Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
తల్లి నుంచి కూతుళ్లు వారసత్వంగా పొందే అంశాలు
కూతుళ్లు నాన్నల గారాల పట్టీలు.. కొడుకులు అమ్మల చెంగుచాటు బిడ్డలు. ఇది మనం సాధారణంగా వింటుంటాం. కానీ తల్లీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం మరో అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి అమ్మాయి తాను పెరుగుతున్న కొద్దీ.. తమకు ఉండాల్సిన లక్షణాలను, స్వభావాలను అమ్మ నుంచే నేర్చుకుంటుంది కాబట్టి.
అమ్మల నుంచి కూతుళ్లు వారసత్వంగా నేర్చుకునే అంశాలు చాలానే ఉన్నాయి. తన స్కిల్స్, సీక్రెట్స్, మధురమైన వంటకాలని.. కూతురుకి నేర్పించేయాలని ప్రతి తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ చేతి గోరుముద్దల్లోని మాధుర్యం నుంచి.. పిల్లల పెంపకం వరకు అన్ని విషయాలను తల్లిని అనుకరించాల్సిందే అన్నది వాస్తవం. అమ్మ నుంచి కూతుళ్లు నేర్చుకునే ఇలాంటి.. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటో ఓ లుక్కేయండి.

గృహ నైపుణ్యాలు
ఇంటి బాధ్యతలు ఎలా నిర్వహించాలో ఏ అమ్మాయికైనా అమ్మ నుంచి అలవడాల్సిందే. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించాలనేది అమ్మ నుంచే కూతుళ్లు నేర్చుకుంటారు. పెళ్లైన ఏ అమ్మాయికైనా ఈ విషయం అర్థమవుతుంది.

నగలు
తమ దగ్గర ఉన్న విలువైన బంగారు నగలను తమ కూతుళ్లకు ఇవ్వాలని ప్రతి భారతీయ మహిళ కోరుకుంటుంది. తన నగలతో కూతురిని అలంకరించి.. తన ముచ్చట తీర్చుకుంటుంది.

చీరలు
అమ్మ నుంచి కూతుళ్లు వారసత్వంగా పొందే వాటిలో చీరలు ఒకటి. తమ దగ్గరున్న రకరకాల చీరల్లో తమకు బాగా నచ్చిన.. ఇష్టమైన వాటిని కూతుళ్లకు ఇచ్చేసిమురిసిపోతారు మామ్స్.

వంటలు
అమ్మాయిలకు నచ్చిన మొదటి చెఫ్ అమ్మే. తనకంటే రుచికరంగా ఇంకెవరు చేయరని.. వాళ్ల నమ్మకం. అందుకే.. అమ్మలాగా టేస్టీగా వండటం నేర్చుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.

తల్లి స్వభావం
అమ్మ నుంచి కమ్మని ప్రేమా, ఆప్యాయతలు పొందుతారు కూతుళ్లు. ఓర్పు, స్వభావం వంటి గుణాలన్నింటిని అమ్మ నుంచి అమ్మాయిలు పొందే మొదటి లక్షణం.

పిల్లల పెంపకం
అమ్మను మించిన మార్గదర్శి మరొకరు లేరని ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. పిల్లలను ఎలా పెంచాలి.. వాళ్ల అవసరాలు ఎలా తీర్చాలి.. వాళ్లకు సరైన నడవడిక ఎలా నేర్పాలి అన్నది ప్రతి ఒక్కరు అమ్మ నుంచే నేర్చుకుంటారు. అలాగే ప్రతి అమ్మాయి తన అమ్మ నుంచే పిల్లలను కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచే గుణం అలవరుచుకుంటుంది.



Click it and Unblock the Notifications
