For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిగరెట్ తాగే విధానమే.. వ్యక్తిత్వాన్ని తెలుపుతుందని తెలుసా ?

By Nutheti
|

సిగరెట్ కి పర్సనాలిటీకి సంబంధమేంటి అని ఆలోచిస్తున్నారా ? సిగరెట్ అనారోగ్యకరమని అంటూనే వ్యక్తిత్వానికి పొంతన పెడుతున్నారేంటి అని డైలమాలో పడ్డారా ? సిగరెట్ అనారోగ్యమే కానీ.. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే.. దాన్ని బట్టి మీ క్యారెక్టర్ ఈజీగా తెలుసుకోవచ్చు. సిగరెట్ ని బట్టి మీ పర్సనాలిటీలో విలక్షణతలు తెలుసుకోవచ్చట.

READ MORE: సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

ఈ విషయం ఆశ్చర్యం కలిగిస్తున్నా.. సిగరెట్ ద్వారా వ్యక్తిత్వాన్ని తెలపవచ్చని ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల క్రితమే కనుగొన్నారు. 1953లో లాస్ ఏంజెల్స్ కి చెందిన విలియమ్ నేత్రా అనే సైకాలజిస్ట్ జరిపిన అధ్యయనాల్లో.. సిగరెట్ తాగేటప్పుడు దాన్ని పట్టుకునే విధానాన్ని బట్టి వాళ్ల ఎమోషన్స్ ని, క్యారెక్టర్ ని తెలుసుకోవచ్చని వివరించారు. సిగరెట్ చెబుతున్న వ్యక్తిత్వ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే.

రెండు చేతులతో సిగరెట్ పట్టుకునే మహిళలు

రెండు చేతులతో సిగరెట్ పట్టుకునే మహిళలు

కొంతమంది మహిళలైతే రెండు చేతులతో పట్టుకుంటారు. ఇలా పట్టుకోవడం వల్ల వాళ్లు ఇన్ సెక్యూర్ గా ఫీలవుతున్నారని తెలుస్తోందని నేత్రా అంటున్నారు. వస్తువు పడిపోతుంది లేదా మన నుంచి జారిపోతుందని భయపడినప్పుడే.. అలా పట్టుకుంటాం. కాబట్టి ఇది ఆందోళనను కూడా తెలుపుతుంది. ఈ భయం కూడా తమకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామని లేదా వస్తువుని కోల్పోతామనే భావాన్ని సూచిస్తుందని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

ఆయాసం, అలసట

ఆయాసం, అలసట

సిగరెట్ ని పైకి చూపుతూ.. బొటనవేలు, చూపుడు వేళుతో పట్టుకునే అలవాటు ఉందా ? ఇలా పట్టుకునే మగవాళ్లు లేదా ఆడవాళ్లకైనా అలసట, ఆయాసం ఉన్నట్లు సూచిస్తుంది. చాలా బోర్ గా ఫీలవుతున్నవాళ్లు సిగరెట్ ని ఇలా పట్టుకుంటారట. అలాగే.. వీళ్లకు ఏమీ తోచదు కాబట్టి సిగరెట్ నే ఓ బొమ్మలా ఫీలవుతూ.. తమకు ఇబ్బంది కలిస్తున్న అంశాలను మరిచిపోవడానికి ప్రయత్నిస్తుంటారట. అలాగే ఇలాంటి వాళ్లు మానసికంగా అలసట ఫీలవుతుంటారు. ఈ విధమైన ఎమోషన్ లో ఉండే వాళ్లకు సిగరెట్ తప్ప మరేదీ.. ఎంటర్ టైన్ చేయలేదని ఫీలవుతుంటారు.

తెలివివైనవాళ్లు

తెలివివైనవాళ్లు

కొంతమంది తమకు తెలియకుండా.. తెలివి ప్రదర్శిస్తుంటారు. వీళ్లు చాలా తెలివైన వాళ్లు, ఆలోచనాపరులు. సిగరెట్ ని ఎవరైతే మధ్యవేలికి, చూపుడివేలికి మధ్యలో పట్టుకుంటారో వాళ్లు చాలా ఇంటెలిజెంట్స్. వీళ్ల ఆలోచనలను, తెలివిని బట్టి ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకుంటారు.

తెలివివైనవాళ్లు

తెలివివైనవాళ్లు

అయితే వీళ్ల ఆలోచనలను ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అవుతారు. ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలన్న విషయంలో జాగ్రత్త వహించరు. అయితే స్మోకింగ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. లంగ్స్, హార్ట్ దెబ్బతింటాయి.

నమ్మకంలేని లేదా విశ్వసనీయత లేని

నమ్మకంలేని లేదా విశ్వసనీయత లేని

సిగరెట్ ని మధ్యవేళ్లు, బొటనవేలు సహాయంతో పట్టుకునే వాళ్లు విశ్వసనీయత లేనివాళ్లుగా చూపిస్తోంది. చివరి వేలు తప్ప అన్ని వేళ్లతో పట్టుకుని.. సిగరెట్ ని కిందకు చూపిస్తూ పట్టుకునేవాళ్లను నమ్మకం కోల్పోతారు.

నమ్మకంలేని లేదా విశ్వసనీయత లేని

నమ్మకంలేని లేదా విశ్వసనీయత లేని

వీళ్లు చాలా డీప్ గా ఆలోచిస్తారు. అలాగే వీళ్ల క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడం కష్టం. ఇలా సిగరెట్ పట్టుకున్న మగవాళ్లను చూసిన అమ్మాయిలు వాళ్లతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే వీళ్లు నిజాయితీగా ఉండరు.

మొండిపట్టుదల కలిగినవాళ్లు

మొండిపట్టుదల కలిగినవాళ్లు

చూపుడు వేలు చివర, బొటనవేలు చివరి భాగాలతో సిగరెట్ ని పట్టుకునే వాళ్లు చాలా మొండిపట్టుదల కలిగి ఉంటారు. సిగరెట్ ని కిందవైపుకి చూపిస్తూ పట్టుకుని ఉంటారు. ఇతర వేళ్లన్నీ అరచేతిలో ముడుచుకుని ఉంటాయి. మూర్ఖంగా వ్యవహరించేవాళ్లు, పట్టువదలని వాళ్లు సిగరెట్ ని ఇలా పట్టుకుంటారు. వాళ్ల ఆలోచనలు తప్పని తెలిసినా.. వాళ్ల మాటే జరగాలని పట్టుపడతారు.

మొండిపట్టుదల కలిగినవాళ్లు

మొండిపట్టుదల కలిగినవాళ్లు

ఇలాంటి వ్యక్తులు తమ ఆలోచనలే కరెక్ట్ అని భావిస్తారు. వాళ్ల ఆలోచనలు అస్సలు మార్చులేరు. ఇలాంటి వ్యక్తిత్వం కారణంగా.. వాళ్ల జీవితంపై ప్రభావం చూపుతుంది. ప్రతి విషయంలో వివరాలు కోరుకుంటారు. ప్లాన్ లేకుండా పనులు చేస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం అవసరం.

ఫ్రెండ్లీ నేచర్

ఫ్రెండ్లీ నేచర్

సిగరెట్ పట్టుకునే విధానం ఇంచుమించు మొండిగా వ్యవహరించేవాళ్ల లాగే ఉంటుంది. అయితే మిగిలిన వేళ్లన్నీ అరచేతివైపు కాకుండా.. బయటకు చూపిస్తూ ఉంటాయి. వీళ్లు చాలా ఓపెన్ గా ఉంటారు. అంగీకరించే తత్వం కలిగి ఉంటారు. మంచి హాస్యపూర్వకంగా, రాజీపడే తత్వం కలిగి ఉంటారు. వీళ్లు చాలా ఫ్రెండ్లీగా, స్నేహితుల అవసరాలు తీర్చేవాళ్లై ఉంటారు.

ఫ్రెండ్లీ నేచర్

ఫ్రెండ్లీ నేచర్

వీళ్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, ఇతరుల ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటారని మరిన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీళ్లు ఎమోషన్స్ చాలా విలువనిస్తారు. దయాగుణం ఉంటుంది. ఇలా సిగరెట్ పట్టుకుని కనిపించిన వ్యక్తితో మాట్లాడటానికి ఏ మాత్రం వెనకాడకండి. ఎందుకంటే వీళ్లు చాలా ప్రశాంతమైన మనసు కలిగి ఉంటారు.

English summary

What Can Cigarettes Tell Us About Personality ?: How Cigarette can Reveal Your Personality

In 1953, a Los Angeles psychoanalyst named Dr. William Nuetra was studying how the position of a cigarette in one's hand can possibly signal certain character and emotional traits. He observed how a smoker holds a cigarette can be an indicator of personality.
Story first published: Wednesday, December 9, 2015, 12:27 [IST]
Desktop Bottom Promotion