For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఇండియన్స్ క్రియేటివిటీ

By Nutheti
|

ఇండియన్స్ టెక్నాలజీ, మెడిసిన్, స్పోర్ట్స్, బిజినెస్ ఏ రంగంలోనైనా.. సత్తా చాటుకుంటారు. అరుదైన విన్యాసాలు, అద్భుతాలు, టాలెంట్స్ ప్రదర్శించడంలో గ్రేట్. అలాంటి క్రియేటివ్ నెస్, గొప్ప కళలలో టాలెంట్ ప్రూవ్ చేసిన వాళ్లను గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ లో చేరుస్తారు. ఆశ్చర్యకరంగా, విభిన్నంగా, వింతగా చేసే కొత్త కొత్త ప్రయోగాలకు పెట్టింది పేరు గిన్నీస్ వరల్డ్ బుక్.

READ MORE : టాప్ సెలబ్రెటీల యొక్క నాభి అందాలు చూడతరమా

ఇందులో స్థానం సంపాదించాలంటే.. ప్రపంచంలో ఎవరూ చేయలేని గొప్ప గొప్ప విన్యాసాలు చేయాలి. అలాంటి అద్భతమైన.. ముక్కున వేలుసుకునే కొన్ని వింతైన విన్యాసాలు మన ఇండియాలో జరిగాయి. ఆశ్చర్యం కలిగించే కొన్ని ప్రత్యేక రికార్డ్స్ మీకోసం...

ప్రపంచంలోనే పెద్ద తలపాగా

ప్రపంచంలోనే పెద్ద తలపాగా

60 ఏళ్ల ఈ అవతార్ సింగ్ మౌని.. పంజాబ్ లోని పటియాలా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ప్రపంచంలోనే అతిపెద్ద తలపాగా ధరించి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారీయన. దీని బరువెంతో తెలుసా..? 100 పౌండ్స్.. దీన్ని విడదీస్తే.. 645 మీటర్లు ఉంటుంది. దీన్ని ధరించడానికి అవతార్ సింగ్ కి ఎంత సమయం పడుతుందో తెలుసా.. అక్షరాల ఆరుగంటలు.

ప్రపంచంలోనే పొట్టి మహిళ

ప్రపంచంలోనే పొట్టి మహిళ

23 ఏళ్ల జ్యోతి అమ్గే.. గిన్నీస్ వరల్డ్ బుక్ లో ప్లేస్ సంపాదించింది. కేవలం రెండు అడుగులు మాత్రమే ఉండటంతో.. ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉన్న మహిళగా రికార్డ్ క్రియేట్ చేసింది జ్మోతి.

ప్రపంచంలోనే పెద్ద మీసం

ప్రపంచంలోనే పెద్ద మీసం

జైపూర్ కి చెందిన 58 ఏళ్ల రామ్ సింగ్ చౌహాన్ తన పొడవైన మీసాలతో.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. 12 అడుగుల పొడవు ఉన్న ఈ మీసంను 32 ఏళ్లుగా పెంచుతున్నారట.

ఒకేసారి సెల్ఫీ

ఒకేసారి సెల్ఫీ

ఒకేసారి ఎక్కువ మంది సెల్ఫీ తీసుకుని ఇండియన్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. కోచీలోని ఫెడరల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకేసారి స్టూడెంట్స్, స్టాఫ్ మొత్తం ఒక నిమిషంలో వెయ్యి మంది క్యాంపస్ లో సెల్ఫీలు దిగారు.

అత్యంత ఖరీదైన పెళ్లి

అత్యంత ఖరీదైన పెళ్లి

ఇండియాలో పెళ్లిళ్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారన్నది కొత్తేమీ కాదు. కానీ లక్ష్మీ మిట్టల్ కూతురి వెడ్డింగ్.. అత్యంత వైభవంగా.. ఎక్కువ ఖర్చుతో చేసి.. వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. లక్ష్మీ మిట్టల్ కూతురు వినీషా మిట్టల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అమిత్ భాటియాను 2004లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.

ముక్కుతో టైపింగ్

ముక్కుతో టైపింగ్

టైప్ చేసేటప్పుడు ముక్కు మాత్రమే ఉపయోగించి కుర్షీద్ హుస్సేన్ అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాడు. కొన్ని సెకన్స్ లోనే 103 పదాలు చేతి అవసరం లేకుండా.. కేవలం ముక్కుతోనే టైప్ చేశారు.

కార్ల కింద స్కేటింగ్

కార్ల కింద స్కేటింగ్

ఐదేళ్ల చిన్నది.. స్కేటింగ్ లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కోల్హాపూర్ కి చెందిన శ్రేయా రాకేష్ దేశ్ పాండే.. అత్యంత వేగంగా కార్ల కింద స్కేటింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 48.1 మీటర్లు, 27 కార్ల కింద 23 సెకన్లలో పూర్తి చేసి వండర్ అనిపించింది.

గంటలోనే ఎక్కువ హగ్స్

గంటలోనే ఎక్కువ హగ్స్

ఆంధ్రప్రదేశ్ లోని టెక్కలికి చెందిన జయసింహ రావిరాల అనే కుర్రాడు.. గంటలోనే 2వేల436 మందిని కౌగిలించుకుని.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ప్రపంచంలోనే చిన్న ఆవు

ప్రపంచంలోనే చిన్న ఆవు

కేరళలో ఉన్న ఈ చిన్న ఆవు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్లేస్ దక్కించుకుంది. ప్రపంచంలోనే అతి పొట్టిది ఈ ఆవు. కేవలం 61.5సెంటీమీటర్లు ఉంటుంది ఇది. కొన్ని కుక్కల కంటే కూడా ఈ ఆవు పొట్టిగా ఉందట.

సోలో డ్యాన్స్ మారథాన్

సోలో డ్యాన్స్ మారథాన్

సంప్రదాయ నృత్యం చేయడంలో ఆరితేరింది కలమండలం హేమలత. ఈమె 123 గంటలా 15 నిమిషాల పాటు.. నిర్విరామంగా సోలోగా నృత్యం చేసి.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

English summary

Unique Guinness World Records in telugu

Indians are second to none in a lot of fields, be it technology, medicine, sports or business. You name it, and we’ve done it. The same goes for holding unique Guinness World Records.
Story first published: Thursday, November 5, 2015, 16:13 [IST]
Desktop Bottom Promotion