Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
ప్రపంచాన్ని జయించే సత్తా ఎడమ చేతివాటం వాళ్లదేనా ??
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు. నిజమే.. ఎడమ చేతి వాటమా అని చాలామంది హైరానా పడుతుంటారు. కానీ.. ఎడమ చేతి వాటం మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఎడమ చేతి వాటం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ వ్రైటర్స్ దే విజయమట.
ఎడమ చేతి వాటం అంటే.. చిన్నచూపు ఉండేది. ఇప్పుడు అదే గొప్పవరంగా మారిపోయింది. కుడిచేతి వాటం కంటే.. ఎడమ చేతివాళ్లకే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు రిలాక్స్ గా ఉండవచ్చు. అదే కుడిచేతి వాటం వాళ్లు చాలా కష్టపడాల్సి వస్తుంది.. సక్సెస్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఎడమ చేతి వాటం వాళ్లలో కనిపించే 23 అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందామా.

స్మార్టర్
మొత్తం జనాభాలో 5 నుంచి 26 శాతం మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లు ఉంటారు. వీళ్లు చాలా స్మార్ట్ గా ఉంటారు. చూడ్డానికే కాదు.. ఇంటెలిజెన్స్ లోనూ స్మార్ట్ గానే ఉంటారు. ఎక్కువగా పురుషుల్లో ఎడమచేతి వాటం ఉంటుంది.

గ్రాస్పింగ్ పవర్
కుడిచేతి వాటం వాళ్ల కంటే.. ఎడమ చేతి వాటం వాళ్లు చాలా షార్ప్ గా ఉంటారు. వీళ్లు ఏ విషయాన్నైనే వెంటనే అర్థం చేసుకుంటారు. వీళ్లకు మెదడులో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది.

త్వరగా కోలుకుంటారు
ఏదైనా ప్రమాదానికి గురైనా.. అనారోగ్యానికి లోనైనా.. లెఫ్టీస్ త్వరగా కోలుకుంటారు.

కళాత్మకం
లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లు కళాత్మక ప్రయోజనాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఏది చేసినా కొత్తగా ఉండాలని కోరుకుంటారు. చాలా మంది గొప్పవాళ్లు ఎడమచేతి వాటం వాళ్లు ఉన్నారు.

మంచి ఆటగాళ్లు
కుడిచేతి వాటం వాళ్ల కంటే.. ఎడమ చేతివాటం వాళ్లు బాక్సింగ్, టెన్నిస్, బేస్ బాల్ ఆటల్లో బాగా రాణిస్తారు. కుడిచేతి వాటం వాళ్లతో పోల్చితే.. వీళ్లు ప్రాక్టీస్ ఎక్కువగా చేసి ఆటల్లో సత్తా చాటుకుంటారు.

ఙ్జాపక శక్తి ఎక్కువ
ఎడమ చేతి వాటం వాళ్లలో ఙ్జాపక శక్తి చాలా ఎక్కువ. కుడిచేతి వాటం వాళ్లతో పోల్చితే.. వీళ్లు జరిగిన విషయాలను బాగా గుర్తు పెట్టుకుంటారు.

మల్టీ టాస్కింగ్
ఎడమచేతివాటం వాళ్ల ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఏ పనినైనా టక్కున చేసేస్తారు. అంతేకాదు.. వీళ్లకు ఒకేసారి రెండు మూడు పనులు చేసే సామర్థ్యం కూడా ఎక్కువే.

ఎడమచేతి వాటం వాళ్లకు ఓ రోజు
అవును లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ల కోసం ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేని ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13న సెలబ్రేట్ చేస్తారు.

సంపాదన
రైట్ హ్యాండెడ్ వాళ్ల కంటే.. లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ల సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎడమ చేతి వాటం వాళ్లు రైట్ హ్యాండెడ్ వాళ్ల కంటే 13 శాతం ఎక్కువ సంపాదిస్తారు.

గుడ్ డ్రైవింగ్ స్కిల్స్
ఎడమచేతి వాటం వాళ్లలో డ్రైవింగ్ స్కిల్స్ మెండుగా ఉంటాయి. కుడిచేతి వాటం వాళ్ల కంటే.. ఎడమ చేతివాటం వాళ్లు మొదటిసారికే అన్ని డ్రైవింగ్ టెస్ట్ లు పాస్ అయిపోతారు.

వ్యోమగాములు
ఎడమచేతి వాటం వాళ్లే ఎక్కువగా వ్యోమగాములుగా రాణిస్తారు. 25 శాతం మంది వ్యోమగాములు లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లే ఉన్నారు.

ఆలోచన తీరు
ఎడమచేతి వాటం వాళ్లు చాలా ఇంటిలిజెంట్స్. మెదడుకు లెఫ్ట్, రైట్ రెండు వైపుల నుంచి సమాచారం అందడం వల్ల వీళ్లకు వేగంగా ఆలోచించే పవర్ ఉంటుంది.

ఫోటోగ్రఫీపై మక్కువ
లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లు ఎక్కువగా విజ్యువలైజేషన్ ని ఇష్టపడతారు. వీళ్లకు రాయడం కంటే.. ఫోటోగ్రఫీ, పెయింటింగ్ వంటివాటిపైనే ఆసక్తి ఎక్కువ.

టైపింగ్ స్కిల్స్
ఎడమచేతి వాటం వాళ్లలో టైపింగ్ స్పీడ్ చాలా ఎక్కువ. క్వెర్టీ కీబోర్డ్ పై వీళ్లు చాలా వేగంగా టైప్ చేయగలుగుతారు. 450 పదాలు కుడిచేత్తో టైప్ చేస్తే.. 3వేల 400 పదాలు లెఫ్ట్ చేత్తో టైప్ చేయగలుగుతారు.

నీటిలో ఉండే సామర్థ్యం
మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఎడమచేతి వాటం వాళ్లు ఎక్కువసేపు నీళ్లలో ఉండగలుగుతారు. పరిసరాలకు అనుగుణంగా అలవాటుపడే సామర్థ్యం వీళ్లకు ఉంటుంది.

వీడియో గేమ్స్
లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లు చాలా హుషారుగా ఉంటారు. వీళ్లు వీడియో గేమ్స్ బాగా ఆడగలుగుతారు.

రాయల్స్
కుడిచేతి వాటం వాళ్లు రాయల్స్ గా గుర్తింపుపొందినవాళ్లు ఉన్నప్పటికి అసమానమైన ఎడమచేతి వాటం వాళ్లు కూడా రాయల్స్ అయ్యారు. క్వీన్ ఎలిజిబెత్ టూ, ప్రిన్స్ విలియమ్.. ఎడమచేతి వాటం వాళ్లే.

కంప్యూటర్ డిజైనర్స్
కంప్యూటర్ డిజైనర్స్ లో ఎక్కువ మంది లెఫ్టీసే ఉన్నారు. వీళ్లు కంప్యూటర్ డిజైనర్స్ గా రాణిస్తారు.

స్కాలర్ షిప్
లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్లకు స్కాలర్ షిప్ అందుతుంది.

రాజకీయాల్లో ఆదరణ
లెఫ్టీస్ ఎక్కువగా రాజకీయాల్లో ఎన్నుకోబడతారు. అమెరికా ప్రెసిడెంట్స్ చాలావరకు ఎడమచేతివాటం వాళ్లే ఉన్నారు. బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్ట్ బుష్, గెరాల్డ్ ఫోర్డ్... వీళ్లంతా ఎడమచేతి వాటం వాళ్లే.

గణిత సామర్థ్యం
చాలా పరిశోధనలు ఎడమచేతి మేధావికి మరియు అధిక గణిత సామర్థ్యం మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి. ఈజీగా లెక్కలు చేయగలుగుతారట.

ఇంటెలెక్చువల్ జీనియస్
ఎడమచేతివాటం వారిలో ప్రముఖులు, మేధావుల జాబితా పెద్దగా ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్, మేరీ క్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ వీరందరూ ఎడమచేతివాటం వారే.

సృజనాత్మకత
ఓ సిద్ధాంతం ప్రకారం, ఎడమచేతివాటం వాళ్ల మెదడు భిన్నంగా పని చేస్తుంది. అందుకే వీరిలో కుడిచేతివాటం వారికంటే ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది.



Click it and Unblock the Notifications











