Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోజూ మనుషులు కంపల్సరీ చేసే విచిత్రమైన పనులు
ఈ ప్రపంచంలో మనుషులంతా నిత్యం టన్నుల కొద్దీ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కొన్ని అలవాట్లు పుట్టుకతోనే అలవాటు అయిపోతాయి. వాటిని ఎవరూ మార్చలేరు. కొన్ని పనులు అదృష్టవశాత్తు కేవలం మనుషులు మాత్రమే చేయగలుగుతారు.

కొన్ని రకాల పనులు నలుగురిలో చేస్తే అందం.. మరికొన్ని ఒంటరిగా చేస్తే ఆనందం. ఏ పనులు నలుగురిలో స్వేచ్ఛగా చేయగలుగుతాం. ఎలాంటి పనులు ప్రతి ఒక్కరూ నిత్యం చేస్తూ ఉంటాం.. చేయాల్సి వస్తుంది. నిత్య జీవితంలో కామన్ అయిపోయిన కొన్ని విచిత్రమైన పనులేంటో చూద్దాం..

ఏడవడం
మనసుకి బాధగా అనిపిస్తే.. కళ్లలోంచి నీళ్లు రావడం.. తలుచుకుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ. ఇది ప్రతి ఒక్కరూ చేసే పనే. ఈ కన్నీటి ద్వారా ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేస్తాం. ఏ చిన్న బాధ కలిగినా వెంటనే కళ్ల ద్వారా ఎక్స్ ప్రెస్ చేయడం మనుషులకు మాత్రమే అలవాటైన పని.

ఎక్కిళ్లు
ఎక్కిళ్లు సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే చెస్ట్ లో ఉన్న కండరాలు ఇరిటేషన్ కు లోనవుతాయో అప్పుడు ఎక్కిళ్లు వస్తాయి. అంతేకాదు పొట్టలో ఎక్కువ మోతాదులో ఫుడ్ ఉన్నప్పుడు లేదా తక్కువ ఆహారం ఉన్నప్పుడు కండరాలు ఒత్తిడికి గురై ఎక్కిళ్లు వస్తాయి.

టాస్క్
రోజూ చేసే పనులపై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. బ్రష్ చేసుకోవడం, కాఫీ తాగడం వంటి వాటిని అసలు మానుకోలేరు. వీటిని తప్పకుండా నిత్యం చేస్తూనే ఉంటారు. అంతేకాదు నిత్యం అలవాటు అయిన ఏ టాస్క్ అయినా కంపల్సరీ చేస్తారు. ఉదాహరణకు వ్యాయామం, వాకింగ్, యోగా లాంటివి.

నిద్రపోవడం
మన జీవితంలో మూడో వంతు భాగాన్ని నిద్రకే వెచ్చిస్తాం. ఎవరూ నిద్ర లేకుండా ఉండలేరు. ఇది సాధారణంగా అందరూ చేసే పనుల్లో తప్పకుండా చేయాల్సిన వాటిలో ఒకటి. మెదడు ఉత్తేజం కావాలన్నా.. మెదడులో గ్రోత్ ఉండాలన్నా.. నిద్ర కంపల్సరీ.

చనిపోవడం
చనిపోవడం నిత్యం చేసే పనికాదు. అయితే రోజూ ఎంతో మంది మనుషులు చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతామంటే.. మన కణాలు చనిపోతాయి కాబట్టి. కణాలు ఎప్పటికప్పుడు 70 ఏళ్లపాటు మార్చుకుంటూ ఉంటాయి. కానీ అంతకంటే ఎక్కువ రోజులు కణాలలో అభివృద్ధి ఉండదు. అప్పుడే మనుషులు చనిపోతారు.

రెప్ప వాల్చడం
మనుషులు చేసే వాటిలో రెండో అతిపెద్ద పని రెప్ప వాల్చడం. ప్రతి రెండు సెకన్లకు ఒకసారి రెప్ప వాల్చుతూ ఉంటాం. ఇలా రెప్పవాల్చడం ద్వారా కంటి పొరలో నీటి శాతం తగ్గిపోకుండా ఉంటుంది. దుమ్ము, ధూళిని బయటకు పంపేస్తుంది.

సిగ్గుపడటం
ఇది చాలా తరుచుగా అందరూ ఎక్స్ ప్రెస్ చేస్తూ ఉంటారు. నలుగురిలో ఎక్కువ ఫోకస్ అయినప్పుడు చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. ఎదుటివాళ్ల నుంచి పొగడ్తలు వచ్చినప్పుడు, ఎమోషన్స్ ఎక్స్ ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో బ్లడ్ ఎక్కువ ఫ్లోలో వచ్చి బుగ్గలపై చేరడం వల్ల అవి ఎర్రగా మారి ఆకట్టుకుంటాయి.

నవ్వడం
ఒత్తిడి తగ్గించుకోవడానికి మనుషులు నవ్వడం అలవాటు చేసుకున్నారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. పాజిటివ్ ఎమోషన్స్ ని ఒకరి నుంచి మరొకరికి అందించడం ద్వారా ఒక్కసారిగా అందరూ నవ్వుతారట.

ముద్దు
రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్న సందర్భంలో ముద్దుపెట్టుకుంటారు. ఇద్దరి మధ్య శ్వాస ద్వారా కెమికల్ సిగ్నల్స్ పాస్ అవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అయితే ఇద్దరూ హెల్తీగా ఉన్నప్పుడు కిస్ ఆరోగ్యకరం.

షేవింగ్
షేవింగ్ అబ్బాయిలు చేసే పని. షేవింగ్ చేసుకోని అబ్బాయిలు అంత ఆకర్షణీయంగా ఉండరని చాలా మంది భావిస్తారు. అందుకే స్మార్ట్ గా కనిపించడానికి అబ్బాయిలు షేవింగ్ చేసుకుంటూ ఉంటారు.



Click it and Unblock the Notifications