Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీ కాలి వేళ్లను గమనించారా ? అక్కడే ఉంది అసలు జాతకం !!
తలరాతను మార్చే శక్తి మనకు లేదంటారు. కానీ మన భవిష్యత్ ఎలా ఉంది.. మనం జీవితంలో ఎప్వపుడు విజయం సాధిస్తాం.. ఎవరితో మన జీవితం ముడిపడి ఉంటుంది.. ఎలాంటి భార్య లేదా భర్త వస్తాడు.. ఎప్పుడు ఉద్యోగం వరిస్తుంది... ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఇలాంటి విషయాలన్నీ ముందుగానే తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తపిస్తూ ఉంటారు. అలా పుట్టుకొచ్చిందే జాతకం. కొంతవరకైనా తమ భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చని చాలా మంది చేతి రేఖల ద్వారా, జన్మ నక్షత్రం ద్వారా కనుక్కుంటూ ఉంటారు.
READ MORE: సింపుల్ హోం రెమెడీస్ తో సున్నితమైన...అందమైన పాదాలు మీ సొంతం
విధి రాతలు తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా చేతి రేఖలు చూస్తున్నవాళ్లు ఉన్నారు. మరికొందరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వాళ్ల భవిష్యత్ గురించి అంచనా వేస్తారు. మరికొందరు ఫేస్ రీడింగ్ తో.. వాళ్ల జాతకం వివరిస్తారు. అయితే చేతిరేఖలే కాదు.. కాలి వేళ్లలోనూ జాతకం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పాదాల వేళ్ల ఆకారం బట్టి.. వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. మీ గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకోండి.

రోమన్ ఫూట్
రోమన్ ఫూట్ అంటే.. మొదటి మూడు వేళ్లు ఒకే పొడవు ఉంటారు. తర్వాత రెండు వేళ్లు సమాన పొడవు ఉంటాయి. పెద్ద వేలి నుంచి మిగిలిన వేళ్లు 45 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఇలాంటి కాలి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీళ్లు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందులో ఎక్కువగా ప్రదేశాలు, సాంప్రదాయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కనపరుస్తారు. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలకు, పబ్లిక్ లో అనర్గళంగా మాట్లాడగలిగే వక్తలకు రోమన్ ఫూట్ ఉంటుంది.

చాలా పొడవైన వేళ్లు
చాలా పొడవైన వేళ్లు ఉన్న వ్యక్తులకు భావవ్యక్తీరణ చాలా బాగుంటుంది. ప్రతి విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు.. ప్రత్యేకంగా వాళ్ల అభిప్రాయాలు, భావాలు తెలియజేయడానికి ఆసక్తి కనపరుస్తారు. చాలా పొడవైన వేళ్లు ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. పబ్లిక్ లో బాగా మాట్లాడగలిగే సత్తా వీళ్లకు ఉంటుంది.

చివరి వేళు మధ్యవేళు వైపుగా వంగినట్టు
చివరి వేళు నాలుగో వేళి పైపుగా వాలి ఉన్నా... చివరి వేళు గోరు నాలుగో వేళుకు ఆనుకుని ఉండేవాళ్లు చాలా అసాధారణంగా ఉంటారు. వాళ్లు అనుకున్న ప్రకారమే ప్రతీదీ జరగాలని కోరుకుంటారు. తిరుబాటు భావం ఎక్కువగా ఉంటుంది.

రెండో వేళికి న్యారో బేస్ ఉంటే ( Narrow Base )
అంటే రెండో వేళి మొదట్లో ఇరుగ్గా ఉండి.. పైకి వచ్చే కొద్ది విశాలంగా ఉంటే.. అలాంటి వాళ్లు ఏ విషయాన్నైనా వ్యక్తీకరించగలుగుతారు. అయితే వీళ్ల మూడ్ సరిగ్గా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మూడ్ బాగోలేకపోతే అంతే సంగతులు. కాబట్టి.. మూడ్ బాగోలేదని గ్రహించినప్పుడు వాళ్లను ఒంటరిగా వదిలేయాలి. మళ్లీ మమూలు స్థితికి వచ్చాక పలకరించడం మంచిది.

గ్రీక్ వేళ్లు
గ్రీక్ ఫూట్ ఉన్న వాళ్లు అదృష్టవంతులే. రెండో వేలు పెద్ద వేళి కంటే పొడవుగా ఉంటే దాన్ని గ్రీక్ ఫూట్ అంటారు. ఇలాంటి వేలు ఉన్నవాళ్లు కళాత్మకంగా, స్పోర్టీవ్ గా ఉంటారు. వీళ్లు చాలా ఉత్సాహబరితంగా ఉంటారు. ఇతరులను మోటివేట్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్లకు ఎక్కువగా దూకుడు స్వభావం ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆర్టిస్ట్ లు, అథ్లెట్స్ కి గ్రీక్ ఫూట్ ఉంటుంది. వీళ్లు కూడా పబ్లిక్ స్పీకర్స్, ఇన్నోవేటర్స్ గా చెప్పవచ్చు.

మడమ చివర్ల హార్డ్ స్కిన్ (Hard skin Edge of the Heel)
మడమ భాగంలో చర్మం హార్డ్ గా ఉన్నవాళ్లు అభద్రతా భావంతో ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడాలని ఆరాటపడుతుంటారు.

పొడవాటి టోస్ ప్యాడ్స్ (Toe Pads)
వేలి క్రింద భాగం పెద్దదిగా ఉంటే లార్ట్ టోస్ ప్యాడ్స్ అని అర్థం. ఇలాంటి వాళ్లు ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచిస్తారు. ప్రతి అంశాన్నీ క్షుణంగా పరిశీలిస్తారు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త వహిస్తారు.

రెండో వేలికి మూడో వేలికి మధ్య దూరం
రెండో వేలికి మూడో వేలికి మధ్య దూరం ఎక్కువగా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అలా ఉంటే.. మీ ఎమోషన్స్ ని పక్కనపెట్టి చేయాలనుకున్న పని చేస్తారు. చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మీరు చేస్తున్న వర్క్ నచ్చకపోతే వెంటనే ఇంకొకటి చూసుకుంటారు. అలా కొత్త కొత్త ఆలోచనలు, మార్పులతో సంతోషంగా ఉండాలనుకుంటారు.

స్క్వేర్ ఫూట్
అన్ని వేళ్లు సమానమైన పొడవు కలిగి ఉంటే.. స్క్వేర్ ఫూట్ అంటారు. ఇలాంటి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆచు తూచి ఆలోచనలు తీసుకుంటారు. ప్రతిఫలం చాలా ఆచరణాత్మకంగా, నమ్మదగినదిగా ఉంటుంది.

మూడో వేళు వంగినట్టు( Tilted )
మధ్య వేలు.. చివరివైపుగా వంగినట్టు ఉంటే టిల్టెట్ టోయ్ అంటారు. ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే వాళ్లుగా ఉంటారు.

చివరి, చిన్న వేళుని విడదీయగలిగితే..
చివరి వేళుని అన్ని వేళ్కు దూరంగా విడదీయడానికి వీలుగా ఉందా. అయితే మీ జీవితంలో మీరు తరచుగా మార్పులు చేసుకుంటూ ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతారు. రొటీన్ జీవితాన్ని అసలు ఇష్టపడరు. బోర్ గా ఫీలైన వెంటనే.. కొత్తగా ఆలోచించడం మొదలుపెడతారు.

స్ట్రెచ్డ్ ఫూట్ ( Stretched Foot )
పెద్ద వేలు.. అంటే బొటన వేలు పొడవుగా ఉండి.. దాని తర్వాత వేలులన్నీ క్రమంగా పొడవు తగ్గుతూ వస్తే.. దాన్ని స్ట్రెచ్డ్ ఫూట్ అంటారు. ఫ్రైవసీ కోరుకునే వాళ్లకు, తమ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని బయటపెట్టని వాళ్లకు ఈ స్ట్రెచ్డ్ ఫూట్ ఉంటుంది. వీళ్ల మూడ్ చాలా సడెన్ గా మారిపోతూ ఉంటుంది.

నాలుగో వేలి నుంచి చివరి వేలు విడదీయలేకపోతే
నాలుగో వేలి నుంచి చివరి వేలుని విడదీయలేక పోతే అలాంటివాళ్లు.. రొటీన్ లైఫే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉందని ఫీలవుతారు. ఇలాంటి వాళ్లు చాలా నమ్మదగినవాళ్లు. ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు.. వీళ్లపై ఆధారపడి ఉంటడానికి ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications











