Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కళ్ల ఆకారం చెప్పె ఆశ్చర్యకర అంశాలు
హొయలొలికిస్తూ.. రెప్ప వేసినా.. మూసినా.. భావోద్వేగాలను అద్భుతంగా చూపించే కలవల్లాంటి కళ్లు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. మనసులోని భావాల్ని మౌనంగా ఇతరులకు స్పష్టంగా చూపించేస్తాయి నయనాలు. అలాంటి కళ్లు.. అందానికి ప్రతిరూపమే కాదు.. వాళ్ల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ముఖాన్ని చూడగానే అందరికీ ముందుగా కనిపించేవి కళ్లు.. తర్వత ముక్కు, పెదాలు. అయితే స్పష్టంగా గమనిస్తే.. కళ్ల ఆకారం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి పెద్ద కళ్లు, మరికొందరికి చిన్న కళ్లు, ఇంకొందరికి లోతైన కళ్లు.. ఇలా విభిన్న ఆకారాల్లో ఉంటాయి. అయితే ఒక్కో కళ్ల ఆకారంలో ఒక్కో విశేషం దాగుంటుంది.
కొన్ని సందర్భాల్లో మీ మనసు పలకలేని భావాల్ని మీ కళ్లు చెబుతాయి. కాబట్టి.. మీ కళ్ల ఆకారం ఏంటి ? ఆ ఆకారం చెబుతున్న రహస్యాలేంటో చూసేయండి ? అంతేకాదు.. ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా పరిచయం లేకుండా.. ముందుగానే పసిగట్టండి.

బాదాం గింజల ఆకారం
బాదాం గింజల ఆకారంలో ఉండే కళ్లు క్రమశిక్షణను ప్రతిబింబిస్తాయి. వీళ్లు అందంగా.. ఆకర్షణీయంగా ఉంటారు. ఆల్మండ్ షేప్ లో కళ్లు ఉండే మహిళలు సెన్సిటివ్ గా ఉంటారు. ఎప్పుడూ హాస్యాన్ని ప్రదర్శిస్తూ.. కామన్ సెన్స్ తో ప్రవర్తిస్తారు.

గుండ్రంగా ఉంటే
గుండ్రంగా ఉండే కళ్లు కలిగిన మహిళలు.. చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీళ్ల మూడ్ తరచుగా మారుతూ ఉంటుంది. వీళ్ల చాలా అందంగా.. ఆకట్టుకునే విధంగా ఉంటారు. సామాజిక అంశాలపై వీళ్లకు అవగాహన ఉంటుంది. సంతోషంగా ఉంటారు. విభిన్నంగా ఆలోచిస్తారు.

క్లోజ్ సెట్
కళ్లు క్లోజ్ సెట్ గా ఉండే అమ్మాయిలకు కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఒక అంశాన్ని నిషితంగా పరిశీలిస్తున్నప్పుడు.. బిజీగా ఉన్నప్పుడు డిస్ర్టబ్ చేస్తే సహించలేరు. ప్రతి అంశంలోనూ వివరణాత్మకత కోరుకుంటారు. వీళ్లకు కోపం కూడా చాలా ఎక్కువ.

వైడ్ సెట్
వైడ్ సెట్ ఆకారంలో కళ్లు ఉండేవాళ్లలో ఓర్పు, సహనం చాలా ఎక్కువ. భవిష్యత్ ను వినూత్నంగా, గొప్పగా తీర్చిదిద్దుకుంటారు.

లోపలికి ఉండే కళ్లు
కళ్లు లోపలికి ఉండే మహిళలు ప్రగతిశీలులు. వీళ్లలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. గొప్ప వ్యాసకర్తలు కూడా.

పెద్ద కళ్లు
పెద్ద కళ్లు ఉండేవాళ్లు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. పెద్ద కళ్లు ఉండే మహిళలకు ఆసక్తికరమైన ఆలోచనలుంటాయి. వీళ్లకు సృజనాత్మకతతో పాటు.. ప్రత్యేక గుర్తింపు పొందే సత్తా ఉంటుంది. సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు.

చిన్న కళ్లు
చిన్న కళ్లు ఉండే వాళ్లు తమ చుట్టుపక్కల అన్ని అంశాలను బాగా పరిశీలిస్తారు. షార్ప్ గా ఆలోచిస్తారు.

డౌన్ టర్న్డ్
ఇలాంటి కళ్ల ఆకారం ఉన్న మహిళలు.. నిరాశావాదులుగా ఉంటారు. వీళ్లు తొందరగా.. నిరుత్సాహానికి లోనవుతారు.

అప్ టర్న్డ్
ఇలాంటి కళ్లను పిల్లి కళ్లు అంటుంటారు. అప్ టర్న్ కళ్లు ఉన్న మహిళలను ఆశావాదులుగా చెప్పవచ్చు. వీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. వీళ్లు ప్రకృతిపట్ల ఆసక్తికరంగా ఉంటారు. వీళ్లు కోరుకున్న దాన్ని సాధించుకుంటారు.

పడగ ఆకారంలో ఉండే కళ్లు
ఇలాంటి ఆకారంలో కళ్లు ఉండే మహిళలు.. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా.. ఎదుటివాళ్లకు సహాయపడతారు. సంతోషంగా ఉంటూ.. అందరినీ సంతోషపెడతారు. చూశారుగా.. ఎలాంటి కళ్లు ఏం చెబుతున్నాయో... ఇంకే మీ కళ్ల ఆకారం.. మీ మనస్తత్వం చెక్ చేసుకోండి.. ఎదుటి వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా కళ్లు చూసి అంచనావేయండి.



Click it and Unblock the Notifications