Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
జ్యోతిష్యంతో పని లేదు..!! గడ్డం ఆకారం చూస్తే చాలు..!!
మన వ్యక్తిత్వం, ఎదుటివాళ్ల మనస్తత్వం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు ఒకోలా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ఒక్కో సందర్భంలో అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలా స్వభావం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉండటం సహజం. ఎవరి స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు.
READ MORE: మెడ, గడ్డం మరియు ముఖం కొవ్వు కరిగించడానికి 10 చిట్కాలు
జాతకాలు, చేతి రేఖలు, పుట్టిన రోజుని, రాశులను బట్టి మనస్తత్వాలు కొంతవరకు అంచనా వేస్తుంటారు. వీటన్నింటికీ జ్యోతిష్యం తెలిసి ఉండాలి. కానీ జ్యోతిష్యంతో పని లేకుండా.. కేవలం ఎదుటివాళ్ల రూపురేఖలు గమనించి కూడా వాళ్ల క్యారెక్టర్ ని అంచనా వేసే టాలెంట్ ఇప్పుడు బయటపడుతోంది. కొన్ని అధ్యయనాల ద్వారా గడ్డం రూపుని బట్టి నేచర్ ని తెలుసుకోవచ్చట. ఒక్కొక్కరి గడ్డం ఒక్కో రకంగా ఉంటుంది. కొందరిది చిన్నగా ఉంటే.. కొందరిది పెద్దగా ఉంటుంది. దీన్ని గడ్డం రూపంలో ఉండే వ్యత్యాసాన్ని బట్టి వాళ్ల స్వభావం ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

చతురస్రాకారంలో గడ్డం
స్క్వేర్ షేప్ లో ఎవరికైతే గడ్డం ఉంటుందో వాళ్లు క్రూరంగా ఉంటారు. నిజాయితీని వీళ్లు అంగీకరించరు. వీళ్ల ఫీలింగ్స్, ఎమోషన్స్ వ్యక్తపరచడంలో ఫెయిల్ అవుతారు. వీళ్లు చాలా అహంకారంతో ఉంటారు. ఒంటరి రాత్రులు గడపడానికి ఇష్టపడతారు.

చిన్న గడ్డం
చిన్న గడ్డంతో పుట్టిన వాళ్లు ఫిలాసఫర్స్ గా మారడానికి ఛాన్స్ ఉంది. వీళ్లు చాలా లోతుగా ఆలోచిస్తారు. అలాగే చాలా తెలివైనవాళ్లు.

పొడుచుకు వచ్చినట్టు ఉండే గడ్డం
పొడుచుకు వచ్చినట్టుగా గడ్డం ఉన్నవాళ్లు చాలా స్ర్టాంగ్ గా ఉంటారు. లక్ష్యసాధన కోసం కష్టపడతారు. చాలా మంది సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్స్ కి ఇలాంటి గడ్డమే ఉంటుంది. వీళ్లు ప్రజాకర్షణతోపాటు లీడర్ షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువ. కష్టపడి పనిచేయడానికి ఏమాత్రం సంకోచించరు. లక్ష్యాలను చేరుకోవడానికి ఏవైనా వదులుకోవడానికైనా వెనకాడరు. ప్రేమ, కుటుంబం, ఫ్యామిలీ, రిలేషన్స్ వంటి వాటికి రెండో ప్రాధాన్యత ఇస్తారు.

గుండ్రటి గడ్డం
గుండ్రటి గడ్డం ఉన్నవాళ్లు సంతోషంగా, పాజిటివ్ గా ఉంటారు. వీళ్లు సహజమైన, కళాత్మకులై ఉంటారు. వీళ్లు మనసుతో ఆలోచిస్తారు. రోజూ చాలా హ్యాపీగా గడుపుతారు. ఎందుకంటే.. వీళ్లు తమ మనసు చెప్పినట్టు నడుచుకుంటారు. వీళ్లు జీవితంలో ఆనందాన్ని మాత్రమే చూస్తారు. కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పొడవాటి గడ్డం
వీళ్లు హ్యాపీ, లక్కీ స్వభావం కలిగినవాళ్లు. చాలా సులభంగా కలిసిపోయే తత్వం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. వీళ్లకు ఆయుష్షు ఎక్కువ. వీళ్ల స్వభావం కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి లోనవడానికి కారణమవుతుంది. వీళ్లకు వంట చేయడం అంటే చాలా ఇష్టం.

వెనక్కిపోయినట్టు ఉండే గడ్డం
గడ్డం వెనక్కిపోయినట్టు ఉండేవాళ్లు చాలా పాపులర్ అవుతారు. అలాగే మంచి గుర్తింపు సంపాదిస్తారు. జీవితంలో కలిసే ప్రతి ఒక్కరినీ ఇష్టపడతారు.. అలాగే ప్రతి ఒక్కరితో కలిసిపోతారు. వీళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉంటారు.
అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు అలాగే సందిగ్ధంలో ఉంటారు.



Click it and Unblock the Notifications











