Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఏ వారం పుట్టిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుంది ?
పుట్టిన నక్షత్రాన్ని, సమయాన్ని, డేట్ ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతోంది. అయితే పుట్టిన రోజుని అంటే వారాన్ని బట్టి కూడా మనిషి స్వభావం తెలుసుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నారు. ఏ వారం పుట్టిన వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవచ్చు.
READ MORE: మీ ముఖం మీ వ్యక్తిత్వం గురించి ఏం చెపుతుంది?
మనుషులు భవిష్యత్ గురించి, ఇతరుల స్వభావాల గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు. అందుకోసం రకరకాలుగా.. ప్రయత్నిస్తూ ఉంటారు. స్వామీజీలు, పండితుల దగ్గర జాతకాలు, జ్యోతిష్యాల ద్వారా వ్యక్తిత్వాన్ని, భవిష్యత్ ని, జీవితాన్ని ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరితో పనిలేకుండా.. మీకు మీరు పుట్టిన వారం తెలిస్తే చాలు.. మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. లెట్స్ చెక్ ఔట్..

సోమవారం
సోమవారం పుట్టిన వాళ్లు చాలా సున్నిత స్వభావులు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకోగలుగుతారు.

మంగళవారం
మంగళవారం పుట్టినవాళ్లు చాలా యాక్టీవ్ గా, ఎనర్జిటిక్ గా ఉండటం ప్రత్యేకమైన గుణంగా చెప్పవచ్చు. చుట్టూ ఉన్న అంశాలపై వీళ్లు దృష్టి పెడతారు. కొత్తకొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు.

బుధవారం
మీరు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారా ? ఎప్పుడూ నవ్వుతూ ఉంటారా ? అయితే మీరు బుధవారం పుట్టినవాళ్లై ఉంటారు. బుధవారం పుట్టిన వాళ్లు మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. విషయాలు తెలుసుకోవడానికి క్యూరియస్ చూపిస్తారు.

గురువారం
గురువారం పుట్టిన వాళ్లు కూడా.. నవ్వుతూ ఉంటారు. ఎప్పుడూ గలగలా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఎప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.

శుక్రవారం
శుక్రవారం పుట్టినవాళ్లు చాలా తెలివైనవాళ్లు. చుట్టు పక్కల జరుగుతున్న విషయాలను ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. వీళ్లలో చెప్పుకోవాల్సిన మరో లక్షణం.. చాలా మర్యాదపూర్వకంగా మెలుగుతారు.

శనివారం
శనివారం పుట్టివాళ్లు పెయింటింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీళల్లు నవ్వుతూ ఉండటాన్నే, నవ్వేవాళ్లను ఎక్కువ ప్రేమిస్తారు. వీళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ల చిరునవ్వే వీళ్లలో ఆకట్టుకునే గుణం.

ఆదివారం
ఆదివారం పుట్టినవాళ్లకే ఇమాజినేషన్ పవర్ ఎక్కువ. కొత్త కొత్త విషయాలను కనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.



Click it and Unblock the Notifications