Latest Updates
-
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే!
విస్మయం కలిగించే వింత పుట్టుకలు
మానవుని రూపాన్నిసృష్టించింది దేవుడే. అలా పుట్టినప్పుడే మనుషులుగా భావిస్తారు.. ఆదరిస్తారు. మరి ఈ రూపానికి ఏమైంది ? దేవుడి సృష్టిలో మార్పులు.. వికృత రూపాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి ? ఇది మనుషుల తప్పా.. దేవుడి శిక్షా ? కారణమేదైనా.. వికృతంగా పుడుతున్న కొంతమంది పిల్లలు.. పురిట్లోనే చనిపోతున్నారు.
ఒక తల.. రెండు కాళ్లు.. రెండు చేతులు.. ఉంటే మనుషులు అంటారు. మరి రెండు తలలు.. నాలుగు చేతులు.. ఉంటే ? ఇలా పుట్టినా మనిషే అనాల్సి వస్తోంది. ఎందుకంటే.. మనుషులకే పుడుతున్నారు కాబట్టి.. అంగీకరించాలి. వింతగా.. వికృతంగా.. ఆశ్చర్యకరమైన ఆకారాల్లో భూమ్మీద పడుతున్న.. శిశువులను చూస్తుంటే.. మనిషి రూపమేనా అనిపిస్తుంది. వింతగా పుట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన చిన్నారుల రూపాలను మీరే చూడండి.

కప్ప ఆకారంలో
నేపాల్ లో పుట్టిన బిడ్డ కప్ప ఆకారంలో జన్మించాడు. శిశువు ముఖం కప్పని పోలి ఉండటంతో.. ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. తల, మెడ భాగమంతా.. ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. కళ్లు చాలా పెద్దవిగా.. గుడ్లు బయటకు తేలినట్టు ఉండే ఈ బిడ్డ ఆకారం చాలా వికృతంగా.. భయంకరంగా ఉంది.

రెండు ముఖాలు
రెండు ముఖాల మనుషులను ఎప్పుడైనా చూశారా ? లాలి అనే అమ్మాయి అలానే పుట్టింది. రెండు తలలు, రెండు ముక్కులు, రెండు జతల పెదాలు ఉన్నాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నా.. ఆ పాప తల్లిదండ్రులు మాత్రం దేవుడిచ్చిన బహుమతి అంటున్నారు.

ఒకే కన్ను
నైజీరియాలో ఒకే కన్నుతో పుట్టిందో శిశువు. ఒకే కన్ను ఉండటమే కాదు.. ముక్కు లేకుండా.. జన్మించింది. ఎక్కువ మోతాదులో మందులు వాడటం.. సరైన మందులు తీసుకోకపోవడం వల్లే ఇలా వికృతంగా పుట్టిందంటున్నారు డాక్టర్లు.

పులి చారలు
పాకిస్తాన్ లో పుట్టిన బిడ్డ మరింత భయంకరంగా.. ఆశ్చర్యకరంగా ఉన్నాడు. చర్మ సంబంధిత సమస్యలున్న ఈ చిన్నారి.. పులి చారలతో జన్మించాడు. శరీరమంతా పులి చారలను తలపించేలా.. రక్తపు చారలున్నాయి. కళ్లు కూడా ఎరుపురంగులో భయంకరంగా ఉన్నాయి.

రెండు తలలు
రెండు తలలతో పుట్టిన శిశువు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. రెండు తలలు అతుక్కుని.. కవలల మాదిరిగా ఉన్నాడు. ఇంకా పిండం వృద్ధిచెందుతుండగా.. పుట్టడం వల్ల ఇలా రెండు తలలు అతుక్కున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వింత నార్త్ కైరోలో జరిగింది.

బయటకు వచ్చిన గుండె
శరీరంలో లోపల ఉండే గుండె ఈ చిన్నారికి శరీరంపైన అతుక్కుని ఉంది. ఎక్టోపియా కార్డిస్ అనే వ్యాధి కారణంగా ఇలా జన్మించాడు. ఈ వ్యాధి వల్ల.. గుండె స్థానంలో మార్పులు వస్తాయి.

రకరకాల అవయవాలు
భారతదేశంలో ఎక్కువ అవయవాలతో పుట్టిన బిడ్డ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాలుగు చేతులు, మూడు కాళ్లతో పుట్టిందీ అమ్మాయి. హిందువుల దేవుళ్లకు రెండుకంటే ఎక్కువ చేతులు ఉంటాయని.. అలాగే ఈ బిడ్డ కూడా జన్మించిందని మూఢనమ్మకం వ్యాపించింది.



Click it and Unblock the Notifications











