ్యం బాగోలేదని వైద్యుడు చెప్పడంతో.. అతను వెంటనే దాన్ని పెళ్లి చేసుకున్నాడు.

టవర్, మహిళ

టవర్, మహిళ

సాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన మాజీ సైనిక మహిళ ఈఫిల్ టవర్ పై మనసు పారేసుకుంది. ఇంకేముంది 2008లో తన పేరుని ఎరికా లా టూర్ ఈఫిల్ గా మార్చుకుంది.

గోడతో మహిళ ప్రేమాయణం

గోడతో మహిళ ప్రేమాయణం

1979లో ఏయ్ జా రీట్టా అనే మహిళ బెర్లిన్ గోడను ప్రేమించి పెళ్లి చేసుకుంది. చిన్నప్పుడు టీవీలో ఆ గోడను చూసి ప్రేమలో పడిందట. అంతే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె పేరును బెర్లిన్ వాల్ గా మార్చుకుంది.

డిజిటల్ వైఫ్ ని

డిజిటల్ వైఫ్ ని

వీడియో గేమ్స్ ఏదైనా క్యారెక్టర్ నచ్చితే మీరేంచేస్తారో గానీ.. సాల్ అనే వ్యక్తి మాత్రం లవ్ ప్లస్ గేమ్ లో నచ్చిన ఓ అమ్మాయి క్యారెక్టర్ ని ప్రేమించాడు. 2009లో పెళ్లి చేసుకున్నాడు.

రోలర్ కోస్టర్, మహిళ

రోలర్ కోస్టర్, మహిళ

న్యూయార్క్ కి చెందిన ఏమీ వోల్ఫ్ అనే మహిళ తాను చాలా ఇష్టపడే రోలర్ కోస్టర్ ని పెళ్లి చేసుకుంది. ఇందులో ఈమె 3వేల సార్లు రైడ్ చేసిందట. ఆమెను వస్తువులతో రిలేషన్ షిప్ పెంచుకోవడం అలవాటట.

దిండుతో వ్యక్తి

దిండుతో వ్యక్తి

లి జిన్ జ్యూ అనే వ్యక్తి 2010లో తనకు ఇష్టమైన పిల్లోని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

బొమ్మతో వ్యక్తి పెళ్లి

బొమ్మతో వ్యక్తి పెళ్లి

తన డబ్బు ఖర్చు పెట్టని మహిళను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట. అందుకే దేవ్ చాట్ అనే వ్యక్తి 2000 సంవత్సరంలో ఓ అమ్మాయి బొమ్మను పెళ్లి చేసుకున్నాడు.

కుండతో అమ్మాయి పెళ్లి

కుండతో అమ్మాయి పెళ్లి

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ కుండనే పెళ్లి చేసుకుని సంబరపడుతోంది.

English summary

These weird marriages will make you laugh out loud

These weird marriages will make you laugh out loud. Take a look.
Story first published:Saturday, November 28, 2015, 11:58 [IST]
Desktop Bottom Promotion