For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 5 నగరాలు

By Super
|

జీవన విధానానికి ఖర్చులు ఏ దేశంలో అయిన పెరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో ఎదుర్కొనే ధర ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఏమీ ఉండదు. ఈ వ్యాసం లో మేము ప్రపంచంలో టాప్ 5 అత్యంత వ్యయభరిత నగరాల జాబితాను సిద్ధం చేసాం. వివిధ పరిశోధన సంస్థలు ప్రచురించిన జాబితాలు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో అన్ని పోలి ఉన్నప్పటికీ, మేము చాలా ఖచ్చితమైన ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (EIU) ప్రచురించిన ఒక దానిని మేము మీతో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నాం.

1. జ్యూరిచ్, స్విట్జర్లాండ్.

1. జ్యూరిచ్, స్విట్జర్లాండ్.

జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో అతిపెద్ద నగరం. జీవితం యొక్క అత్యధిక నాణ్యతను కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. అంతేకాక ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం.ఈ నగరం లో మీరు దాదాపు ఒక బార్ లో ఒక బీర్ కోసం $ 10 లేదా ఒక సినిమా టికెట్ కోసం $ 20 చెల్లించాలి. స్విట్జర్లాండ్ ను ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటి అని పిలుస్తారు.కానీ అది అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. కాబట్టి మీకు ఈ నగరం లేదా దేశంను సందర్శించడానికి ప్రణాళిక చేస్తే, ఈ ప్రయాణం చౌకగా ఉండదని గమనించండి.

2. టోక్యో, జపాన్.

2. టోక్యో, జపాన్.

టోక్యో అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా భావించినప్పటికీ రెండవ స్థానంలో ఉన్నది. ఈ అందమైన నగరంలో ఒక డజను గుడ్లకు $ 7 మరియు సోడాకు దాదాపు $ 2 ఖర్చు చేయాలి. ఈ నగరంలో జీవన వ్యయం చాలా అధికంగా ఉంటుంది. అలాగే జీవితం యొక్క నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది.

జెనీవా, స్విట్జర్లాండ్.

జెనీవా, స్విట్జర్లాండ్.

జెనీవా స్విట్జర్లాండ్ లో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఉంది. అలాగే ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. మ్యుజియం, ఆర్కిటెక్చర్, సంప్రదాయం మరియు ఆచారాలతో ఐరోపాలో ఇష్టమైన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. జెనీవాలో చౌకగా ఆహారం లేదా వసతి కనుగొనడం అంత సులభం కాదు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో జీవించడానికి ఎనిమిదవ ఉత్తమ నగరంగా ఉంది.

నేగాయ, జపాన్.

నేగాయ, జపాన్.

నేగాయ జపాన్ రెండవ అత్యంత ఖరీదైన నగరంగా మరియు ప్రపంచంలోనే నాల్గోవ నగరంగా ఉంది. ఈ నగరం పసిఫిక్ తీరంలో సెంట్రల్ హోన్షు లో ఉంది. ఇది ఒక మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా ఉంది. జపాన్ లో నిర్మితమైన అన్ని ఆటోమొబైల్స్ దాదాపు 50% ఇక్కడే తయారవుతాయి. నేగాయ లో సోడా కోసం మీరు $ 1.50 ఖర్చు చేయాలి. అలాగే ఒక బార్ లో ఒక బీర్ కోసం మీరు $ 11 చెల్లించాలి.

 ఓస్లో, నార్వే.

ఓస్లో, నార్వే.

ఓస్లో పది సంవత్సరాల కంటే ముందు నుండి జీవించడానికి టాప్ 5 ఖరీదైన నగరాల్లో ఒకటిగా ఉంది. నార్వే రాజధాని అయిన ఓస్లో నివసించడానికి రెండవ ఖరీదైన యూరోపియన్ నగరంగా మరియు ప్రపంచంలోనే ఐదో నగరంగా ఉంది. అంతేకాక ఈ నగరం పెట్టుబడిదారులకు ఒక రక్షిత స్వర్గంగా ఉంటుంది. ఆశ్చర్యంగా ఓస్లో లో మీరు ఒక సినిమా టికెట్ కోసం దాదాపు $ 18 చెల్లించాలి. జీవించడానికి ఒక ఖరీదైన ప్రదేశంగా ఉన్నప్పటికీ, అక్కడ నివాసితులు రిచ్ గా ఉండరు. ఇక్కడ సగటు వేతనాలు మరియు కొనుగోలు పవర్ విషయాలకు వస్తే ఈ నగరం నాలుగో స్థానంలో ఉంది.

English summary

Top 5 Most Expensive Cities In The World

The costs of living are growing in any country, but it’s nothing compared to the price inflation that some global cities are experiencing. In this article we have prepared a list of the top 5 most expensive cities in the world. There are many kind of lists published by different research agencies.
Desktop Bottom Promotion